తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

పొద్దున్నే పొట్టలో ఏదో ఒకటని వేస్తున్నారా? - ఇవే తినాలంటున్న వైద్యులు! - MORNING BREAKFAST

- టేస్ట్​ కోసం బ్రేక్​ ఫాస్ట్ చేయొద్దని సూచన - ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిక

Morning Breakfast
Morning Breakfast` (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 30, 2024, 8:43 AM IST

Breakfast :మనిషి ఆరోగ్యానికీ.. అనారోగ్యానికీ మధ్య వారధి ఆహారమే. ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం? ఎప్పుడు తింటున్నాం? అనేది చాలా కీలకం అన్నది నిపుణుల మాట. ఇందులో ఎక్కడ తేడా వచ్చినా.. హెల్త్ షెడ్డుకు పోవడం తప్పదు అంటారు. కానీ.. అవగాహన లేక కొందరు, అవసరం కొద్దీ కొందరు.. ఏదో ఒకటి తినేస్తుంటారు. ఆకలి తీర్చుకోవడానికి అందుబాటులో ఏది ఉంటే.. అది తినేస్తుంటారు. మరీ ముఖ్యంగా టిఫెన్​ సెంటర్ల వద్ద నిలబడి నోటికి రుచికరమైన వన్నీ పొట్టలో వేసేస్తుంటారు. కానీ.. ఇలా చేయడం వల్ల హెల్త్ దెబ్బ తింటుందని హార్వర్డ్‌ పోషకాహార నిపుణుడు డేవిడ్‌ లుడ్విగ్‌ హెచ్చరిస్తున్నారు. ఉదయపు తిండిలో తప్పకుండా చక్కటి పదార్థాలు ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.

ఇవి తినండి..

రాత్రి 8-9 గంటల ప్రాంతంలో భోజనం చేస్తే.. తిరిగి ఉదయం 8 తర్వాతే తింటారు చాలా మంది. అంటే.. ఈ రెండు భోజనాల మధ్య దాదాపు 12 గంటల గ్యాప్​ ఉంటుంది. ఇంత గ్యాప్​ తినేటప్పుడు శరీరానికి శక్తినిచ్చే, ఆరోగ్యాన్నిచ్చే ఆహారం తీసుకోవాలి తప్ప, నష్టం కలిగించే ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దని నిపుణుల సూచన.

పీచు కంపల్సరీ..

పొద్దున్నే తినే ఆహారంలో తప్పకుండా పీచు ఉండేలా చూసుకోవాలని లుడ్విగ్​ సూచిస్తున్నారు. ఇందుకోసం.. రాగులు లేదా జొన్నలు లేదా సజ్జలతో చేసిన పదార్థాలు తినాలని చెబుతున్నారు. వీటితో తయారైన బ్రెడ్‌, అటుకులు, ఓట్‌మీల్‌ వంటివి మంచి ఆప్షన్​ అని అంటున్నారు.

మాంసకృత్తులు..

పీచుతోపాటు మాంసకృతులు కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు. వీటికోసం.. ఉడకబెట్టిన గుడ్లు, పెరుగు వంటి మంచి ఆహారమని చెప్పారు. ఈ పదార్థాల నుంచి మాంసకృత్తులు మాత్రమే కాకుండా.. ఖనిజాలు, అత్యవసర విటమిన్లు కూడా అందుతాయని అంటున్నారు.

ఆ తిండి అసలే వద్దు..

ఉదయం టిఫెన్ అనగానే టిఫెన్​ సెంటర్లకు పరిగెత్తేవాళ్లే ఎక్కువ. అక్కడ దొరికే టిఫెన్స్ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. కానీ.. పలు రకాల కారణాలతో బయటే తింటూ ఉంటారు. అయితే.. ఇలా తినడం ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు. బయట దొరికి పదార్థాల్లో అధిక ఉప్పు, నూనె ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల అనారోగ్య కారకాలు బాడీలో చేరుతుంటాయి. అందుకే.. ఇంట్లోనే తినడం మంచిదని డేవిడ్ సూచిస్తున్నారు.

ఇవి కూడా తినండి..

పైన చెప్పుకున్న పీచు, మాంసకృతులతోపాటు తాజా పండ్లు, బాదం, సోయాపాలు, ఆక్రోట్‌, కాయగూరలు వంటివి తినాలని సూచిస్తున్నారు. కాజు, వాల్​ నట్స్ వంటివి యాడ్​ చేసుకుంటే ఇంకా మంచిదని సూచిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details