తెలంగాణ

telangana

IRCTC నార్త్​ ఇండియా టూర్​ - రూ.35వేలకే ఈ ప్రదేశాలన్నీ చూడొచ్చు - పైగా ఫ్లైట్​ జర్నీ! - National Heritage of North India

By ETV Bharat Features Team

Published : Aug 22, 2024, 2:09 PM IST

IRCTC Tour Packages: పర్యాటక ప్రదేశాలను సందర్శించాలనుకునే వారి కోసం ఐఆర్​సీటీసీ అద్దిరిపోయే ప్యాకేజీ తీసుకొచ్చింది. తక్కువ ధరకే నార్త్​ ఇండియాలో పలు ప్రదేశాలు చూసేందుకు టూర్​ ఆపరేట్​ చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

IRCTC Tour Packages
IRCTC National Heritage of North India Tour (ETV Bharat)

IRCTC National Heritage of North India Tour: ఉత్తర భారతదేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలను చుట్టేసి రావాలని ఉందా? కాస్ట్​ గురించి ఆలోచిస్తున్నారా? నో టెన్షన్​. తక్కువ ధరలోనే పలు ప్రదేశాలు చూసేందుకు ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​ అద్దిరిపోయే ప్యాకేజీ తీసుకొచ్చింది. మరి ఆ ప్యాకేజీ ఎన్ని రోజులు? ధర ఎంత? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

నేషనల్​ హెరిటేజ్​ ఆఫ్​ నార్త్​ ఇండియా పేరుతో IRCTC టూర్​ ప్యాకేజీ ప్రకటించింది. హైదరాబాద్​ నుంచి ఫ్లైట్​ జర్నీ ద్వారా దీనిని ఆపరేట్​ చేస్తున్నారు. ఈ టూర్​ మొత్తం 6 రాత్రులు, 7 పగళ్లు ఉంటుంది. ఈ టూర్​ ద్వారా శ్రీకృష్ణ మ్యూజియం, లోటస్​ టెంపుల్​, తాజ్​మహల్​ వంటి పలు ప్రదేశాలు విజిట్​ చేయవచ్చు.

ప్రయాణ వివరాలు ఇవే:

  • మొదటి రోజు ఉదయం హైదరాబాద్​ ఎయిర్​పోర్ట్​ నుంచి ఫ్లైట్​ జర్నీ స్టార్ట్​ అవుతుంది. మధ్యాహ్నానికి అమృత్​సర్​ చేరుకుంటారు. ఎయిర్​పోర్ట్​లో ఫార్మాలిటీస్​ పూర్తి అయిన తర్వాత ముందుగానే బుక్ చేసిన హోటల్​కు తీసుకెళ్తారు. అక్కడ ఫ్రెషప్​ అనంతరం లంచ్​ ఉంటుంది. ఆ తర్వాత వాఘా బోర్డర్‌ విజిట్​ చేస్తారు. రాత్రికి అమృత్​సర్​లో స్టే ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ అనంతరం గోల్డెన్​ టెంపుల్​, జలియన్​ వాలాబాగ్​ విజిట్​ చేస్తారు. అక్కడి నుంచి జలంధర్​ బయలుదేరుతారు. అక్కడ జంగ్​ ఎ ఆజాది మెమోరియల్​ కమ్​ మ్యూజియం సందర్శిస్తారు. సాయంత్రం చండీగఢ్​కు స్టార్ట్​ అవుతారు. హోటల్​లో చెకిన్​ అయ్యి ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.

హైదరాబాద్​ టూ అయోధ్య వయా వారణాసి - రూ.16వేలకే IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ!

  • మూడో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత చండీగఢ్​లోని రాక్​ గార్డెన్​ విజిట్​ చేస్తారు. మధ్యాహ్నం సుక్నా సరస్సు సందర్శిస్తారు. సాయంత్రం చుట్టు పక్కల ప్రాంతాల్లో షాపింగ్​ చేసుకోవచ్చు. రాత్రికి చండీగఢ్​లో బస ఉంటుంది. ​
  • నాలుగో రోజు టిఫెన్​ తిన్న తర్వాత కురుక్షేత్రకు బయలుదేరుతారు. అక్కడ శ్రీకృష్ణ మ్యూజియం సందర్శిస్తారు. మధ్యాహ్నం దిల్లీ స్టార్ట్​ అవుతారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అయిన తర్వాత ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.
  • ఐదో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత లోటస్​ టెంపుల్​, కుతుబ్​ మినార్​ విజిట్​ చేస్తారు. సాయంత్రం అక్షరధామ్​ సందర్శిస్తారు. ఆ రాత్రి కూడా దిల్లీలోనే స్టే చేయాలి.
  • ఆరో రోజు ఉదయం హోటల్​లో బ్రేక్​ఫాస్ట్​ అనంతరం ఆగ్రా బయలు దేరుతారు. అక్కడ తాజ్​మహల్​ చూస్తారు. సాయంత్రం మథుర బయలుదేరుతారు. అక్కడ ప్రేమ్​ మందిర్​ దర్శిస్తారు. హోట్​లో చెకిన్​ అయ్యి ఆ రాత్రికి అక్కడే స్టే చేస్తారు.
  • ఏడో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత ఇస్కాన్​ టెంపుల్​, శ్రీకృష్ణ జన్మభూమిని దర్శించుకుంటారు. సాయంత్రం దిల్లీ ఎయిర్​పోర్ట్​కు చేరుకుంటారు. అక్కడి నుంచి హైదరాబాద్​కు చేరుకోవడంతో టూర్​ పూర్తవుతుంది.

అజంతా, ఎల్లోరా అందాలను ఆస్వాదించాలనుకుంటున్నారా? - తక్కువ ధరకే IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ!

ప్యాకేజీలో ఉండేవి ఇవే:

  • విమాన టికెట్లు(హైదరాబాద్​ - అమృత్​ సర్​/దిల్లీ - హైదరాబాద్​)
  • హోటల్​లో వసతి సౌకర్యం
  • 6 బ్రేక్​ఫాస్ట్​లు, 6 డిన్నర్స్​, 1 లంచ్​ ఉంటుంది.
  • లోకల్​ ప్రయాణాలకు AC బస్సు సౌకర్యం ఉంటుంది.
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​ ఉంటుంది.

ధరలు చూస్తే:

  • కంఫర్ట్​లో సింగిల్​ ఆక్యూపెన్సీకి రూ.49,700, డబుల్​ ఆక్యూపెన్సీకి రూ.38వేలు, ట్రిపుల్​ ఆక్యూపెన్సీకి రూ.35,500గా నిర్ణయించారు.
  • 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.28,800, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.27,550 చెల్లించాలి.
  • 2 నుంచి 4 సంవత్సరాల చిన్నారులకు విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.20,700గా నిర్ణయించారు.
  • ప్రస్తుతం ఈ టూర్​ అక్టోబర్​ 4 నుంచి అందుబాటులో ఉంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

రాజస్థాన్​ కోటల రాజసం చూసి తీరాల్సిందే - తక్కువ ధరకే IRCTC సూపర్​ ప్యాకేజీ!

అటు శ్రీశైల మల్లన్న - ఇటు యాదాద్రి నరసింహ​ - తక్కువ ధరకే IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ! పైగా ఈ ప్లేస్​లు కూడా!

ABOUT THE AUTHOR

...view details