DARIAN GAP :ఉన్నత చదువులు, మంచి ఉద్యోగం, తక్కువ పనిగంటలు, ఎక్కువ వేతనం! లక్ష్యం ఏదైనా సరే అమెరికా వెళ్లాలన్న ఆలోచనకు బీజం పడుతోందిక్కడే. మన దేశం మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల నుంచి అమెరికా వెళ్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వీసా వస్తే సరే, లేదంటే అగ్రరాజ్యంలో అడుగు పెట్టేందుకు అక్రమ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. ఉపాధి కోసం కొందరు, శరణార్థులుగా మరికొందరు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అమెరికాలో అక్రమంగా అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తూ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. అక్రమ మార్గాల్లో ఒకటైన 'డేరియన్ గ్యాప్' మీదుగా వెళ్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
LIC 'అన్‌క్లెయిమ్డ్ మనీ' రూ.800కోట్లు - మీ డబ్బు కూడా ఉందేమో చెక్ చేసుకోండిలా!
అసలు డేరియన్ గ్యాప్ అంటే ఏంటి? ఆ ప్రాంతం అంత ప్రమాదకరమా? అంటే అడుగడుగునా ప్రమాదమే అని తెలుస్తోంది. మృత్యువు ఒడిలో ప్రయాణమే అని పలువురి అనుభవాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద రహదారి పాన్-అమెరికన్ హైవే పొడవు 30వేల కిలోమీటర్లు 14 దేశాల మీదుగా వెళ్లే ఈ రహదారికి ఒకే దగ్గర 160 కిలోమీటర్ల బ్రేక్ ఉంటుంది. దీనినే "డేరియన్ గ్యాప్" అని పిలుస్తుండగా అదంతా అండీస్ పర్వతాలు, అమెజాన్ అటవీ ప్రాంతం. ఇక్కడ అటవీ జాతి ప్రజలు, వేటాడే ప్రజలతో పాటు వివిధ సంస్కృతులు కలిగిన ఎన్నో జాతులు నివసిస్తుంటాయి. చిత్తడి నేలలతో పాటు, అత్యంత ప్రమాదకరమైన విష సర్పాలు, అటవీ మృగాలున్న ఈ ప్రాంతం మీదుగా అమెరికాకు అక్రమంగా వలస వెళ్తుంటారు.
ఎక్కడుందీ డేరియన్ గ్యాప్?
కొలంబియా - పనామా మధ్య డేరియన్ గ్యాప్ అభయారణ్యంలో నిటారైన కొండలు, లోయలు, వేగంగా ప్రవహించే నదులు ఉంటాయి. విషపూరిత సర్పాలు, క్రూరమృగాలు, ఎల్లప్పుడూ ప్రతికూల వాతావరణమే.చిత్తడి నేలలతో కూడిన ఈ ప్రాంతంలో రోడ్డు అనే మాటే ఉండదు. అందుకే ఈ దుర్భేద్యమైన ప్రాంతంలో మకాం వేసిన నేర ముఠాలు మాదకద్రవ్యాల వ్యాపారంతో పాటు మానవ అక్రమ రవాణాకు పాల్పడుతుంటాయి. ఈ క్రమంలో వలసదారులను దోచుకోవడంతో పాటు వారి ప్రాణాలకు హాని తలపెడుతుంటాయి.
15 రోజుల సాహసం