ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / offbeat

10నిమిషాల్లో చిక్కటి గడ్డ పెరుగు - రసాయనాలు లేకుండానే చిన్న చిట్కాతో ఇలా తయారు చేసుకోండి - INSTANT CURD MAKING PROCESS

సహజసిద్ధంగానే 15 నిమిషాల్లోనే పెరుగు రెడీ - సింపుల్​ చిట్కా - ఫాలో అయితే సరి!

instant curd making process
instant curd making process (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2025, 12:43 PM IST

YOGURT MAKING PROCESS :అప్పటికప్పుడు ఇంట్లో పెరుగు కావాలంటే బయటకు పరిగెత్తి దుకాణాల్లో కొనుక్కొస్తుంటాం. లేదంటే ఒక రోజు ముందుగా ఇంట్లో పాలు తోడు పెట్టుకుని పెరుగు తయారు చేసుకుంటాం. పెరుగు తయారు కావడానికి ఇకపై రోజంతా ఎదురుచూడాల్సిన పన్లేదు. చిక్కటి పెరుగు నిమిషాల వ్యవధిలో తయారు చేసుకోవచ్చు. ఓ వైపు కర్రీ చేస్తుండగానే చిన్న చిట్కా ఉపయోగించి గడ్డ పెరుగు రెడీ చేసుకోవచ్చని మీకు తెలుసా? అయితే, ఈ చిట్కా ఫాలో అవ్వండి గడ్డ పెరుగు తయారు చేసి ఇంట్లో కుటుంబ సభ్యులను ఆశ్చర్యంలో ముంచెత్తండి.

రేషన్ బియ్యంతో మెత్తని దూదిలాంటి ఇడ్లీలు - రవ్వ కొనాల్సిన అవసరమే లేదు!

రుచికరమైన కూరలు ఎన్ని ఉన్నా భోజనం చివర్లో పెరుగు లేదా మజ్జిగతో తినకుండా తృప్తిగా ఉండదు. పెరుగు లేదంటే ఏదో వెలితిగా ఉంటుంది. అందుకే చిక్కటి పెరుగు చిటికెలో తయారు చేయాలనుకుంటే ఈ స్టోరీ చదివేయండి. ఆరోగ్యానికి పెరుగు ఎంతో అవసరం. అనేక పోషకాలతో నిండిన పెరుగు చాలా రుచితో పాటు మనసుకు హాయినిస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. పాలు, పెరుగు కలిపిన తర్వాత చిక్కటి పెరుగు తయారు కావడానికి కనీసం 8 గంటలు పడుతుంది. ఇంట్లో ఇలా తయారు చేసిన పెరుగు మార్కెట్లో లభించే పెరుగు కంటే మందంగా, రుచిగా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి పెరుగును పావుగంటలో తయారు చేయడానికి ఈ చిట్కా ఉపయోగించండి.

ఇన్​స్టెంట్ పెరుగు తయారీకి చిట్కాలు

గడ్డ పెరుగును త్వరగా తయారు చేసుకోవడానికి , ముందుగా పాలను ఓ పాత్రలో పోసుకుని పొయ్యి మీద వేడి చేయాలి. పాలు ఎంత బాగా మరిగితే పెరుగు కూడా అంత చిక్కగా, రుచికరంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. బాగా మరిగిన పాలను గోరు వెచ్చగా అయ్యే వరకు చల్లార్చుకోవాలి. ఇపుడు అందులో కొద్దిగా తోడు కోసం పెరుగు కలుపుకోవాలి. పెరుగు పుల్లగా ఉండాలంటే పెరుగు ఎక్కువగా కలుపుకోవాలి. పులుపు అవసరం లేకుండా టేస్టీగా ఉండాలంటే కొంచెం తక్కువ తోడు వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా సాధారణంగా పెరుగు తయారు చేసే ప్రక్రియ మాదిరిగానే ఉంటుంది. కానీ, 10 నిమిషాల్లో పెరుగు కావాలంటే ఇక్కడే చిట్కా ఉపయోగించాలి.

పెరుగు కలిపిన పాలను మరో పాత్రలో పోసుకుని అల్యూమినియం ఫాయిల్‌తో కవర్ చేయాలి. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్‌ తీసుకుని అందులో కొన్ని నీళ్లు పోసుకోవాలి. దాంట్లో పెరుగు తయారీ కోసం అల్యూమినియం ఫాయిల్​తో కవర్ చేసిన పాత్రను ఉంచి కుక్కర్‌ విజిల్ తీసేసి 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెరుగు పాత్రను తీసి చల్లారబెట్టుకోవాలి. అది పూర్తిగా చల్లారిన తర్వాత చిక్కటి గడ్డ పెరుగు రెడీగా ఉంటుంది. ఇది మరింత రుచిగా కూడా ఉంటుంది.

ఈ ఆకు రోజుకొక్కటి చాలు - ఎన్నో సమస్యలకు చెక్ పెట్టినట్లే!

'షుగర్ పేషెంట్లకు సూపర్ ఫుడ్'! - జొన్నపిండితో అప్పటికప్పుడు హెల్దీ దోసెలు

ABOUT THE AUTHOR

...view details