Best Cleaning Tips for Bathtub:ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే ఈ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. బాత్రూమ్ క్లీనింగ్ విషయంలో మాత్రం చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుంటారు. అందులోనూ బాత్‌టబ్‌ను వాడేవారు.. దాన్ని శుభ్రం చేయాలన్న విషయాన్నే మరచిపోతుంటారు. అయితే, బాత్‌టబ్‌లో సేదదీరే క్రమంలో మన బాడీలోని మురికికి తోడు బాత్రూమ్లోని తేమ కారణంగా.. దాని గోడలపై ఫంగస్ ఫామ్ అవుతుంది.
అప్పుడు అదే బాత్‌టబ్‌ని.. తిరిగి యూజ్ చేస్తే మన ఆరోగ్యానికే నష్టం. మరోవైపు.. దాని డ్రెయిన్ కూడా మూసుకుపోయే ఛాన్స్ ఉంటుంది! కాబట్టి.. అలా జరగకుండా ఉండాలంటే దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే కొన్ని టిప్స్ సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుకుందాం.
వెనిగర్, బేకింగ్ సోడా :ఈ రెండింటినీ సమాన పరిమాణంలో తీసుకొని పేస్ట్‌లా ప్రిపేర్ చేసుకోవాలి. ఆపై ఒక స్పాంజి సహాయంతో ఆ మిశ్రమాన్ని టబ్ మొత్తం పూయాలి. గంటసేపు అలా ఉంచి తర్వాత రుద్ది కడుక్కుంటే చాలు. దానిపై ఉన్న ఎలాంటి మొండి మరకలైనా ఇట్టే తొలగిపోయి బాత్‌టబ్ కొత్తదానిలా మెరుస్తుందంటున్నారు నిపుణులు.
వైట్ వెనిగర్ : ఇదీ బాత్టబ్పై మరకలను పోగొట్టడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇందుకోసం వేడి నీళ్లలో కొద్దిగా వైట్ వెనిగర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఆపై దాన్ని బాత్టబ్పై చల్లి 30 నిమిషాలు అలా వదిలేయాలి. తర్వాత బ్రష్‌తో టబ్, డ్రెయినర్ని రుద్ది.. శుభ్రమైన నీటితో క్లీన్ చేసుకోవాలి.
డిటర్జెంట్ పౌడర్ :బాత్టబ్పై మలినాలను తొలగించి కొత్తదానిలా మెరిపించడంలో లిక్విడ్ డిటర్జెంట్/డిటర్జెంట్ పౌడర్ కూడా చాలా బాగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం.. బాత్‌టబ్‌ను వేడి వాటర్‌తో నింపి అందులో 2 టేబుల్స్పూన్ల లిక్విడ్ డిటర్జెంట్/డిటర్జెంట్ పౌడర్ వేయాలి. ఆపై అరగంట ఆగి బ్రష్‌తో రుద్దుతూ.. క్లీన్ చేస్తే టబ్‌లో పేరుకున్న మురికి, మలినాలు ఇట్టే వదిలిపోతాయి.
నిమ్మరసం :దీనితో ఆరోగ్యప్రయోజనాలే కాదు బాత్‌టబ్ క్లీనింగ్‌కి చాలా బాగా సహాయపడుతుందంటున్నారు. ఇందుకోసం నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు కలిపి ఆ మిశ్రమాన్ని బాత్‌టబ్‌లో చల్లడం లేదంటే వేడి వాటర్ నింపిన టబ్‌లో దాన్ని పోయాలి. పావుగంట ఆగి టబ్‌ను స్క్రబ్బర్‌తో రుద్దుతూ క్లీన్ చేసుకుంటే.. దాని మురికి ఇట్టే వదిలిపోతుంది.