తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

10 నిమిషాల్లో ఇడ్లీ పిండితో "వడలు" - టేస్ట్​ వేరే లెవల్​ - ఇలా చేస్తే నూనె అస్సలు పీల్చవు! - HOW TO MAKE VADA WITH IDLI BATTER

-రెగ్యులర్​గా ఇడ్లీలు తినాలంటే బోర్​ కొడుతోందా? -ఇలా వడలు చేసుకోండి అద్దిరిపోతాయి!

How to Make Vada with Idli Batter
How to Make Vada with Idli Batter (Getty Images)

By ETV Bharat Telangana Team

Published : Feb 25, 2025, 5:18 PM IST

How to Make Vada with Idli Batter:ఇడ్లీలు - పరిచయం అక్కర్లేని బ్రేక్​ఫాస్ట్​. ఇవి లైట్​గా ఉండి హెల్దీ కావడంతో చాలా మంది రెగ్యులర్​గా ఇంట్లో చేస్తుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది మూడు నాలుగు రోజులకు సరిపడా పిండి ప్రిపేర్​ చేసుకుని ఫ్రిడ్జ్​లో సోర్ట్​ చేసుకుని కావాల్సినప్పుడు ఇడ్లీలు వేసుకుంటారు. అయితే రోజూ ఇడ్లీలు తినాలనిపించదు. దీంతో ఇడ్లీ పిండి వేస్ట్​ అవుతుంది. ఇకపై ఇడ్లీలు తినబుద్ధి కానప్పుడు ఇలా వడలు వేసుకోండి. సూపర్​గా వస్తాయి. వడలు వేసుకునే సమయంలో ఇది ఒక్కటి కలిపితే నూనె అస్సలు పీల్చవు. పైగా ఈ వడలు పైన క్రిస్పీగా, లోపల సూపర్​ సాఫ్ట్​గా ఉంటాయి. మరి లేట్​ చేయకుండా ఇడ్లీ పిండితో వడలు ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

  • ఇడ్లీ పిండి - 2 కప్పులు
  • బొంబాయి రవ్వ - అర కప్పు
  • ఉల్లిపాయ - 1
  • పచ్చిమిర్చి - 2
  • ఉప్పు - రుచికి సరిపడా
  • జీలకర్ర - అర టీ స్పూన్​
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • బేకింగ్​ సోడా - చిటికెడు(ఆప్షనల్​)

తయారీ విధానం:

  • స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి బొంబాయి రవ్వను సిమ్​లో దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న రవ్వను చల్లారిన తర్వాత మిక్సీజార్​లో వేసి మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి. ఇడ్లీ పిండిలో రవ్వ వేసుకోవడం వల్ల వడలకు నూనె పట్టదు. పైగా క్రిస్పీగా వస్తాయి.
  • ఓ బౌల్​లోకి ఇడ్లీ పిండిని తీసుకోవాలి. అందులోకి మిక్సీ పట్టిన రవ్వను వేసుకుని బాగా కలిపి ఓ 10 నిమిషాలు పక్కన ఉంచాలి.
  • ఈ లోపు పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకును సన్నగా కట్​ చేసుకోవాలి.
  • 10 నిమిషాల తర్వాత పిండిలోకి రవ్వ నాని వడ మిశ్రమం రెడీ అవుతుంది. వడలు వేసుకునేందుకు పిండి పర్ఫెక్ట్​గా ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ పిండి మరీ గట్టిగా అనిపిస్తే మరికొంచెం ఇడ్లీ పిండిని కలుపుకోవచ్చు.
  • ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు సన్నని తరుగు, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, బేకింగ్​ సోడా వేసుకోవాలి. ఆల్రెడీ ఇడ్లీ పిండిలో ఉప్పు ఉంటే చూసుకుని వేసుకోవాలి.
  • వీటన్నింటిని ఓ 5 నిమిషాల పాటు ఒకే డైరెక్షన్​లో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పిండి ప్లఫ్పీగా అవుతుంది.
  • స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి డీప్​ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్​ హీటెక్కిన తర్వాత వడ పిండిని మరొక్కసారి కలిపి కొద్దిగా పిండి తీసుకుని అరటి ఆకు లేదా బటర్​ పేపర్​ మీద వడలుగా వత్తుకుని నూనెలో వేసుకోవాలి.
  • ఇలా కడాయిలో ఓ నాలుగైదు వేసుకుని మీడియం ఫ్లేమ్​లో రెండు వైపులా గోల్డెన్​ బ్రౌన్​ కలర్​ వచ్చే వరకు గరిటెతో తిప్పతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న వడలను ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఇలా పిండి మొత్తాన్ని వడలుగా వేసుకుని వేడి వేడిగా సర్వ్​ చేసుకుంటే సరి. ఎంతో రుచికరంగా ఉండే ఇడ్లీ పిండి వడలు రెడీ. చట్నీ లేకపోయినా ఇవి సూపర్​గా ఉంటాయి. నచ్చితే కొబ్బరి పచ్చడితో తినొచ్చు.

ఇడ్లీ పిండితో రుచికరమైన "పునుగులు" - ఇలా చేస్తే టేస్ట్​ అద్దిరిపోతాయి!

పప్పు రుబ్బే పనిలేదు - చిటికెలో "సేమియా ఇడ్లీ" - టేస్ట్​ అద్దిరిపోతాయి!

ABOUT THE AUTHOR

...view details