Green Peas Breakfast Recipes :పులావ్, బిర్యానీ, కిచిడీ, ఉప్మా, చాట్ ఇలా ఏ వంటకానికైనా అదనపు రుచినీ, కంటికింపైన రంగునీ ఇస్తుంది పచ్చి బఠాణీ. ఇందులో పోషకాల మోతాదూ ఎక్కువే. అయితే, ఎప్పుడూ సైడ్ క్యారెక్టర్‌గా కాకుండా చలికాలం ఎక్కువగా దొరికే పచ్చి బఠాణీలను మెయిన్ లీడ్ తీసుకుంటూ ఈ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలను ట్రై చేయండి. ఇవి నోటికి సరికొత్త టేస్ట్‌ని అందించడంతో పాటు శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి! మరి, పచ్చి బఠాణీలతో ప్రిపేర్ చేసుకునే ఆ రెసిపీలేంటి? అందుకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానమేంటో ఇప్పుడు చూద్దాం.
ఇడ్లీలు :
కావాల్సిన పదార్థాలు :
- 1 కప్పు - పచ్చి బఠాణీలు
- 1 కప్పు - పెరుగు
- 1 కప్పు - బొంబాయి రవ్వ
- రెండు - పచ్చిమిర్చి
- 2 టేబుల్‌స్పూన్లు - ఆయిల్
- అరటీస్పూన్ - ఆవాలు
- 1 టీస్పూన్ - మినప్పప్పు
- చిన్న ముక్క - అల్లం
- కొద్దిగా - కరివేపాకు
- 1 టీస్పూన్ - బేకింగ్ సోడా
- రుచికి సరిపడా - ఉప్పు
పప్పు రుబ్బే పనిలేదు - చిటికెలో "సేమియా ఇడ్లీ" - టేస్ట్ అద్దిరిపోతాయి!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చి బఠాణీలు, పచ్చిమిర్చి, అల్లంతో పాటు తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకొని పక్కనుంచాలి.
- ఇప్పుడు స్టౌపై చిన్న కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేసి వేయించి దింపి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మిక్సీ పట్టుకున్న పచ్చి బఠాణీ పేస్ట్, పెరుగు, బొంబాయి రవ్వ, ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఆపై వేయించుకున్న తాలింపునీ బఠాణీ మిశ్రమంలో వేసి కలపాలి.
- ఆ తర్వాత అందులో బేకింగ్ సోడా, తగినన్ని వాటర్ వేసుకొని మరోసారి మిశ్రమం మొత్తం చక్కగా కలిసేలా కలుపుకొని పక్కనుంచాలి.
- ఇప్పుడు స్టౌపై ఇడ్లీ పాత్ర పెట్టి తగినన్ని వాటర్ పోసి మరిగించుకోవాలి. ఆలోపు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని కాస్త ఆయిల్ అప్లై చేసుకొని అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న బఠాణీ మిశ్రమాన్ని వేసుకోవాలి.
- నీళ్లు మరుగుతున్నప్పుడు మూత తీసి ముందుగా రెడీ చేసుకున్న ఇడ్లీ ప్లేట్లను అందులో పెట్టాలి. ఆపై మీడియం ఫ్లేమ్ మీద 15 నుంచి 20 నిమిషాలు ఉడికించుకొని స్టౌ ఆఫ్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే "పచ్చి బఠాణీ ఇడ్లీలు" రెడీ!