ETV Bharat / technology

గూగుల్​ పిక్సెల్ 9ప్రో సేల్స్ ప్రారంభం- ధర, ఫీచర్లు ఇవే..! - GOOGLE PIXEL 9 PRO PRE ORDERS

ఇండియాలో ప్రారంభమైన పిక్సెల్ 9ప్రో సేల్స్- మరెందుకు ఆలస్యం వెంటనే ఆర్డర్​ చేసుకోండి!

Google Pixel 9 Pro
Google Pixel 9 Pro (Google India)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 17, 2024, 8:03 PM IST

Google Pixel 9 Pro Pre Orders Start in India: కొత్త స్మార్ట్​ఫోన్ కొనాలనుకునే వారికి ఇది మంచి సమయం. మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోన్ ప్రీ- ఆర్డర్​ సేల్ నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఆగస్టులో గూగుల్​ తన సొంత బ్రాండ్​ పిక్సెల్​ కొత్త మోడల్​ పిక్సెల్ 9 సిరీస్​ మొబైల్స్​ను రిలీజ్ చేసింది. వీటిలో గూగుల్ పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్‌ ఫోన్లు ఉన్నాయి.

ఇందులో పిక్సెల్ ప్రో వేరియంట్ ఇదివరకే ఇండియన్ మార్కెట్లో సేల్స్​కు వచ్చింది. అయితే వీటిలో పిక్సెల్ 9 ప్రో మాత్రం ఇంకా ఇండియన్ మార్కెట్లో లాంచ్ కాలేదు. అయితే తాజాగా వీటి సేల్స్​ను అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన టెక్​ దిగ్గజం గూగుల్ ప్రారంభించింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి భారత మార్కెట్లో గూగుల్​ పిక్సెల్ 9 ప్రో సేల్స్​ ప్రారంభమయ్యాయి. ఈ కొత్త స్మార్ట్​ఫోన్ ఫ్లిప్​కార్ట్​తో పాటు ఆఫ్​లైన్​ రిటైల్​ స్టోర్స్​ అయిన రిలయన్స్ డిజిటల్, క్రోమాలో అందుబాటులో ఉంటాయని గూగుల్ తెలిపింది. ఈ సందర్భంగా గూగుల్ పిక్సెల్ 9ప్రో ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై మరిన్ని వివరాలు మీకోసం.

గూగుల్ పిక్సెల్ 9ప్రో స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్:

  • డిస్‌ప్లే: 6.3-అంగుళాల ఎల్​టీఓపీ ఓఎల్​ఈడీ
  • రిజల్యూషన్: 1280 x 2856 పిక్సెల్​ రిజల్యూషన్
  • బ్యాటరీ: 4,700mAh
  • రిఫ్రెష్ రేట్‌: 120Hz
  • బ్రైట్​నెస్​: 3,000 నిట్స్​
  • సెక్యూరిటీ చిప్‌సెట్‌: టైటాన్ ఎమ్2
  • మెయిన్ కెమెరా: 50ఎంపీ
  • అల్ట్రావైడ్ కెమెరా: 48ఎంపీ
  • ఫ్రంట్ కెమెరా: 42ఎంపీ
  • స్పెషాలిటీ: డస్ట్​ అండ్ వాటర్ రెసిస్టెన్సీ

గూగుల్ పిక్సెల్ 9ప్రో కనెక్టివిటీ ఫీచర్లు:

  • WI-FI
  • బ్లూటూత్ 5.3
  • NFC
  • గూగుల్ క్యాస్ట్
  • GPS
  • డ్యూయల్ బ్యాండ్ GNSS
  • GLONASS
  • యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్
  • ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టం

గూగుల్​ టెన్సర్​ G4 ప్రాసెసర్​పై ఈ కొత్త గూగుల్ పిక్సెల్​ 9ప్రో ఫోన్ పనిచేస్తుంది.

గూగుల్ పిక్సెల్ 9ప్రో మొబైల్​లో కలర్ ఆప్షన్స్:

  • హాజెల్
  • పోరసెలియన్
  • రోజ్ క్వార్ట్జ్
  • అబ్సిడియన్

గూగుల్ పిక్సెల్ 9ప్రో ధర: 16జీబీ+256జీబీ వేరియంట్ ధర: రూ. 1,09,999గా గూగుల్ నిర్ణయించింది.

యూజర్స్​కు షాక్​ ఇచ్చిన అమెజాన్- ఇకపై ప్రైమ్​ వీడియోలో యాడ్స్..!

ఆండ్రాయిడ్ 15 అప్​డేట్​ వచ్చేసిందోచ్​- ఈజీగా యాక్టివేట్ చేసుకోండిలా..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.