తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

సూపర్​ టేస్టీ అండ్​ హెల్దీ "బాదం షేక్​" - ఇలా ప్రిపేర్​ చేస్తే బయట అస్సలు కొనరు! - HOW TO MAKE BADAM MILK AT HOME

-బయట లభించే టేస్ట్​తోనే ఇంట్లో బాదం పాలు -ఇలా చేస్తే పిల్లలూ, పెద్దలూ ఎంజాయ్​ చేస్తారు

How To Make Badam Milk At Home
How To Make Badam Milk At Home (Getty Images)

By ETV Bharat Telangana Team

Published : Feb 25, 2025, 10:03 AM IST

How To Make Badam Milk At Home: మార్చి రాకముందే ఉష్ణోగ్రతలు పెరుగుతోన్నాయి. ఈ క్రమంలోనే ఉక్కపోత నుంచి బయటపడేందుకు, ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది కూల్​కూల్​గా ఉండే జ్యూసులు, డ్రింక్​లను ఆశ్రయిస్తున్నారు. మరికొద్దిమంది బాదంపాలకు ఓటేస్తున్నారు. అయితే బయట షాపుల్లో లభించే బాదం పాలు అంత చిక్కగా ఉండవు. పైగా వాటిలో బాదం పప్పులు బదులు వాటి ఫ్లేవర్​ తెలిసేలా ఏవేవో కెమికల్స్​ కలుపుతుంటారు. అలా అని వాటిని తాగలేకుండా కూడా ఉండలేరు. ఇకపై బాదం పాలు తాగలనుకున్నవారు ఎటువంటి టెన్షన్​ లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు. పైగా ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. అలాగే హెల్దీ కూడా. ఒక్కసారి ఈ పాలను రెడీ చేశారంటే పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఒకటికి రెండు గ్లాసులు తాగడం పక్కా! మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

  • బాదం పప్పులు - 20
  • చిక్కటి పాలు - 1 లీటర్​
  • కుంకుమ పువ్వు - చిటికెడు
  • కస్టర్డ్​ పౌడర్​ - ఒకటిన్నర స్పూన్​
  • యాలకులు పొడి - అర టీ స్పూన్​
  • పంచదార - 5 టేబుల్​ స్పూన్లు
  • సన్నగా కట్​ చేసిన బాదం - 1 టీ స్పూన్లు
  • సన్నగా తరిగిన పిస్తా - 1 టీ స్పూన్​
  • జీడిపప్పు పలుకులు - 1 టీ స్పూన్

తయారీ విధానం:

  • ఓ గిన్నెలోకి బాదం పప్పులు వేసి కొన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఒకవేళ అంత టైమ్​ లేదంటే వేడి నీటిలో ఓ గంట నాననివ్వాలి. నానిన బాదం పప్పుల పొట్టు తీసి ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి మందపాటి, వెడల్పు గిన్నె పెట్టి చిక్కటి పాలు పోసుకోవాలి. హై ఫ్లేమ్​లో పాలు రెండు పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఆ తర్వాత సిమ్​లో పెట్టి అందులోనుంచి ఓ అర కప్పు పాలను ఓ గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టాలి.
  • ఈ లోపు పాలను కలుపుతూ మరిగించుకోవాలి. పాలు మరిగిస్తున్నప్పుడు గిన్నెకు అంటుకున్న మీగడను తీసి పాలలో వేస్తూ మరిగించుకోవాలి.
  • పాలు మరుగుతున్నప్పుడు కుంకుమ పువ్వు వేసి కలిపాలి. ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్​ చేయవచ్చు. లేదంటే ఫుడ్​ కలర్​ వేసుకున్న సరిపోతుంది.
  • పాలు మరుగుతున్న సమయంలో మిక్సీ జార్​ తీసుకుని అందులో పొట్టుతీసిన బాదం పప్పులు, పక్కకు తీసిన పాలలో ఓ రెండు టేబుల్​ స్పూన్ల మిల్క్​ పోసి మెత్తని పేస్ట్​లా చేసుకోవాలి.
  • ఇప్పుడు మిగిలిన పాలలో కస్టర్డ్​ పౌడర్​ వేసి ఉండలు లేకుండా కలపాలి. పాలు వేడిగా ఉంటే కస్టర్డ్​ పౌడర్​ గడ్డకడుతుంది. కాబట్టి పాలు చల్లారిన తర్వాత ఈ పొడి వేసి కలపాలి.
  • మరుగుతున్న పాలు చిక్కబడిన తర్వాత యాలకుల పొడి వేసి కలపాలి. ఆ తర్వాత కస్టర్డ్​ పౌడర్​ కలిపిన పాలను మరుగుతున్న పాలల్లో కొద్దికొద్దిగా పోసుకుంటూ కలిపి ఓ మూడు నిమిషాలు కలుపుతూ మరిగించుకోవాలి.
  • ఆ తర్వాత గ్రైండ్​ చేసుకున్న బాదం పేస్ట్​ వేసి మరొక్కసారి కలిపి మరో 5 నిమిషాలు కాగబెట్టాలి.
  • ఇప్పుడు పంచదార వేసి కలపాలి. ఇక్కడ పంచదార అనేది మీరు తీపి తినేదానికి అనుగుణంగా వేసుకుంటే సరి. ఆ తర్వాత సన్నగా తరిగిన బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులు వేసి మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్​లో మరిగించాలి.
  • బాదం పాలు చిక్కగా మారిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఓ గాజు జార్​లోకి తీసుకుని మూత పెట్టి ఫ్రిజ్​లో ఉంచాలి. వీలైతే రాత్రంతా లేదంటే 3 గంటల పాటు ఫ్రిజ్​లో ఉంచాలి.
  • 3 గంటల తర్వాత ఫ్రిజ్​లో నుంచి తీసి గ్లాస్​ల్లోకి సర్వ్​ చేసుకుని పైన డ్రైఫ్రూట్స్​తో గార్నిష్​ చేసుకుంటే సూపర్​ టేస్టీ అండ్​ హెల్దీ బాదం షేక్​ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే "కొబ్బరి జున్ను" - సింపుల్​గా ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ వేరే లెవల్ అంతే!

ఇంట్లో పాలు, పంచదార ఉంటే చాలు- ఎంతో రుచికరమైన "పాలకోవా" ఈజీగా చేసుకోవచ్చు!

ABOUT THE AUTHOR

...view details