How To Prepare Egg Dosa In Telugu :మనకు ప్రొటీన్ అందించే చౌకైన ఆహారాల్లో గుడ్డు ఒకటి. తక్కువ ధరలో మంచి పోషకాలను గుడ్డు అందిస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే.. మనలో చాలా మందికి గుడ్డుతో కర్రీ వండుకోవడం, ఉడకబెట్టుకోవడం లేదా ఆమ్లెట్ వేసుకోవడం మాత్రమే చేస్తుంటారు. కానీ కొందరికి గుడ్డును ఉడకబెట్టుకుని నేరుగా తినడం అంటే నచ్చదు. అలాంటి వారికోసం ఈజీగా చేసుకుని మంచి రెసిపీ ఎగ్ దోశ. ఈ నేపథ్యంలోనే ఎగ్ దోశకు కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు..
- ఒక కప్పు మినపప్పు
- 2 కప్పులు బియ్యం (ఇడ్లీ రైస్)
- ఒక టేబుల్ స్పూన్ శెనగపప్పు
- ఒక టీ స్పూన్ మెంతులు
- ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ
- ఒక టేబుల్ స్పూన్ చక్కెర
- ఉప్పు రుచికి సరిపడా
- 2 టీ స్పూన్ల కారం
- ఒక టీ స్పూన్ ధనియాల పొడి
- పావు టీ స్పూన్ జీరకర్ర పొడి
- ఒక టీ స్పూన్ పెరిపెరి పౌడర్
- ఆఫ్ టీ స్పూన్ చాట్ మసాలా
- వెన్న
- ఉల్లిపాయలు
- పచ్చిమిర్చీ
- కొత్తిమీర
- గుడ్లు
- నూనె
దోశ పిండి తయారీ విధానం..
- ముందుగా ఒక గిన్నెలో మినపప్పు, బియ్యం, మెంతులు, శెనగపప్పు వేసి నీటితో బాగా కడగాలి. (మిక్సీ జార్లో అయితే ఒక కప్పు మినపప్పుకు రెండు కప్పుల బియ్యం తీసుకోవాలి. గ్రైండర్లో అయితే ఒక కప్పుకు మూడు కప్పుల బియ్యం తీసుకోవాలి)
- ఆ తర్వాత నిండుగా నీటిని పోసి ఈ పప్పు, బియ్యాన్ని సుమారు 5 గంటల పాటు నానబెట్టుకోవాలి.
- అనంతరం ఈ మిశ్రమాన్ని తగినంత నీటిని పోసుకుంటూ పిండిని గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఈ పిండి మొత్తాన్ని ఓ గిన్నెలో తీసుకని బాగా కలపాలి. ఆ తర్వాత సుమారు 10 గంటలు పక్కకు పెట్టాలి.
- ఆ తర్వాత ఇందులోనే బొంబాయి రవ్వ, నీరు, ఉప్పు, చక్కెర వేసి పిండిని కలపాలి.