తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

"హైదరాబాద్​ స్పెషల్​ మటన్ దమ్​ కీమా" - ఇలా చేస్తే రుచి అస్సలు మర్చిపోలేరు! - MUTTON DUM KEEMA RECIPE

-నోరూరించే మటన్​ దమ్​ కీమా -ఇలా వండితే గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు!

Hyderabad Special Dum Keema Recipe
Hyderabad Special Dum Keema Recipe (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 22 hours ago

Hyderabad Special Dum Keema Recipe :నాన్​వెజ్​లో ఎక్కువ మంది మటన్ ఇష్టంగా తింటారు. ​కాస్త మసాలాలు ఎక్కువగా వేసి బగారా రైస్​తో మటన్​ కర్రీ తింటే టేస్ట్​ అద్భుతంగా ఉంటుంది. అయితే, కొంతమంది మటన్​ కీమాఇష్టంగా ఆరగిస్తుంటారు. అలాంటి వారు ఒక్కసారి ఈ స్టోరీలో చెప్పిన విధంగా "హైదరాబాద్​ స్టైల్ మటన్​ దమ్​ కీమా" రెసిపీ ట్రై చేయండి. ఈ కీమా వేడివేడి బగారా రైస్​, చపాతీల్లోకి రుచి ఎంతో బాగుంటుంది. మరి ఈ మటన్​కీమా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

  • మటన్​ కీమా - అరకేజీ
  • ఉల్లిపాయ ముక్కలు- కప్పు
  • ఉప్పు- తగినంత
  • కారం - తగినంత
  • పెరుగు- 100 గ్రాములు
  • కొత్తిమీర, పుదీనా తరుగు-కొద్దిగా
  • చిరోంజి గింజలు-ఒకటిన్నర టీస్పూన్లు
  • మిరియాల పొడి-అర టేబుల్​స్పూన్​
  • కారం -అర టేబుల్​స్పూన్​
  • వేపిన జీలకర్ర పొడి -టీస్పూన్​
  • పసుపు- అరటీస్పూన్​
  • గరం మసాలా -టీస్పూన్​
  • నాగకేసరల పొడి (తోక మిరియాలు లేదా కబాబ్​ చీనీ)- అరటీస్పూన్​
  • ధనియాల పొడి-టీస్పూన్​
  • శనగపిండి-టేబుల్​స్పూన్

తయారీ విధానం:

  • ముందుగా రెసిపీ కోసం పచ్చిమిర్చి సన్నగా తురుముకోండి. అలాగే ఉల్లిపాయలు కట్​ చేసుకోండి.
  • అలాగే చిరోంజి గింజలను 2 గంటలు నానబెట్టి మెత్తని పేస్ట్​లా మిక్సీ గిన్నెలో గ్రైండ్​ చేసుకోండి. (చిరోంజి గింజలకు బదులుగా మీరు బాదం నానబెట్టి.. ఆ పేస్ట్​ కూడా వేసుకోవచ్చు)
  • ఇప్పుడు శుభ్రంగా కడిగిన మటన్​ కీమా ఒక గిన్నెలోకి తీసుకోండి.
  • ఇందులో కొత్తిమీర, పుదీనా తరుగు, పచ్చిమిర్చి తరుగు, చిరోంజి పేస్ట్, మిరియాల పొడి, కారం, వేపిన జీలకర్ర పొడి, పసుపు, గరం మసాలా, నాగకేసరల పొడి, ధనియాల పొడి వేసి కలపండి.
  • ఆపై పెరుగు వేసి మిక్స్​ చేయండి. కీమాకి మసాలాలు బాగా పట్టిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్​స్పూన్ల నూనె వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని గంటలపాటు ఫ్రిడ్జ్​లో పెట్టండి.
  • ఇప్పుడు స్టవ్​ మీద మందపాటి కడాయి పెట్టి ఆయిల్​ పోసి వేడి చేసుకోవాలి.
  • నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారే వరకు వేపండి.
  • ఆపై అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి.
  • ఇప్పుడు శనగపిండి వేసి కలపండి. అనంతరం ఫ్రిడ్జ్​లో ఉంచుకున్న మటన్​ కీమా మిశ్రమం వేసి కలపండి.
  • ఒక ఐదు నిమిషాలు మూత తీసి ఉడికిస్తే కీమాలో నీరు పైకి తేలుతుంది.
  • అప్పుడు మూత పెట్టి స్టౌ మీడియం ఫ్లేమ్​లో అడ్జస్ట్​ చేయండి. మధ్యమధ్యలో కలుపుతూ కీమాలో ఆయిల్​ పైకి తేలె వరకు ఉడికించుకోండి.
  • ఇప్పుడు కాస్త కొత్తిమీర, పుదీనా తరుగు వేసి కలపండి.
  • ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి సర్వ్​ చేసుకుంటే సరిపోతుంది. ఇలా సింపుల్​గా చేసుకుంటే సూపర్​ టేస్టీ దమ్​ కీమా మీ ముందుంటుంది.
  • నచ్చితే ఇలా కీమా రెసిపీ ఓ సారి ట్రై చేయండి.

"మెంతి మటన్​ కీమా" - ఇలా ప్రిపేర్ చేస్తే మామూలుగా ఉండదు!

మటన్ కీమా ఇలా ట్రై చేశారంటే - దిల్ ఖుష్ అవ్వాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details