తెలంగాణ

telangana

By ETV Bharat Features Team

Published : 4 hours ago

ETV Bharat / offbeat

పక్కా పల్లెటూరి రుచిలో - నోరూరించే "గోంగూర పచ్చడి" - ఇలా ప్రిపేర్​ చేసుకుంటే వారం నిల్వ! - Village Style Gongura Pachadi

Gongura Pachadi Recipe : గోంగూర.. ఈ పేరు చెబితే చాలు గుటకలు వేయని తెలుగువాళ్లు ఉండరేమో. అలాంటి వారికోసం.. పక్కా పల్లెటూరి స్టైల్​లో కమ్మగా, టేస్టీగా ఉండే గోంగూర పచ్చడిని తీసుకొచ్చాం. దీన్ని వేడివేడి అన్నంలో కొద్దిగా వేసుకుని తింటే అమృతమే! మరి, ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Village Style Gongura Chutney
Gongura Pachadi Recipe (ETV Bharat)

How to Make Village Style Gongura Chutney: గోంగూరను ఇష్టపడనివాళ్లు దాదాపుగా ఉండరు కదూ! దీన్ని విడిగానే కాదు, ఇతర కాయగూరలతో కలిపి వండినా నోరూరిపోతుంది. అంత రుచికరంగా ఉండే గోంగూరతో పక్కా పల్లెటూరి స్టైల్​లో ఎప్పుడైనా పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నారా? లేదంటే ఇప్పుడే ఓసారి ట్రై చేయండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది! పైగా ఈ పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇంతకీ, ఈ సూపర్ టేస్టీ గోంగూర చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు
  • గోంగూర - 2 కట్టలు(మీడియం సైజ్​లో ఉన్నవి)
  • పచ్చిమిర్చి - 10 నుంచి 15
  • టమాటాలు - 2
  • ఆయిల్ - 1 టేబుల్ స్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు - 3
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ఉల్లిపాయ - 1(చిన్న సైజ్​లో ఉన్నది)

తాళింపు కోసం :

  • నూనె - 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు
  • పోపు గింజలు - 1 టేబుల్ స్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు - 4
  • ఎండుమిర్చి - 4 నుంచి 6
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • ఇంగువ - పావు టీస్పూన్

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో గోంగూరను గిల్లుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే.. టమాటాలు, ఉల్లిపాయను కాస్త పెద్ద సైజ్ ముక్కలుగా తరిగి పక్కన ఉంచుకోవాలి. అదేవిధంగా.. గోంగూర పులుపుకి తగిన విధంగా పచ్చిమిర్చిని తీసుకొని వాటిని తరిగి పెట్టుకోవాలి.
  • అనంతరం స్టౌ పై.. పాన్ పెట్టుకొని పల్లీలను దోరగా వేయించుకోవాలి. ఆపై వాటిని మిక్సీ జార్​లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు అదే పాన్​లో ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక.. తరిగి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి ముక్కలు, గోంగూర వేసుకోవాలి. తర్వాత పాన్​పై మూత పెట్టుకొని మంటను లో ఫ్లేమ్​లో ఉంచి మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంటే.. టమాటా, పచ్చిమిర్చి, గోంగూర నూనెలో బాగా మగ్గి సాఫ్ట్​గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి.
  • ఆవిధంగా ఉడికించుకున్నాక.. స్టౌ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఆలోపు మిక్సీ జార్​లో తీసుకున్న పల్లీలను మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
  • తర్వాత అందులో చల్లార్చుకున్న గోంగూర మిశ్రమం, వెలుల్లి రెబ్బలు, ఉప్పు వేసుకొని కాస్త కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆపై దాన్ని ఒక బౌల్​లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు.. అదే మిక్సీ జార్​లో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిగా కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. అనంతరం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయను ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిలో వేసుకొని మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
  • తర్వాత పచ్చడికి తాళింపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇందుకోసం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక.. పోపు గింజలు(ఆవాలు, జీలకర్ర, మినప పప్పు, శనగపప్పు), కాస్త దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాళింపును దోరగా వేయించుకోవాలి.
  • ఇక చివరగా అందులో ఇంగువ వేసి ఒకసారి కలిపి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని ఆ తాళింపులో వేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మంట మీద మధ్యమధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి.
  • ఉల్లిపాయ కాస్త మగ్గిన తర్వాత.. స్టౌ ఆఫ్ చేసుకుని పాన్​ను దించుకుంటే చాలు. అంతే.. నోరూరించే సూపర్ టేస్టీగా ఉండే "విలేజ్ స్టైల్ గోంగూర పచ్చడి" రెడీ!
  • ఈ పచ్చడిని చల్లారాక ఒక బాక్స్​లో పెట్టుకొని ఫ్రిజ్​లో స్టోర్ చేసుకుంటే పది రోజుల పాటు నిల్వ ఉంటుంది!

ఇవీ చదవండి :

నోరూరించే స్పైసీ గోంగూర పనీర్ కర్రీ - ఇలా ప్రిపేర్ చేయండి - టేస్ట్ వేరే లెవల్​!

గోంగూర రొయ్యల కర్రీ - ఈ టిప్స్​ పాటిస్తూ చేస్తే టేస్ట్​ సూపర్​ హిట్​!

ABOUT THE AUTHOR

...view details