తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

నోరూరించే చింతకాయ "చేపల వేపుడు" - ఇలా చేస్తే ఎవరైనా లొట్టలేసుకుంటూ తినాల్సిందే! - GREEN FISH FRY RECIPE

హోటల్ స్టైల్ "గ్రీన్ ఫిష్ ఫ్రై" - ఒక్కసారి తింటే వదిలిపెట్టరంతే!

How to Make Green Fish Fry
Green Fish Fry Recipe (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 10 hours ago

Green Fish Fry Recipe in Telugu :వీకెండ్ వచ్చిందంటే చాలు.. చాలా మంది ఇళ్లలో నాన్​వెజ్ వంటకాలు ఘుమఘుమలాడాల్సిందే. అందులో ఎక్కువ మంది చికెన్, మటన్ వంటి వాటికే ఎక్కువ ప్రియార్టీ ఇస్తుంటారు. ధర ఎక్కువగా ఉన్నా వీటిని తినడానికే ఆసక్తి చూపిస్తుంటారు. చికెన్, మటన్ కంటే తక్కువ ధరకే లభిస్తూ ఆరోగ్యానికి మేలు చేసే చేపలను మాత్రం అంతగా తినడానికి ఇష్టపడరు. ఒకవేళ చేపలు తినాలనుకుంటే పులుసు, కూర, ఫ్రై వంటివి ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటుంటారు చాలా మంది. అందులోనూచేపల ఫ్రైను వివిధ రకాలుగా ట్రై చేస్తుంటారు.

ఈ క్రమంలోనే కొందరు ఎంత బాగా చేసినా చేపల ఫ్రై పర్ఫెక్ట్​గా కుదరట్లేదని బాధపడుతుంటారు. అలాంటి వారు ఓసారి హోటల్ స్టైల్​లో ఇలా "గ్రీన్ ఫిష్ ఫ్రై" ట్రై చేయండి. టేస్ట్​ అద్దిరిపోతుంది! పుల్లపుల్లగా కారం కారంగా ఉండే ఈ రెసిపీ ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా కంటిచూపు మెరుగుపడుతుంది! పైగా దీన్ని ఎవరైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి, ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • చేప ముక్కలు - ఐదు
  • చింతకాయలు - నాలుగు
  • ఉల్లిపాయ - 1
  • ఆయిల్ - 2 చెంచాలు
  • పచ్చిమిర్చి - 3
  • జీలకర్ర - అరటీస్పూన్
  • కారం - చెంచా
  • పసుపు - పావుటీస్పూన్
  • ఉప్పు - రుచికి తగినంత

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి తడి ఆరే వరకు పక్కన ఉంచాలి.
  • అలాగే రెసిపీలోకి కావాల్సిన చింతకాయలనూ నీట్​గా కడిగి పైన పెంకు తొలగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో చింతకాయలు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఆపై ఈ మిశ్రమాన్ని ఒక చిన్న మిక్సింగ్ బౌల్​లోకి తీసుకొని అందులో కారం, పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి.
  • తర్వాత ఆ పేస్ట్​ని ముందుగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న చేప ముక్కలకు పట్టించాలి. తదుపరి వాటిని 10 నిమిషాల పాటు ఫ్రిజ్​లో ఉంచాలి.
  • అనంతరం స్టౌపై పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక మ్యారినేట్ చేసి పది నిమిషాల పాటు ఫ్రిజ్​లో ఉంచిన చేప ముక్కలను వేసి రెండు వైపులా చక్కగా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "చింతకాయ చేపల ఫ్రై" రెడీ!

ఇవీ చదవండి :

"ఫిష్​ ఫ్రై బిర్యానీ" ఎప్పుడైనా ట్రై చేశారా? - ఈ టేస్ట్​ అస్సలు మర్చిపోలేరు!

సండే స్పెషల్​ : అద్దిరిపోయే బెంగాలీ స్టైల్​ "చేపల పులుసు"- ఈ విధంగా చేస్తే ప్లేట్లు నాకేస్తారు!

ABOUT THE AUTHOR

...view details