తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

బయట అప్పడాలు కొనలేకపోతున్నారా? - ఇంట్లోనే ఇలా చేసుకోండి - నిమిషాల్లో రెడీ - పైగా టేస్ట్​ సూపర్​! - HOW TO MAKE URAD DAL PAPAD AT HOME

-తెలుగు వారి పెళ్లిళ్లలో స్పెషల్​గా అప్పడాలు -ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి సూపర్​గా ఉంటాయి

How to Make Urad Dal Papad at Home
How to Make Urad Dal Papad at Home (Getty Images)

By ETV Bharat Telangana Team

Published : Feb 19, 2025, 9:59 AM IST

How to Make Urad Dal Papad at Home:విందు భోజనమైనా, ఇంటి భోజనమైనా పప్పు, చారు, రసం వంటి వాటికి కాంబినేషన్​గా అప్పడం ఉండాల్సిందే. లేకపోతే భోజనం తృప్తిగా తిన్న ఫీలింగ్​ రాదు. అందుకే దాదాపు అందరి ఇళ్లల్లో లంచ్​లోకి అప్పడం తప్పనిసరిగా ఉంటుంది. అయితే అప్పడాలు తినాలంటే మార్కెట్లో కొని వాటిని వేయించుకోవాలి. కొన్నిసార్లు బయట కొన్న అప్పడాలు అంత రుచిగా ఉండవు. పైగా వాటిని తయారు చేసే విధానం చూస్తే అస్సలు తినబుద్ధి కాదు. ఇకపై అలాంటి సమస్య లేకుండా కేవలం అతి తక్కువ సమయంలో ఎంతో శుభ్రమైన, రుచికరమైన అప్పడాలను చేసుకోవచ్చు. ఇవి ప్రిపేర్​ చేయడానికి ఎక్కువ పదార్థాలు, సమయం కూడా అవసరం లేదు. మరి లేట్​ చేయకుండా అప్పడాలు ఎలా చేయాలో ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

  • మినప గుండ్లు - 1 కప్పు
  • ఉప్పు - అర టీ స్పూన్​
  • బేకింగ్​ సోడా - అర టీ స్పూన్​
  • ఆయిల్​ -1 టేబుల్​ స్పూన్​

తయారీ విధానం:

  • మిక్సీ జార్​ తీసుకుని మినప గుండ్లు వేసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. అస్సలు నూక అనేది లేకుండా ఎంత వీలైతే అంత మెత్తగా చేసుకోవాలి.
  • గ్రైండ్​ చేసుకున్న పొడిని జల్లించి ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • మినప పిండిలోకి ఉప్పు, బేకింగ్​ సోడా వేసి కలపాలి. అనంతరం కొద్దికొద్దిగా వాటర్​ పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి.
  • ముద్దగా కలుపుకున్న పిండిలో నూనె వేసి మరోసారి కలపాలి. ఆ తర్వాత చపాతీ పీట మీద ఈ పిండి ముద్దను ఉంచి సాగదీస్తూ సుమారు 10 నుంచి 15 నిమిషాలు ఒత్తుకోవాలి. పిండి ఎంతసేపు కలిపితే అంత సాఫ్ట్​ అవుతుంది. అప్పుడే అప్పడాలు రుచికరంగా వస్తాయి.
  • పిండిని బాగా కలిపిన తర్వాత రెండు భాగాలుగా విడదీయాలి. అందులో ఓ భాగాన్ని మరోసారి కలిపి సమానంగా ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఓ ఉండను తీసుకుని గోధుమ లేదా మైదా పొడి పిండి సాయంతో వీలైనంతవరకు పల్చగా ఒత్తుకోవాలి. ఇప్పుడు అప్పడాల సైజ్​లో ఉండే రౌండ్​ ప్లేట్​ లేదా బాక్స్​ మూత సాయంతో గుండ్రంగా కట్​ చేసుకుని ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఇలా మిగిలిన అన్ని ఉండలను ఇలానే చేసుకోవాలి. అలాగే మిగిలి ఉన్న మిగతా భాగాన్ని కూడా ఇలానే చేసుకుని అన్ని అప్పడాలను ఓ ప్లేట్​లోకి విడివిడిగా వేసుకోవాలి.
  • ఇప్పుడు ఇంట్లోనే ఫ్యాన్​ కింద ఓ శుభ్రమైన వైట్​ క్లాత్​ వేసి దాని మీద అప్పడాలను ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న వాటిని ఓ గంట సేపు ఫ్యాన్​ గాలికి ఆరనివ్వాలి.
  • గంట తర్వాత అప్పడాలను రెండో వైపు తిప్పి మరో 60 నిమిషాలు ఆరబెట్టాలి.
  • ఇక ఎండలో అయితే క్లాత్​ మీద అప్పడాలు ఉంచి ఓ వైపున 20 నిమిషాలు, మరోవైపున 20 నిమిషాలు ఆరబెడితే సరిపోతుంది.
  • ఇలా ఆరిన వాటిని తీసుకుని గాలి చొరబడని డబ్బాలో స్టోర్​ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నూనెలో వేయించుకుని తినొచ్చు. అంతే కేవలం నిమిషాల్లోనే ఎంతో టేస్టీ అయిన మినప అప్పడాలు రెడీ.
  • అయితే అప్పడాలను నూనెలో వేయించేటప్పుడు నూనె బాగా కాగి ఉండాలి అనే ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకోవాలి. నూనె బాగా కాగకపోతే అప్పడాలకు నూనె పడుతుంది. కాబట్టి ఈ టిప్​ పాటించాల్సిందే. నచ్చితే మీరూ ఇంట్లో ట్రై చేయండి.

తిన్నాకొద్దీ తినాలనిపించే "మినప చెక్కలు" - నూనె ఎక్కువగా పీల్చవు! - నెవ్వర్ బిఫోర్ టేస్ట్!

షుగర్​ పేషెంట్లు మినపప్పు తింటే మంచిదేనా? - నిపుణుల సమాధానమింటే ఆశ్చర్యపోతారు!

ABOUT THE AUTHOR

...view details