ETV Bharat / entertainment

పీరియాడికల్ డ్రామాలో అఖిల్- డైరెక్టర్ ఎవరంటే? - AKKINENI AKHIL NEXT MOVIE

Akkineni Akhil Next Movie : అక్కినేని అఖిల్ 'ఏజెంట్' సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. కానీ, ప్రస్తుతం రెండు సినిమాలు లైన్​లో పెట్టే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

Akkineni Akhil Next Movie
Akkineni Akhil Next Movie (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 17, 2024, 8:24 PM IST

Akkineni Akhil Next Movie : యంగ్ హీరో అక్కినేని అఖిల్ భారీ అంచనాలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఒకట్రెండు సినిమాలకు పాజిటివ్ రెస్పాన్స్​ వచ్చినా, ఇప్పటివరకు భారీ హిట్ అందుకోలేదు. గతేడాది భారీ బడ్జెట్​తో తెరకెక్కిన 'ఏజెంట్' సినిమా అంచనాలు అందుకోలేదు. ఇక ఆ సినిమా వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా అఖిల్ మరో సినిమా అనౌన్స్ చేయలేదు. అయితే ఈసారి ఎలాగైనా భారీ విజయం ఖాతాలో వేసుకోవాలనే కసితో అఖిల్‌ ఉన్నట్లు కనిపిస్తోంది. అఖిల్ ప్రస్తుతం జుట్టు ఎక్కువగా పెంచుకుని కనిపిస్తున్నారు. తన అప్​కమింగ్ మూవీ కోసమే ఈ హెయిర్‌ స్టైల్‌ అని ప్రచారం జరుగుతోంది.

నెక్ట్స్​ సినిమా అదే!
అఖిల్ తదుపరి చిత్రం గురించి సోషల్‌ మీడియాలో అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. ఓ పీరియాడికల్ డ్రామాలో అఖిల్‌ నటిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై తండ్రి, ప్రముఖ హీరో నాగార్జున ఈ సినిమాను భారీ బడ్జెట్​తో నిర్మించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. 'వినరో భాగ్యము విష్ణు కథ' ఫేమ్ మురళీ కిషోర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కానీ, సినిమాకి సంబంధించిన ముందస్తు పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సినీవర్గాల టాక్. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్లు సమాచారం.

కొత్త దర్శకుడికి ఛాన్స్‌ ఇస్తారా?
అలానే యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో కొత్త దర్శకుడు అనిల్ కుమార్‌తో కలిసి అఖిల్‌ పని చేస్తారని కొన్ని నెలలుగా ప్రచారం జరిగింది. అఖిల్‌ తదుపరి సినిమా ఇదేనని చాలా మంది భావిస్తున్నారు. అనిల్‌ కుమార్‌ 'సాహో' సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్​గా పనిచేశారు. ఈ కొత్త డైరెక్టర్‌ చెప్పిన కథకి అఖిల్‌ ఫిదా అయిపోయారని, స్క్రిప్ట్‌ కూడా ఓకే చేశారని తెలిసింది. ఈ సినిమా కోసమే హెయిర్‌ పెంచుతున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆఖిల్ రెండు సినిమాలు ఒకేసారి ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దీంతో అటు అక్కినేని అభిమానులు కూడా అఖిల్ తదుపరి సినిమా ఎలా ఉండనుందోనని ఆత్రుతగా ఉన్నారు.

అఖిల్‌ అప్పటి వరకు ఫ్యాన్స్​ ముందుకు రానన్నాడు : నాగార్జున - Nagarjuna Comments on Akhil

అఖిల్ నెక్ట్స్ ప్రాజెక్ట్​కు రంగం సిద్ధం- షూటింగ్​కు ముహూర్తం ఫిక్స్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.