తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

కారం చెక్కలు గట్టిగా అవుతున్నాయా? - ఈ దసరాకి ఇలా చేయండి - ఎన్నడూ లేని రుచి చూస్తారు! - How to Make Chekka Garelu at Home - HOW TO MAKE CHEKKA GARELU AT HOME

Karam Chekkalu : తరాలుగా కట్టె గారెలు లేదా కారం చెక్కలు స్నాక్స్‌కి బెస్ట్‌ చాయిస్‌గా మారాయి. టీ తాగుకుంటూ వీటిని తింటుంటే వచ్చే కిక్కే వేరు. అయితే నేటి కాలంలో చేయడం రాకనో.. చేసే టైం లేకనో.. సూపర్​ మార్కెట్స్​కు వెళ్లి తెచ్చుకుంటున్నారు. అయితే ఈ టిప్స్​ పాటిస్తూ.. క్రిస్పీగా, టేస్టీగా ఇంట్లోనే ఈ చెక్కలను తయారు చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం..

Karam Chekkalu
Karam Chekkalu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2024, 3:58 PM IST

Karam Chekkalu Making Process:పండగ పిండి వంటల్లో, రోజువారీ చిరుతిండిలో ఫస్ట్​ ప్లేస్​లో చెక్కలు ఉంటాయి. ఒక్కసారి చేసుకుంటే 15 నుంచి 20 రోజుల వరకూ పసందుగా లాగించవచ్చు. తెలంగాణ లోగిళ్లలో పండగలకు వారం ముందు నుంచే చెక్కల తయారీ మొదలవుతుంది. ఇక పిల్లలు ఉన్న ఇంట్లో అయితే చెప్పక్కర్లేదు. పప్పులు, నువ్వులు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి కలయికతో తయారయ్యే చెక్కలు చూడగానే నోరూరిస్తాయి. ఇక ఇవి ప్రాంతాన్ని బట్టి రుచి, పేర్లు మారుతుంటాయి. కట్టె గారెలు, చెక్క గారెలు, కారం చెక్కలు, పప్పు చెక్కలు.. ఇలా ఒకటేమిటి నచ్చిన రీతిలో చేసుకుంటుంటారు. అయితే నేటి కాలంలో చేయడం రాకనో.. చేసే టైం లేకనో.. సూపర్​ మార్కెట్స్​కు వెళ్లి తెచ్చుకుంటున్నారు. అయితే ఈ టిప్స్​ పాటిస్తూ.. క్రిస్పీగా, టేస్టీగా ఇంట్లోనే ఈ చెక్కలను తయారు చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం..

కావాల్సిన పదార్థాలు:

  • పొడి బియ్యప్పిండి - అరకేజీ
  • తెల్ల నువ్వులు - 2 చెంచాలు
  • వాము - 1 చెంచా
  • జీలకర్ర - 2 చెంచాలు
  • కరివేపాకు తురుము - కొద్దిగా
  • పచ్చి శనగపప్పు - 2 చెంచాలు
  • పెసరపప్పు - 2 చెంచాలు
  • కారం - 1 చెంచా
  • ఉప్పు - సరిపడా
  • పసుపు - పావు చెంచా
  • గోరువెచ్చని నీరు - సరిపడా
  • నూనె - డీప్​ ఫ్రైకి సరిపడా
  • నెయ్యి - 2 చెంచాలు

తయారీ విధానం:

  • ముందుగా పచ్చి శనగపప్పు, పెసరపప్పను శుభ్రంగా కడిగి రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి.
  • ఆ తర్వాత బియ్యప్పిండిని జల్లించుకోవాలి.
  • పప్పులు నానిన తర్వాత.. వెడల్పాటి ప్లేట్​ తీసుకుని అందులోకి బియ్యప్పిండి, నువ్వులు, వాము, జీలకర్ర, కరివేపాకు, నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు, పెసరపప్పు, కారం, ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత రెండు చెంచాల కరిగించుకున్న నెయ్యి వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. నెయ్యి లేకపోతే వెన్నపూస లేదా వేడి నూనె కూడా ఉపయోగించవచ్చు.
  • ఇప్పుడు బియ్యప్పిండిలో కొద్దికొద్దిగా గోరు వెచ్చని నీరు పోసుకుంటూ చపాతీ పిండి కంటే కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. ఈ దశలోనే ఉప్పు చూసుకుని సరిపోకపోతే వేసుకోవచ్చు.
  • ఆ తర్వాత పిండి ముద్దపై నూనె లేదా నెయ్యి రాసుకుని తడిగుడ్డ కప్పి ఓ అరగంట సేపు పక్కకు పెట్టుకోవాలి.
  • అరగంట తర్వాత స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి డీప్​ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • ఈ లోపు బియ్యప్పిండి మిశ్రమాన్ని మరోసారి కలుపుకుని మీడియం సైజ్​లో ఉండలుగా చేసుకోవాలి. అయితే ఈ ఉండలన్నీ గాలికి ఆరిపోకుండా క్లాత్​ కప్పే ఉంచాలి.
  • ఇప్పుడు అరిటాకు లేదా పాలిథిన్​ కవర్​పై నూనె లేదా నెయ్యి రాసి ఓ ఉండను పెట్టి చేతి వేళ్ల సాయంతో గుండ్రంగా ఒత్తుకోవాలి. అలాని పల్చగా కాకుండా.. మందంగా కాకుండా ఓ మాదిరిగా ఒత్తుకోవాలి.
  • ఆ తర్వాత కాగుతున్న నూనెలో వేసుకోవాలి. అయితే ఇక్కడ అన్నీ ఒకేసారి నూనెలో వేయకుండా ఒక్కటి వేసి అది పైకి తేలిన తర్వాత మరొకటి వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. లైట్​ బ్రౌన్​ కలర్​ వచ్చిన తర్వాత తీసేసి పక్కకు పెట్టుకోవాలి.
  • అయితే ఇక్కడ చెక్కలు కాలాయా లేదా అని తెలుసుకోవాలంటే చెక్కలు లైట్​ బ్రౌన్​ కలర్​లోకి వచ్చిన నూనె పొంగడం అనే ఆగిపోతుంది. అప్పుడు ఇవి కాలినట్టు అర్థం చేసుకుని నూనెలోంచి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా అన్నింటిని చేసుకుని చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో పెట్టుకుంటే 20 రోజుల వరకు హాయిగా తినొచ్చు.

ABOUT THE AUTHOR

...view details