IRCTC Madhya Pradesh Jyotirlinga Darshan Package: మరికొన్ని రోజుల్లో శివరాత్రి రానుంది. ఈ పర్వదినం వేళ చాలా మంది పరమేశ్వరుడిని దర్శించుకుంటారు. మరి మీరు కూడా శివరాత్రి వేళ శివయ్యను దర్శించుకోవాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. పండగ సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండింటిని ఓకే ట్రిప్‌లో దర్శించుకునేందుకు వీలుగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అద్దిరిపోయే ప్యాకేజీ తీసుకొచ్చింది. మరి ఆ ప్యాకేజీ ఏంటి? ధర ఎంత? ఏఏ ప్రదేశాలు కవర్ అవుతాయి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఉజ్జయిని మహా కాళేశ్వరుని ఆలయం, ఓంకారేశ్వర ఆలయాలు సహా మరికొన్ని దేవాలయాలను, పర్యాటక ప్రదేశాలను సందర్శించుకునేందుకు వీలుగా ఐఆర్సీటీసీ 'మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ దర్శన్' పేరుతో ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ టూర్ మొత్తం 5 రాత్రులు, 6 రోజులుగా ఉంటుంది. టూర్ ప్రకటించిన తేదీల్లో ప్రతి బుధవారమూ ఈ రైలు అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ ట్రైన్ జర్నీ ద్వారా ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తున్నారు.
ప్రయాణం ఇలా:
- మొదటి రోజు సాయంత్రం 4:40 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు (ట్రైన్ నెం.12707) బయల్దేరుతుంది. ఆ రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
- రెండో రోజు ఉదయం 8:15 గంటలకు భోపాల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ ముందుగానే బుక్ చేసిన హోటల్‌కు వెళ్లి చెకిన్ అయ్యి ఫ్రెషప్ అవుతారు. ఆ తర్వాత సాంచి స్థూపం విజిట్ చేస్తారు. అనంతరం భోజేశ్వర్ మహాదేవ్ టెంపుల్‌ను దర్శించుకుని తిరిగి భోపాల్ చేరుకుంటారు. సాయంత్రం ట్రైబల్ మ్యూజియం విజిట్ చేసి ఆ రాత్రికి భోపాల్‌లోనే స్టే చేస్తారు.
- మూడో రోజు బ్రేక్‌ఫాస్ట్ చేశాక చెక్ అవుట్ చేసి ఉజ్జయినికి బయల్దేరుతారు. అక్కడ హోటల్లో చెకిన్ అయిన తర్వాత ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర ఆలయం, హరసిద్ధి ఆలయం, మంగళనాథ్ ఆలయం, నవగ్రహ శని మందిరం, శ్రీ చింతామన్ గణేష్ ఆలయం, రామ్ ఘాట్, శ్రీ గఢ్కాళికా ఆలయాలను దర్శించుకుంటారు. ఆ రాత్రి ఉజ్జయినిలోనే బస ఉంటుంది.
- నాలుగో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత మహేశ్వర్‌కు స్టార్ట్ అవుతారు. అక్కడ అహిల్యాదేవి కోట, నర్మదా ఘాట్‌ను సందర్శిస్తారు. అక్కడి నుంచి ఓంకారేశ్వర్‌కు బయలుదేరుతారు. అక్కడ ఓంకారేశ్వర దేవాలయాన్ని దర్శించుకుంటారు. రాత్రికి ఓంకారేశ్వర్‌లో బస ఉంటుంది.
- ఐదో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఇందౌర్‌కు బయల్దేరుతారు. అక్కడ లాల్బాగ్ ప్యాలెస్, గణేష్ మందిరాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత ఇందౌర్ రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తారు. రాత్రి 8 గంటలకు రిటర్న్ జర్నీ(ట్రైన్ నెం: 19301) స్టార్ట్ అవుతుంది. ఆ రోజు రాత్రంతా జర్నీ ఉంటుంది.
- ఆరో రోజు రాత్రి 10 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ కంప్లీట్ అవుతుంది.
ప్యాకేజీ ధరలు చూస్తే: