తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

రైస్​ కుక్కర్​లో "ఎగ్​ మసాలా దమ్​ బిర్యానీ" - చాయ్ పెట్టినంత ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు! - Egg Dum Biryani in Rice Cooker - EGG DUM BIRYANI IN RICE COOKER

Egg Dum Biryani: బిర్యానీ అంటే నాన్ వెజిటేరియన్స్ అందరికీ ఇష్టమే. అది.. చికెన్​, మటన్​ అనే తేడా ఏమి ఉండదు. అయితే.. ఈసారి ఎగ్​తో అద్దిరిపోయే దమ్​ బిర్యానీ ట్రైచేయండి. అది కూడా రైస్​ కుక్కర్​లో! చాలా ఈజీగా చేసేయొచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Egg Dum Biryani
Egg Dum Biryani (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2024, 2:19 PM IST

Egg Double Masala Dum Biryani in Rice Cooker:బిర్యానీ తయారు చేయాలంటే.. అది చాలా పెద్ద ప్రాసెస్. కానీ.. చాయ్ పెట్టినంత సులువుగా ఎగ్ దమ్ బిర్యానీ తయారు చేసేయొచ్చు. రైస్​ కుక్కర్ ద్వారా ఈజీగా ఫినిష్ చేసేయొచ్చు. ఈ బిర్యానీ తిన్నారంటే వారెవ్వా అనాల్సిందే. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..

కావాల్సిన పదార్థాలు:

మసాలా కోసం:

  • ఉప్పు - సరిపడా
  • పసుపు - పావు టీ స్పూన్​
  • ధనియాల పొడి - 1 టీ స్పూన్​
  • జీలకర్ర పొడి - అర టీ స్పూన్​
  • గరం మసాలా - 1 టీ స్పూన్​
  • కసూరి మేతీ - 1 టీ స్పూన్​
  • కారం - 1 టేబుల్​ స్పూన్​
  • నూనె - 3 టేబుల్​ స్పూన్లు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ - 2 టీ స్పూన్లు
  • ఫ్రైడ్​ ఆనియన్స్​ - కప్పు
  • కొత్తిమీర, పుదీనా తరుగు - కొద్దిగా
  • పెరుగు - 1 కప్పు

బిర్యానీ కోసం :

  • ఉప్పు - 1 టేబుల్​ స్పూన్​
  • దాల్చిన చెక్క - 1 ఇంచ్​
  • లవంగాలు - 5
  • యాలకులు - 3
  • షాజీరా - అర టీ స్పూన్​
  • మరాఠీ మొగ్గ - 1
  • అనాస పువ్వు - 1
  • జాపత్రి - కొద్దిగా
  • నూనె - 2 టేబుల్​ స్పూన్లు
  • నిమ్మరసం - 2 టీ స్పూన్లు
  • ఉడికించిన కోడి గుడ్లు - 6
  • బాస్మతి బియ్యం - అర కేజీ
  • పచ్చిమిర్చి చీలికలు - కొన్ని
  • నెయ్యి - 2 టేబుల్​ స్పూన్లు
  • ఫుడ్​ కలర్​ - చిటికెడు

తయారీ విధానం:

  • ముందుగా రైస్​ కుక్కర్​లో కుక్కర్​ గిన్నె పెట్టి రెండు లీటర్ల నీరు పోసి మరిగించుకోవాలి. అలాగే బాస్మతీ బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. కుక్కర్​లోనే ఫ్రైడ్​ ఆనియన్స్​ రెడీ చేసుకోవాలి. లేదంటే సూపర్​ మార్కెట్స్​లో ఫ్రైడ్​ ఆనియన్స్​ అందుబాటులో ఉంటాయి. వాటిని తీసుకోవచ్చు. అలాగే పుదీనా, కొత్తిమీరను సన్నగా కట్​ చేసుకోవాలి. కోడిగుడ్లను ఉడికించి పొట్టు తీసి కొద్దిగా గాట్లు పెట్టి పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మసాలా సిద్ధం చేసుకోవాలి. అందుకోసం ముందుగా ఓ గిన్నె తీసుకుని అందులోకి ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కసూరి మేతి, కారం, నూనె వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్​, కొన్ని ఫ్రైడ్​ ఆనియన్స్​, కొద్దిగా పుదీనా, కొత్తిమీర తరుగు, పెరుగు వేసుకుని మొత్తం కలుపుకుని పక్కకు పెట్టుకోండి.
  • రైస్​ కుక్కర్​లోని నీరు మరుగుతున్నప్పుడు ఉప్పు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాపత్రి, నూనె, నిమ్మరసం, నానబెట్టుకున్న బాస్మతీ బియ్యం వేసి కలిపి మూత పెట్టి 70 శాతం ఉడికించాలి.
  • ఇప్పుడు మరో రైస్​ కుక్కర్​ గిన్నె తీసుకుని.. అందులో 70 శాతం ఉడికిన అన్నాన్ని కొద్దిగా జల్లెడ సాయంతో తీసుకుని ఒక లేయర్​గా వేసుకోవాలి. ఆపై ఉడికించిన కోడి గుడ్లు పెట్టి ముందే ప్రిపేర్​ చేసుకున్న మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని పచ్చిమిర్చి చీలికలు, ఫ్రైడ్​ ఆనియన్స్​, పుదీనా, కొత్తిమీర తరుగు, కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. ఆపైన మిగిలిన అన్నాన్ని వేసుకోవాలి. ఆ తర్వాత రైస్​ ఉడికించిన నీళ్లు కొద్దిగా(సుమారు 100ml), ఫ్రైడ్​ ఆనియన్స్​, పుదీనా, కొత్తిమీర, నెయ్యి, ఫుడ్​ కలర్​ వేసుకోవాలి.
  • ఆ తర్వాత మూత పెట్టి గిన్నెను రైస్​ కుక్కర్​లో పెట్టి ట్రిప్​ అయ్యే వరకు ఉడికించుకోవాలి.
  • 15 నిమిషాల తర్వాత తీసి సర్వ్​ చేసుకుంటే టేస్టీ అండ్​ యమ్మీగా ఉండే ఎగ్​ డబుల్​ మసాలా దమ్​ బిర్యానీ రెడీ. దీన్ని వేడి వేడిగా తింటే సూపర్​గా ఉంటుంది. మరి మీరూ ట్రై చేస్తారా..!

ఇవీ చదవండి:

ఎప్పుడూ చికెన్​ బిర్యానీయేనా? - ఈ సారి పనసకాయ బిర్యానీ ట్రై చేయండి! - టేస్ట్​లో నాన్​వెజ్​ కూడా దిగదిడుపే!

సండే స్పెషల్​ - నోరూరించే ప్రాన్స్​ బిర్యానీ! ఇలా చేశారంటే మళ్లీ మళ్లీ తినడం పక్కా!

సండే స్పెషల్​ - టేస్టీ "రాజుగారి కోడి పులావ్​" - ఇలా చేస్తే ఆహా అనాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details