ETV Bharat / offbeat

గుత్తి వంకాయను మించిన "వంకాయ గుజ్జు కూర" - ఇలా చేశారంటే ఫుల్​ ఖుష్​ అయిపోవాల్సిందే! - HOW TO PREPARE VANKAYA GUJJU KURA

- రొటీన్ వంకాయ​ కర్రీ కాకుండా.. ఇలా ట్రై చేయండి - రైస్​, చపాతీలకు పర్పెక్ట్​ రెసిపీ

How to prepare Vankaya Gujju Kura
How to prepare Vankaya Gujju Kura (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 28, 2024, 1:54 PM IST

How to prepare Vankaya Gujju Kura: వంకాయ.. ఈ పేరు చెప్పగానే చాలా మందికి నోరూరిపోతోంది. ఇక వీటితో చేసే రెసిపీలు ఏవైనా సరే ఇష్టంగా తింటారు. అయితే, ఇప్పటి వరకు వంకాయతో ఎన్నో రకాల రెసిపీలు ట్రై చేసి ఉంటారు. కానీ, ఓసారి ఇలా "వంకాయ గుజ్జు కూర" ప్రిపేర్ చేసుకొని చూడండి. టేస్ట్​ అద్భుతంగా ఉండి.. తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది. పైగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సులువు. రైస్​, చపాతీలకు సూపర్​ కాంబినేషన్​. మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

  • లేత వంకాయలు - పావు కేజీ
  • ఉల్లిపాయ - 1(మీడియం సైజ్​)
  • టమాటలు - 2(మీడియం సైజ్​)
  • నూనె - 1 టేబుల్​ స్పూన్​
  • ఇంగువ - చిటికెడు
  • పసుపు - పావు టీ స్పూన్​
  • ఉప్పు - రుచికి సరిపడా

తాలింపు కోసం:

  • నూనె - 3 టేబుల్​ స్పూన్లు
  • మెంతులు - అర టీ స్పూన్​
  • తాలింపు గింజలు(మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు) - 1 టేబుల్​ స్పూన్​
  • దంచిన వెల్లుల్లి రెబ్బలు - 4
  • ఎండు మిర్చి - 3
  • పచ్చిమిర్చి చీలికలు - 4
  • కారం - 2 టీ స్పూన్లు
  • ధనియాల పొడి - ఒకటిన్నర టీ స్పూన్లు
  • జీలకర్ర పొడి - పావు టీ స్పూన్​
  • చింతపండు - ఉసిరికాయ సైజ్​
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • బెల్లం - 1 టీ స్పూన్​(ఆప్షనల్​)

తయారీ విధానం:

  • ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి సన్నగా, పొడుగ్గా కట్​ చేసి.. ఉప్పు వేసిన నీటిలో వేసి పక్కన పెట్టండి.
  • అలాగే ఉల్లిపాయ, టమాటలను కూడా సన్నగా కట్​ చేసి పక్కన పెట్టుకోవాలి.
  • మరో గిన్నెలో చింతపండును నానబెట్టి గుజ్జు తీసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్ చేసి పాన్​ పెట్టి ఇంగువ వేసి వేయించుకోవాలి.
  • ఆ తర్వాత వంకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, 1 టీ స్పూన్​ ఉప్పు వేసి స్టవ్​ను లో టూ మీడియంలో పెట్టి ముక్కలు వేగే వరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత సిమ్​లో పెట్టి, టమాట ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. టమాట మెత్తగా ఉడికే వరకు మగ్గించుకోవాలి.
  • ముక్కలు ఉడికిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి చల్లార్చుకోవాలి. అనంతరం మిక్సీ జార్​లోకి తీసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత మెంతులు వేసి ఎర్రగా వేయించుకోవాలి.
  • మెంతులు వేగిన తర్వాత తాలింపు గింజలు వేసి ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
  • అనంతరం కచ్చాపచ్చగా గ్రైండ్​ చేసుకున్న వంకాయ మిశ్రమం వేసుకుని సిమ్​లో పెట్టి బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత కారం, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.
  • మసాలాల మగ్గిన తర్వాత చింతపండు గుజ్జును పోసి బాగా కలపాలి. అయితే ఇక్కడ పులుపుకు తగినట్లుగా ఉప్పు, కారం ఉండాలి.
  • చింతపండు రసం పోసిన బెల్లం వేసి సిమ్​లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ నూనె పైకి తేలేంతవరకు మగ్గించుకోవాలి.
  • చివరగా కొత్తిమీర తరుగు వేసి కలిపి దించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ గుజ్జు కూర రెడీ. నచ్చితే మీరూ ఇంట్లో ట్రై చేయండి.

కార్తిక మాసం స్పెషల్​ "ఆలూ పులావ్​, వంకాయ మసాలా " - ఇలా చేస్తే ఒక్క మెతుకు వదలకుండా ఇష్టంగా తింటారు!

లఖ్​నవూ స్పెషల్​ "మలై గుత్తొంకాయ కుర్మా" - ఒక్కసారి టేస్ట్ చేశారంటే జిందగీ ​ఖుష్ అయిపోతుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.