తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

శ్రీకృష్ణాష్టమి స్పెషల్ : బాలగోపాలుడుకి ఈ నైవేద్యాలు చేసి పెట్టండి - ఆయన అనుగ్రహం మీపై తప్పక ఉంటుంది! - Krishna Janmashtami 2024 - KRISHNA JANMASHTAMI 2024

Krishna Janmashtami 2024: కృష్ణాష్టమి రోజున వెన్నదొంగకు నైవేద్యంగా సమర్పించేందుకు పాలు, పెరుగు, వెన్న లాంటివి ఉండనే ఉంటాయి. అవి కాకుండా.. ఇంకేం చేయొచ్చని ఆలోచిస్తున్నారా? అయితే, మీకోసం జన్మాష్టమి సందర్భంగా రెండు స్పెషల్ రెసిపీలు తీసుకొచ్చాం. వాటిపై ఓ లుక్కేయండి.

Krishna Janmashtami Special Recipes
Krishna Janmashtami 2024 (ETV Bharat)

By ETV Bharat Features Team

Published : Aug 25, 2024, 11:16 AM IST

Krishna Janmashtami Special Recipes: శ్రీ కృష్ణాష్టమి.. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండగలలో ఒకటి. ఈ పర్వదినాన్నే.. జన్మాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి వంటి పేర్లతో కూడా పిలుస్తుంటారు. ఈ రోజు చాలా మంది ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంకాలం భక్తి శ్రద్ధలతో కన్నయ్యను పూజిస్తుంటారు. అంతేకాదు.. కృష్ణాష్టమి(Janmashtami 2024)రోజున వెన్నదొంగకు నివేదించేందుకు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి లాంటి వాటితో కొన్ని వంటకాలు ప్రిపేర్ చేసి నివేదిస్తుంటారు. అందుకే.. మీకోసం జన్మాష్టమిని పురస్కరించుకొని కొన్ని స్పెషల్ రెసిపీలు తీసుకొచ్చాం. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

షకర్కంద్ కా హల్వా :

కావాల్సిన పదార్థాలు :

  • స్వీట్ పొటాటో - 500 గ్రాములు
  • నెయ్యి - 2 టేబుల్​స్పూన్లు
  • చక్కెర - 150 గ్రాములు
  • యాలకుల పొడి - అర టీస్పూన్
  • కుంకుమపువ్వు - కొద్దిగా
  • తరిగిన బాదం, జీడిపప్పు, పిస్తా పలుకులు - కొన్ని

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా స్వీట్ పొటాటోలను ఉడికించుకొని పై పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆపై వాటిని ఒక బౌల్​లో వేసి మెత్తగా మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అది కరిగి కాస్త వేడయ్యాక మాష్ చేసుకున్న స్వీట్ పొటాటోను వేసుకోవాలి.
  • తర్వాత నెయ్యి స్వీట్ పొటాటో మిశ్రమం మొత్తానికి పట్టేలా మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి 5 నుంచి 8 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఎలాంటి ముద్దలు లేకుండా మెత్తని పేస్ట్​లా ప్రిపేర్ చేసుకోవాలి.
  • ఆవిధంగా ప్రిపేర్ చేసుకున్నాక.. పంచదార, యాలకుల పొడి వేసి కలుపుకుంటూ మిశ్రమం కాస్త రంగు మారేవరకు వేయించుకోవాలి.
  • అనంతరం స్టౌ ఆఫ్ చేసి మిశ్రమాన్ని ప్లేట్​లోకి తీసుకొని కాస్త కుంకుమ పువ్వు, కొద్దిగా మిక్స్డ్ నట్స్ వేసి గార్నిష్ చేసుకోవాలి. ఆ తర్వాత చిన్ని కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించుకుంటే సరిపోతుంది!

పట్టిందల్లా బంగారం కావాలా? - "కృష్ణాష్టమి" రోజు కన్నయ్యను ఈ పూలతో పూజించండి!

పనీర్‌ మలై లడ్డు :

కావాల్సిన పదార్థాలు :

  • రెండు లీటర్లు - వెన్నతీయని పాలు
  • రెండు టేబుల్‌స్పూన్లు - నిమ్మరసం
  • అర చెంచా - నెయ్యి
  • పావుకప్పు - పాలు
  • ముప్పావుకప్పు - పాలపొడి
  • పావుకప్పు - క్రీమ్
  • ముప్పావుకప్పు - కండెన్స్​డ్​మిల్క్
  • పావుచెంచా - యాలకులపొడి

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా స్టౌ మీద ఓ గిన్నె పెట్టుకొని వెన్నతీయని పాలను పోసుకోవాలి. అవి మరుగుతున్నప్పుడు నిమ్మరసం వేసి కలపాలి.
  • అప్పుడు పాలు విరుగుతాయి. ఆపై మెత్తని వస్త్రంలో ఆ మిశ్రమాన్ని వేసుకుని నీరంతా పోయేవరకూ వడకట్టుకుని పనీర్​ మిశ్రమంలా చేసి పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ మీద కడాయి పెట్టి నెయ్యి వేసుకోవాలి. అది కరిగి వేడెక్కాక పాలు పోసుకోవాలి. అవి మరుగుతున్నప్పుడు పాలపొడి వేసి కలుపుకోవాలి.
  • ఐదు నిమిషాలయ్యాక క్రీమ్​, కండెన్స్​డ్​ మిల్క్​ వేసి మరో మూడు నిమిషాలు కలుపుకోవాలి.
  • ఆ తర్వాత ముందే ప్రిపేర్​ చేసుకున్న పనీర్​ మిశ్రమం, యాలకుల పొడి వేసి కలుపుకోని మంటను లో ఫ్లేమ్​లో పెట్టుకోవాలి.
  • ఇక ఈ మిశ్రమం దగ్గరకు అవుతున్నప్పుడు దింపేసి.. వేడి కొద్దిగా చల్లారాక లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే.. పనీర్‌ మలై లడ్డూలు రెడీ! ఆపై వీటిని కన్నయ్యకు నైవేద్యంగా సమర్పించండి.

కృష్ణాష్టమి స్పెషల్​: కన్నయ్యకు ఇష్టమైన "అటుకుల లడ్డూ" - ఈ టిప్స్​ పాటిస్తూ చేస్తే సూపర్​ టేస్ట్​!

ABOUT THE AUTHOR

...view details