తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

రోడ్​ సైడ్​ ముంత మసాలా ఇప్పుడు ఇంట్లోనే! - ఈ టిప్స్​ పాటిస్తూ చేస్తే సూపర్​ టేస్టీ! - How to Make Road Side Munta Masala

Munta Masala: రోడ్​ సైడ్​ బండ్ల మీద కనిపించే ముంత మసాలాకు ఫ్యాన్స్​ చాలా మందే ఉంటారు. అలా నడుచుకుంటూ.. ఇలా ముంత మసాలా తింటుంటే వచ్చే క్కికేవేరు. అయితే చాలా మంది దీనిని ఇంట్లో ప్రిపేర్​ చేసుకోవాలనుకుంటారు. కానీ.. బండ్ల మీద లభించే టేస్ట్​ మాత్రం రాదు. అలాంటప్పుడు ఈ టిప్స్​ పాటిస్తే సెట్​ అయిపోద్ది..

Munta Masala
Munta Masala (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2024, 2:40 PM IST

How to Make Road Side Munta Masala at Home:ముంత మసాలా.. ఈ పేరు వింటేనే చాలా మంది మౌత్​ వాటరింగ్​ అవుతుంది. కొంచెం కారంగా.. కొంచెం ఉప్పగా.. కొంచెం పుల్లగా ఉండే దీనిని తింటే కలిగే ఫీలింగ్​ వేరే లెవల్​. అలా సాయంత్రం సమయాన అలా నడుచుకుంటూ దీనిని తింటుంటే వచ్చే కిక్కు వేరేగా ఉంటుంది. మరమరాలు, నిమ్మరసం, మసాలాలు, ఉల్లిపాయ ముక్కలు ఇలా ఒక్కటేమిటి.. అందులో ఉన్న ప్రతీ రుచి అమోఘమే.

అయితే చాలా మంది రోడ్​ సైడ్​ బండ్ల మీద లభించే రుచితో.. దీనిని ఇంట్లోనే ప్రిపేర్​ చేసుకోవాలనుకుంటారు. కానీ.. ఆ టేస్ట్​ మాత్రం రాదు. అలాంటప్పుడు కొన్ని టిప్స్​ పాటిస్తూ ముంత మసాలా చేసేస్తే టేస్ట్​ అమోఘం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..

ముంత మసాలా కోసం కావాల్సిన పదార్థాలు:

  • మరమరాలు - 2 కప్పులు
  • కార్న్​ఫ్లేక్స్​ - అర కప్పు
  • పల్లీలు - పావు కప్పు
  • ఉల్లిపాయలు - 2 (మీడియం సైజ్​)
  • టమాట - 1(పెద్దది)
  • పచ్చిమిర్చి - 2
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కారం- రుచికి సరిపడా
  • ధనియాల పొడి - 1 టీ స్పూన్​
  • వేయించిన జీలకర్ర పొడి - అర టీ స్పూన్​
  • చాట్​ మసాలా - 1 టీ స్పూన్​
  • నెయ్యి - 2 టీస్పూన్లు
  • నిమ్మరసం - 1 టీ స్పూన్​

తయారీ విధానం :

  • ముందుగా ఉల్లిపాయలు, టమాట, పచ్చిమిర్చి, కొత్తిమీరను సన్నగా కట్​ చేసుకోవాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి మరమరాలను క్రిస్పీగా వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత అదే పాన్​లో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • ఆయిల్​ హీట్​ అయిన తర్వాత కార్న్​ఫ్లేక్​ వేసి ఫ్రై చేసుకుని వేరే ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఇక్కడ కార్న్​ఫ్లేక్స్​ అంటే పాలల్లో వేసుకుని తినేవి కాకుండా.. చిప్స్​తోపాటు లభించే కార్న్​ఫ్లేక్స్​ వాడాలి.
  • ఇప్పుడే అదే నూనెలో పల్లీలు వేసి ఎర్రగా వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఓ పెద్ద బౌల్​ తీసుకుని అందులోకి వేయించిన మరమరాలు, కార్న్​ఫ్లేక్స్​ వేసి చేత్తో ప్రెస్​ చేస్తూ కలపాలి.
  • ఇందులోకి ఉల్లిపాయ తరుగు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, చాట్​ మసాలా, నెయ్యి, నిమ్మరసం, వేయించిన పల్లీలు వేసి బాగా కలుపుకోవాలి.
  • ఈ స్టేజ్​లో ఉప్పు, కారం, పులుపు చూసుకుని తక్కువ ఉంటే మరికొంచెం కలుపుకోవచ్చు. కావాలంటే మిర్చి బజ్జీని కూడా కట్​ చేసుకుని వేసుకోవచ్చు.
  • అంతే రోడ్​ సైడ్​ లభించే రుచితో ముంత మసాలా రెడీ!!

బయటి జిలేబీ అన్​ హెల్దీ కావొచ్చు! - ఇంట్లో ఇలా ఈజీగా ప్రిపేర్​ చేసుకోండి - రుచి అమృతమే!

మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​ తయారీకి టైమ్​ లేదా? - ఈ "ఇన్​స్టంట్ దోశ"ను ట్రై చేయండి - 5 నిమిషాల్లోనే రెడీ!

నోరూరించే 'దొండకాయ 65' - నిమిషాల్లోనే రెడీ అవుతుంది - టేస్ట్ వేరే లెవల్!

ABOUT THE AUTHOR

...view details