తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

టేస్టీ అండ్​ స్పైసీ "పెరుగు ఊర కారం పచ్చడి"- వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే అమృతమే!

-ఇడ్లీ, వడ, దోశ, బజ్జీల్లోకి సూపర్​ కాంబినేషన్​ -ఈ పద్ధతిలో చేస్తే రెండు వారాల పాటు నిల్వ

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Perugu Oora Karam Pachhadi
Perugu Oora Karam Pachhadi Recipe (ETV Bharat)

Perugu Oora Karam Pachadi Recipe :కొంతమందికి భోజనంలో ఎన్ని కూరలున్నా కూడా ఏదోక పచ్చడితో.. రెండు ముద్దలు తింటేనే తృప్తిగా ఉంటుంది. అలాంటి వారి కోసం కాస్త కారంగా ఎంతో రుచికరంగా ఉండే ఒక సూపర్​ పచ్చడినిపరిచయం చేయబోతున్నాం. అదే 'పెరుగు ఊర కారం పచ్చడి'. పెరుగులో ఎండుమిర్చిలను ఊర బెట్టి ఈ పచ్చడి తయారు చేస్తారు. ఈ పచ్చడిని ఇడ్లీ, వడ, దోశ, బజ్జీ వంటి అన్ని టిఫెన్ల నుంచి వేడివేడి అన్నం వరకు అన్నింటితోనూ తినొచ్చు. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈకారం పచ్చడితోతింటే టేస్ట్​ సూపర్​గా ఉంటుంది. మరి ఇక లేట్​ చేయకుండా.. ఈజీగా ఈ పెరుగు ఊర కారం పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు..

  • ఎండు మిర్చి-20
  • రుచికి సరిపడా ఉప్పు
  • జీలకర్ర-టేబుల్​స్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు-15
  • పెరుగు-కప్పు
  • ధనియాలు-2 టేబుల్​స్పూన్లు
  • బెల్లం పొడి-టేబుల్​స్పూన్

తాలింపు కోసం..

  • నూనె - 2 టేబుల్​స్పూన్లు
  • జీలకర్ర-అర టీస్పూన్​
  • ఆవాలు-అర టీస్పూన్
  • అల్లం తురుము-టీస్పూన్
  • పచ్చిశనగపప్పు-​టీస్పూన్
  • కరివేపాకు
  • ఎండుమిర్చి-2
  • ఇంగువ-అర టీస్పూన్
  • పసుపు - చిటికెడు

తయారీ విధానం..

  • ముందుగా ఎండుమిర్చిలను చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి. అందులోని గింజలను పూర్తిగా తీసేసుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పచ్చడిలోకి మిర్చి గింజలు వేసుకోకూడదు.
  • ఇప్పుడు ఎండుమిర్చి ముక్కలున్న గిన్నెలో బాగా చిలికిన పెరుగును మిర్చి ముక్కలు మునిగేంత వరకు పోయాలి. ఆ తర్వాత గిన్నెపై మూత పెట్టి గంటపాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత ధనియాలను వేయించి తీసుకోవాలి.
  • తర్వాత ఒక మిక్సీ జార్లోకి పెరుగులో ఊరెబట్టిన ఎండు మిర్చిలను వేసుకోవాలి. అలాగే అందులోకి ఎండు మిరపకాయను ఊరబెట్టగా మిగిలిన పెరుగు కొద్దిగా, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, వేయించిన ధనియాలు వేసుకోవాలి. వీటిన్నింటినీ మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు తాలింపు కోసం పాన్​ పెట్టి ఆయిల్​ వేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అల్లం తురుమువేసి వేయించుకోవాలి.
  • అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి మిశ్రమాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి.
  • అలాగే మిగిలిన పెరుగు వేసుకుని కలుపుకోవాలి. స్టౌ మీడియం ఫ్లేమ్​లో పెట్టుకుని పచ్చడి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. పచ్చడి దగ్గర పడి.. నూనె పైకి తేలిన తర్వాత బెల్లం పొడి వేసి కలుపుకోండి. (కొద్దిగా బెల్లం వేయడం వల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.)
  • తర్వాత స్టౌ ఆఫ్​ చేయాలి. అంతే ఇలా చేసుకుంటే ఎంతో రుచికరమైన పెరుగు ఊర కారం పచ్చడి రెడీ. ఇది రెండు వారాల పాటు నిల్వ ఉంటుంది. నచ్చితే మీరు కూడా ఇంట్లో ఈ పచ్చడి ట్రై చేయండి.

పచ్చి చింతకాయల రోటి పచ్చడి - పుల్లగా, కారంగా అద్దిరిపోతుంది!

అమ్మమ్మల కాలం నాటి "కంది పచ్చడి" - మీరు ఎన్నడూ చూడని రుచి చూస్తారు!

ABOUT THE AUTHOR

...view details