తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

10 నిమిషాల్లో తెలంగాణ స్పెషల్ చుక్కకూర తొక్కు- వేడివేడి అన్నంలో తిన్నారంటే అద్భుతమే!

- ఈ టిప్స్ పాటిస్తే పచ్చడి అమృతమే - పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు

By ETV Bharat Features Team

Published : 7 hours ago

How to Make Chukka Kura Pachadi
How to Make Chukka Kura Pachadi (ETV Bharat)

Chukka Kura Pachadi Recipe:మనలో చాలా మందికి ఆకుకూరలతో చేసే పచ్చళ్లు అంటే ఎంతో ఇష్టం. కానీ.. కొందరు పెద్దలతోపాటు పిల్లలు కూడా ఈ రోటి పచ్చళ్లను చూస్తే ముఖం చిట్లిస్తారు. కానీ.. దీన్ని సరైన పద్ధతిలో తయారు చేయాలేగానీ, ప్రతి ఒక్కరూ లొట్టలేసుకుంటా తింటారు. తెలంగాణలో ఈ పచ్చడిని చాలా స్పెషల్ గా తయారు చేసుకుంటారు. దీన్ని తిన్నారంటే.. రుచి వేరే లెవల్​లో ఉంటుంది. వేడి వేడి అన్నం లేదా రొట్టెతో కూడా ఈ పచ్చడిని టేస్ట్ చేయొచ్చు. ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్లీ మళ్లీ చేసుకుని తింటారు. అంతేకాదు.. ఈ పచ్చడిని కేవలం 10 నిమిషాల్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

  • 3 టేబుల్ స్పూన్ల పల్లీలు (వేరుశనగ)
  • ఒక టీ స్పూన్ జీలకర్ర
  • ఒక టేబుల్ స్పూన్ నూనె
  • 8 పచ్చిమిరపకాయలు
  • 6 వెల్లుల్లి రెబ్బలు
  • 100 గ్రాముల చుక్కకూర

తాళింపు కోసం కావాల్సిన పదార్థాలు

  • ఒక టేబుల్ స్పూన్ నూనె
  • ఒక టీ స్పూన్ ఆవాలు
  • ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు
  • ఒక టీ స్పూన్ మినపప్పు
  • ఒక టీ స్పూన్ జీలకర్ర
  • రెండు ఎండు మిర్చి
  • ఒక రెబ్బ కరివేపాకు

తయారీ విధానం

  • ముందుగా చుక్కకూర ఆకులను తుంచుకుని వాటిని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత స్టౌ ఆన్ చేసుకుని పాన్​లో పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర వేసి దించేసి పక్కకు పెట్టుకోవాలి.
  • ఇవి చల్లారక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
  • ఇప్పుడు అదే పాన్​లో నూనె పోసి వేడి చేసుకుని అందులో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగనివ్వాలి.
  • ఆ తర్వాత ఇందులోనే చుక్కకూరను వేసుకుని పచ్చివాసన పోయేవరకు మెత్తగా ఉడికించుకోవాలి.
  • మెత్తగా అయ్యాక దీనిని దించేసుకుని మిక్సీలో వేసి పల్లీల పొడి, కాస్త ఉప్పుతో గ్రైండ్ చేసుకోవాలి.

తాళింపు విధానం

  • ముందుగా స్టౌ ఆన్ చేసి కడాయి వేడి చేసుకుని నూనె పోసుకోవాలి.
  • ఆ తర్వాత ఇందులో పచ్చి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి.
  • ఇవన్నీ కాస్త వేగాక ముందుగా చేసుకున్న పచ్చడిని ఇందులో వేసుకోవాలి. మీకు పుల్లగా కావాలంటే కాస్త చింతపండు కూడా వేసుకోవచ్చు. అంతే టేస్టీతెలంగాణ స్పెషల్ చుక్కకూర తొక్కు రెడీ!

ఉసిరికాయలతో అద్దిరిపోయే పప్పు! - ఇలా ప్రిపేర్ చేశారంటే నెవ్వర్ బిఫోర్ టేస్ట్!

సూపర్ స్నాక్ రెసిపీ - క్రిస్పీ "సొరకాయ బజ్జీలు" - 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details