తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఇంట్లో తియ్యని వేడుక ఎప్పుడు చేసుకున్నా - "పాలతాలికల పాయసం"తో ఇలా చేసుకోండి! - టేస్ట్ కేక - Pala Thalikalu Recipe

How to Make Pala Talikalalu : పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ పాలతాలికల పాయసమంటే ఇష్టమే. కప్పులో పాయసం వేసి ఇలా ఇవ్వగానే.. క్షణాల్లోనే ఎంతో ఇష్టంగా ఒకటికి రెండు కప్పులు ఆరగిస్తారు. అయితే.. పాలతాలికలు ఎంతో రుచికరంగా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Pala Talikalalu
How to Make Pala Talikalalu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2024, 2:38 PM IST

Pala Talikala Payasam Recipe : చాలా మందికి స్వీట్లంటే ఎంతో ఇష్టం. పండగల సమయంలో తప్పకుండా వివిధ రకాల స్వీట్లు తయారు చేస్తుంటారు. ఇక ఇంట్లో శుభకార్యాలు ఏవైనా జరుగుతుంటే మిఠాయిలతోనే ప్రారంభిస్తుంటారు. ఇంట్లో ఏ పండుగైనా కూడా గృహిణులు పాలతాలికలు చేస్తుంటారు. అయితే.. అందరికీ ఈ రెసిపీ పర్ఫెక్ట్​గా చేయడం రాదు. అందుకే.. మీ కోసం టేస్టీగా పాలతాలికలు ఎలా చేయాలో ఒక స్టోరీ తీసుకొచ్చాం. ఇక్కడ చెప్పిన విధంగా పాలతాలికలు చేస్తే.. టేస్ట్​ అమృతంలా ఉంటుంది. మరి ఇక లేట్​ చేయకుండా పాలతాలికల పాయసం ఎలా చేయాలో ఓ లుక్కేయండి..

కావాల్సిన పదార్థాలు..

తాలికల కోసం..

  • బియ్యం పిండి-కప్పు
  • బెల్లం తురుము-2 టేబుల్​స్పూన్లు
  • ఉప్పు-చిటికెడు

బెల్లం పాకం కోసం..

  • బెల్లం- కప్పు
  • నీళ్లు-గ్లాసు

పాయసం కోసం..

  • సగ్గుబియ్యం - అరకప్పు
  • నీళ్లు - 2 గ్లాసులు
  • పాలు-3 గ్లాసులు
  • యాలకుల పొడి-అరటీస్పూన్​
  • నెయ్యి-3 టేబుల్​స్పూన్లు
  • ఎండుకొబ్బరి- అరకప్పు
  • బాదం- 10
  • జీడిపప్పు-10

తయారీ విధానం..

  • ముందుగా స్టౌపై పాన్​ పెట్టుకుని అందులో బెల్లం వేసుకోవాలి. ఇందులో నీళ్లు పోసుకుని పాకం మరిగించాలి. దీనిని పక్కన పెట్టుకోవాలి.
  • అరగంటపాటు సగ్గు బియ్యం నీటిలో నానబెట్టుకోవాలి.
  • తాలికల కోసం గిన్నెలో బియ్యం పిండి తీసుకోవాలి. ఇందులో బెల్లం తురుము, చిటికెడు ఉప్పు వేసుకుని కలుపుకోవాలి.
  • తర్వాత పాయసం కోసం గిన్నెలో నీటిని పోసుకుని మరిగించండి. ఇందులో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి సగం ఉడికించుకోండి.
  • ఇందులోని కొన్ని వాటర్​ తీసుకుని.. తాలికల కోసం కలుపుకున్న పిండిలో పోసుకోండి. ఈ పిండిని చేతికి నెయ్యి రాసుకుని తాలికలు సిద్ధం చేసుకోండి.
  • తాలికల కోసం ఇలా సగ్గు బియ్యం ఉడికించిన నీటిని వాడడం వల్ల తాలికలు విరిగిపోకుండా ఉంటాయి.
  • తర్వాత సగ్గుబియ్యం నీటిలో పాలు పోసుకుని కాగనివ్వండి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో టేబుల్​స్పూన్​ నెయ్యి వేయండి. ఇందులో తాలికలు వేసుకుని మూత పెట్టి ఉడికించండి. అలాగే బెల్లం పాకం పోసుకోవాలి. యాలకుల పొడి వేసుకుని కలుపుకుని కొద్దిసేపు ఉడికించుకోండి.
  • మరొక వైపు పాన్​లో నెయ్యి వేసుకోవాలి. ఇందులో పచ్చికొబ్బరి, బాదం, జీడిపప్పులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని పాయసంలో కలుపుకుని 5 నిమిషాలు ఉడికించుకోవాలి.
  • అంతే ఇలా చేస్తే ఎంతో రుచికరమైన సూపర్​ టేస్టీ పాలతాలికల పాయసం మీ ముందుంటుంది. ఏదైనా స్వీట్​ తినాలనిపించినప్పుడు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

మధురమైన "స్వీట్​ పూరీలు" - ఇలా చేస్తే అద్భుతాన్ని ఆస్వాదిస్తారు!

బయటి జిలేబీ అన్​ హెల్దీ కావొచ్చు! - ఇంట్లో ఇలా ఈజీగా ప్రిపేర్​ చేసుకోండి - రుచి అమృతమే!

ABOUT THE AUTHOR

...view details