ETV Bharat / offbeat

బ్యాచిలర్​ మటన్ పులావ్ కుక్కర్​లో!- వంటరాని వారు కూడా చేసుకోవచ్చు - HOW TO PREPARE MUTTON PULAO

- హోటల్​ టేస్టీతో అద్దిరిపోయే రెసిపీ - ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేయండి

How to Prepare Mutton Pulao Recipe
How to Prepare Mutton Pulao Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Oct 17, 2024, 4:53 PM IST

How to Prepare Mutton Pulao Recipe in Pressure Cookee: మీకు మటన్ పులావ్ అంటే ఇష్టమా? కానీ వండాలంటే చాలా కష్టమని, పెద్ద ప్రక్రియ అని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు చెప్పబోయే పద్ధతిలో చేస్తే బ్యాచిలర్స్​తో పాటు వంట సరిగ్గా రాని వాళ్లు సైతం ఈ రెసిపీని చాలా ఈజీగా చేసుకుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం..? ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్ధాలు

  • 4 టేబుల్ స్పూన్ల నూనె/నెయ్యి
  • 2 ఇంచుల దాల్చిన చెక్క
  • ఒక అనాస పువ్వు
  • 6 లవంగాలు
  • 6 యాలకలు
  • ఒక టీ స్పూన్ షాజీరా
  • ఒక నల్ల యాలక
  • ఒక బిర్యానీ ఆకు
  • ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు
  • 6 పచ్చిమిరపకాయలు
  • 1 టీ స్పూన్ గరం మసాలా
  • రెండు చిటికెల పసుపు
  • అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి
  • రుచికి సరిపడా ఉప్పు
  • ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 2 టేబుల్ స్పూన్ల ఎండిన గులాబీ రేకులు/ రోజ్ వాటర్
  • ఒకటిన్నర కప్పుల బాస్మతి బియ్యం
  • 300 గ్రాముల లేత మటన్

తయారీ విధానం

  • ముందుగా మటన్​ను తీసుకుని శుభ్రంగా కడిగి అందులో రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.
  • మరోవైపు బాస్మతి బియ్యాన్ని కూడా శుభ్రంగా కడిగి సుమారు గంటపాటు పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ వెలిగించి ప్రెషర్ కుక్కర్​లో నూనె పోసి అందులో బిర్యానీ ఆకు, అనాస పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల యాలక, యాలకలు, షాజీరా వేసి కాసేపు వేయించుకోవాలి.
  • మసాలాలు వేగుతున్న సమయంలోనే ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించుకుని.. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లులి పేస్ట్ వేసుకుని వేగనివ్వాలి.
  • ఇప్పుడు మటన్ వేసి సుమారు 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇందులోనే జీలకర్ర పొడి, ఉప్పు, గరం మసాలా, పసుపు వేసి మరో నిమిషం పాటు ఫ్రై చేయాలి.
  • ఆ తర్వాత ఇందులో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి మటన్ మెత్తగా అయ్యేవరకు ఉడికించుకోవాలి.
  • మటన్ ఉడికిన తర్వాత అందులోనే మరో కప్పు నీరు, ఉప్పు, పుదీనా, కొత్తిమీర, నానబెట్టిన బాస్మతి బియ్యం, ఎండిన గులాబీ రేకులు వేసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్​పై ఒక విజిల్ వచ్చేవరకు చూడాలి.
  • ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసి సుమారు 20 నిమిషాల పాటు పక్కన పెట్టి ఆ తర్వాత అడుగు నుంచి ఒకసారి బాగా కలపాలి.
  • అంతే ప్రెషర్ కుక్కర్​లో టేస్టీ మటన్ పులావ్ రెడీ! దీనిని మిర్చీ కా సాలన్ ఇంకా పెరుగుతో సర్వ్ చేసుకుంటే అద్దిరిపోతుంది.

అసలు సిసలైన ఆంధ్రా స్టైల్​ "నాటుకోడి వేపుడు" - ఈ పద్ధతిలో చేశారంటే తినేకొద్దీ తినాలనిపిస్తుంది!

తెలంగాణ పెళ్లిళ్ల స్పెషల్ "రెడ్ చికెన్" - ఈ పద్ధతిలో చేస్తే టేస్ట్ అదుర్స్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.