ETV Bharat / technology

ఏఐ టెక్నాలజీతో సీవీ- కంగుతిన్న సీఈవో- వైరల్​గా మారిన స్క్రీన్​షాట్

చాట్​-​జీపీటీతో సీవీ రూపొందించిన నిరుద్యోగి- దాన్ని చూసిన కంపెనీ సీఈవో షాక్..!

Jobseekers CV Mistakes
Jobseekers CV Mistakes (ETV Bharat)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 17, 2024, 1:36 PM IST

Delhi CEO Viral Screenshot: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడం కోసం అభ్యర్థులు ఎంతగానో శ్రమిస్తారు. జాబ్‌ ఓపెనింగ్స్‌ ఉన్నాయంటే చాలు ఆకర్షణీయంగా సీవీలు రూపొందించేందుకు సిద్ధమైపోతారు. ఒకప్పుడు సీవీ రూపొందించాలంటే తీవ్రంగా శ్రమించాల్సివచ్చేది. ఒకటికి పదిసార్లు చూసుకొని తప్పులు సరిచేసుకోవాల్సి వచ్చేది.

కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. చాట్‌జీపీటీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక చాలామంది దీని సాయంతో సులువుగా సీవీని క్రియేట్‌ చేసేస్తున్నారు. అలా ఈ సాంకేతికత సాయంతో ఓ అభ్యర్థి తన సీవీని ఆసక్తికరంగా రూపొందించి కంపెనీకి పంపాడు. అది చూసిన సీఈవో కంగుతిన్నారు.

ఎంట్రేజ్‌ సంస్థ సీఈవో అనన్య నారంగ్‌కు ఇటీవల ఓ ఉద్యోగం కోసం అప్లికేషన్ వచ్చింది. దాన్ని చూసిన ఆమె షాక్‌ తిన్నారు. సాధారణంగా చాట్‌జీపీటీని ఫలానా జాబ్​ కోసం అప్లికేషన్ క్రియేట్ చేయమని చెబితే.. ఆ ఏఐ ప్లాట్‌ఫామ్‌ సంబంధిత టెంప్లేట్‌ను చిటికెలో క్రియేట్‌ చేసి ఇస్తుంది. అయితే అందులోని కొన్ని విషయాలను మనమే ఫిల్​ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ అభ్యర్థి చాట్‌జీపీటీ రూపొందించిన జాబ్‌ అప్లికేషన్‌ను అలాగే కంపెనీకి పంపించేశాడు.

అందులో స్కిల్స్, ఎక్స్​పీరియన్స్​ వద్ద ఉదాహరణ.. అని ఉండటాన్ని చూసిన సీఈవో ఆశ్చర్యపోయారు. ఈ అప్లికేషన్​ కోసం అభ్యర్థి చాట్‌జీపీటీని ఉపయోగించాడనే విషయం స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేశారు. నిరుద్యోగం ఉందనడంలో ఆశ్చర్యం లేదంటూ ఆమె వ్యాఖ్యలు జత చేశారు.

'ఇలాంటి జాబ్ అప్లికేషన్లపై ఎలా స్పందించాలి?' అంటూ ఎక్స్‌ వేదికగా సలహాలు అడిగారు. "చాలామంది అభ్యర్థుల మాదిరిగానే ఈ వ్యక్తి కూడా చాట్‌జీపీటీ సాయంతో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే పంపించే ముందు మరోసారి దాన్ని చదవలేదు" అంటూ ఆమె అసహనం వ్యక్తంచేశారు. ఈ కారణంగానే నేడు మనకు నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్​గా మారింది.

జాబ్ అప్లికేషన్​లో చాట్​జీపీటీ వంటి ఏఐ టూల్స్​ను ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలపై ఆమె షేర్​ చేసిన స్క్రీన్​ షాట్ విస్తృత చర్చకు దారితీసింది. చాట్‌జీపీటీ వచ్చాక ఇలాంటి అప్లికేషన్స్ సాధారణమైపోయాయని కొందరు రిక్రూటర్లు వెల్లడించారు.

మిడిల్​ క్లాస్​ కోసం జియో కొత్త యాప్- ఇకపై ఇంట్లో టీవీలు చిటికెలో కంప్యూటర్లుగా..!

యూట్యూబ్​లో కొత్త ఫీచర్లు- వీటి ఉపయోగం తెలిస్తే వావ్ అనాల్సిందే!- ఇవెలా పనిచేస్తాయంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.