తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

10 నిమిషాల్లో "టమాటా పచ్చడి" - రుబ్బడం, తాలింపు అవసరమే లేదు - టేస్ట్​ అదుర్స్​! - INSTANT TOMATO PACHADI RECIPE

- అన్నం, టిఫెన్స్​లోకి సూపర్ కాంబో - ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు! -బ్యాచిలర్స్​ కూడా ఈజీగా చేసుకోవచ్చు

Instant Tomato Pachadi at Home
Instant Tomato Pachadi at Home (Getty Images)

By ETV Bharat Telangana Team

Published : Feb 25, 2025, 11:17 AM IST

Updated : Feb 25, 2025, 11:24 AM IST

Instant Tomato Pachadi at Home :చాలా మంది ఇష్టంగా తినే పచ్చళ్లలో టమాటా ముందు వరుసలో ఉంటుంది. టమాటాలతో ఎన్నో రకాలు పచ్చళ్లు ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే ఏ పచ్చడి చేసినా చాలా వరకు మిక్సీ పట్టడం, తాలింపు పెట్టడం ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పబోయే రెసిపీలో ఇవేమి లేకుండా కేవలం 10 నిమిషాల్లో అద్దిరిపోయే రుచితో ప్రిపేర్​ చేసుకోవచ్చు. ఎన్నడూ తినని టేస్ట్​తో వహ్వా అనిపిస్తుంది. ఈ రెసిపీ బ్యాచిలర్స్​కు మరింత స్పెషల్​. అతి తక్కువ పదార్థాలతో చేసుకునే ఈ చట్నీ అన్నంతో పాటు చపాతీ, టిఫెన్స్​లోకీ అద్భుతం​గా ఉంటుంది. మరి, ఈ సూపర్ టేస్టీ పచ్చడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

  • నూనె - 3 టేబుల్​ స్పూన్లు
  • పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు - 15
  • టమాటాలు - 6
  • కారం - 2 టేబుల్​ స్పూన్లు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ఉల్లిపాయ - 1
  • పచ్చిమిర్చి - 3
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • నిమ్మకాయ - అర చెక్క

తయారీ విధానం:

  • టమటాలను శుభ్రంగా కడిగి వాటి తొడిమ తీసి ఒక్కో టమాటాను రెండు భాగాలుగా కట్​ చేసుకోవాలి. ఇలా టమాటాలన్నింటిని కట్​ చేసుకుని పక్కన పెట్టాలి.
  • ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన ఉంచాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్​ హీటెక్కిన తర్వాత టమాట ముక్కలను విడివిడిగా పెట్టి ఓ వైపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి మూత పెట్టి కుక్​ చేసుకోవాలి..
  • ఓ 5 నిమిషాల తర్వాత మూత తీసి టమాట ముక్కలను రెండో వైపు తిప్పి కాల్చుకోవాలి.
  • టమాట ముక్కలు రెండు వైపులా కాలిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి వాటి పై తొక్కును తీసేయాలి. ఇప్పుడు ఓ గరిటె లేదా స్మాషర్​ సాయంతో టమాటాలు, వెల్లుల్లిని మెత్తగా మెదుపుకోవాలి.
  • ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి కలపాలి. అనంతరం సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. చివరగా నిమ్మరసం పిండి కలిపి ఓ గిన్నెలోకి తీసుకుంటే సూపర్​ టేస్టీ ఇన్​స్టంట్​ టమాట పచ్చడి.
  • ఈ పచ్చడి అన్నం, చపాతీ, టిఫెన్స్​లోకి పర్ఫెక్ట్​. బ్యాచిలర్స్​ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నచ్చితే మీరూ ఓ సారి ట్రై చేయండి.

రేటు తక్కువున్నప్పుడు ఇలా "టమాటా పొడి" చేసుకోండి - నెలల పాటు నిల్వ! - రసం, చారులోకి పర్ఫెక్ట్​!

మీరు ఎన్నడూ తిని ఉండరు - "పచ్చి టమాటా పచ్చడి" - టేస్ట్​ నెక్స్ట్​ లెవల్ అంతే!

Last Updated : Feb 25, 2025, 11:24 AM IST

ABOUT THE AUTHOR

...view details