Boondi Mithai Recipe in Telugu:మనకు బూందీతో చేసే స్వీట్ అనగానే లడ్డూ మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ లడ్డూ మాత్రమే కాకుండా బూందీతో అనేక రకాల స్వీట్లు చేసుకోవచ్చు. అందులో ఒకటి బూందీ మిఠాయి. అయితే చాలా మందికి బూందీ, పాకం సరిగ్గా చేయడం అంతగా రాదు. దీంతో ఎక్కువగా బయట స్వీట్ షాపుల్లో తీసుకుంటుంటారు. ఇకపై అలాంటి అవసరం లేదు. ఎందుకంటే.. ఈ కొలతలు, టిప్స్ పాటిస్తే ఇంట్లోనే బూందీ మిఠాయిని సూపర్‌గా చేసుకోవచ్చు. మరి, ఇంకెందుకు ఆలస్యం.. ఇందులోకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- 2 కప్పుల శనగపిండి
- పావు టీ స్పూన్ ఉప్పు
- ఒకటిన్నర కప్పు బెల్లం
- కొద్దిగా యాలకుల పొడి
- ఒక టీ స్పూన్ నెయ్యి (ఆప్షనల్)
- నూనె
తయారీ విధానం
- ముందుగా ఓ గిన్నె తీసుకుని జల్లించుకున్న శనగపిండి, ఉప్పు వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలపాలి.(మరీ చిక్కగా, పలుచగా కాకుండా మీడియంగా కలపాలి)
- ఇప్పుడు ఇందులో టేబుల్ స్పూన్ నూనె వేసుకుని బాగా కలిపి కాసేపు పక్కకు పెట్టుకోవాలి.
- ఆ తర్వాత స్టౌ ఆన్ చేసుకుని ఫ్రై చేసుకునేందుకు సరిపడా నూనె పోసుకుని బాగా వేడి చేసుకోవాలి.
- ఇప్పుడు మరిగే నూనెకు రెండు అంగళాల పైన ఓ జల్లి గంట పెట్టి దానిపై పిండిని నెమ్మదిగా కొద్దికొద్దిగా పోయాలి. ఆ తర్వాత గరిటెతో చిన్నగా తిప్పుతుంటే బూందీ నూనెలోకి పడిపోతుంది.
- ఇలా స్టౌ మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి కలుపుతూ లేత గోధుమ రంగులోకి రాగానే కడాయి నుంచి తీసి పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు పాకం కోసం స్టౌ ఆన్ చేసి ఓ పాన్‌లో బెల్లం, పావు కప్పు నీళ్లు పోసి కరిగించుకోవాలి.
- స్టౌను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి గట్టి పాకం వచ్చే వరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉండికించుకోవాలి.
- గట్టి పాకం వచ్చాక స్టౌ ఆఫ్ చేసుకుని యాలకుల పొడి, నెయ్యి వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు బూందీని వేసి పాకం పట్టేలా బాగా కలపాలి.
- ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిపెట్టిన గిన్నెలో వేసి మరో చిన్న గిన్నెకు నెయ్యి రాసి దాంతో ప్లేటంతా స్ప్రెడ్ చేసి చల్లారబెట్టుకోవాలి.
- కాస్త చల్లారిన తర్వాత మనకు నచ్చిన ఆకారంలో వీటిని ముక్కలుగా చేసుకుంటే టేస్టీ బూందీ మిఠాయి రెడీ!
దసరా స్పెషల్ టేస్టీ కజ్జికాయలు - ఈ టిప్స్ పాటిస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు - How to Make Kajjikayalu at Home
దసరా స్పెషల్ : జంతికలు చేస్తున్నారా..? ఈ టిప్స్ పాటిస్తే సూపర్ టేస్టీగా కరకరలాడిపోతాయ్! - How to Make Rice Flour Jantikalu