Govt Launches CRS Mobile App: జనన మరణాలను రిజిస్టేషన్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ సరికొత్త మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌తో తక్కువ సమయంలో ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంతేకాక దీని ద్వారా జనన, మరణ సర్టిఫికేట్స్ రెండింటినీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదేలాగంటే?ఈ అధికారిక లింక్ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి: https://dc.crsorgi.gov.in/crs/mobile-app-policy
కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఈ CRS (సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్) మొబైల్ యాప్‌ను లాంచ్ చేసింది. ఇది జనన మరణాలన రిజిస్ట్రేషన్స్ (స్మూత్ అండ్ హసల్ ఫ్రీ) చేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ కొత్త యాప్‌తో సిటిజన్స్ ఏ సమయంలోనైనా ఎక్కడి నుంచైనా తమ రాష్ట్రంలోని అధికారిక భాషలో బర్త్ అండ్ డెత్‌ను రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఈ మేరకు CRS మొబైల్ యాప్‌ను ప్రారంభించినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో పోస్ట్ చేశారు. ఈ యాప్‌లో చాలా ఈజీగా తక్కువ సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. డిజిటల్ ఇండియా విజన్‌లో భాగంగా ప్రధాని మోదీ దీన్ని రూపొందించారని వివరించారు.
ఈ పోస్ట్‌లో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి ఓ చిన్న వీడియోను కూడా యాడ్ చేశారు. ఇది యాప్ ఇంటర్ఫేస్ వివరాలను క్లియర్‌గా వివరిస్తుంది. CRS మొబైల్ యాప్ డిజిటల్ సర్టిఫికెట్ల ఎలక్ట్రానిక్ డెలివరీని, హెరిటేజ్ రికాటర్డ్స్ను ఆన్లైన్లో డిజిటలైజేషన్ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ మొబైల్ యాప్ ఆపరేటింగ్, మెయింటెనెన్స్‌కు రాష్ట్రాలపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదు.