How to Make Capsicum Stuffed Dum Biryani : చాలామంది మొహం చిట్లించుకుంటూ తినే కూరగాయల్లో ఒకటి.. క్యాప్సికం. మీరూ ఆ జాబితాలో ఉంటే ఓసారి దానితో ఇలా హైదరాబాదీ స్టైల్లో స్టఫ్డ్ వెజ్ బిర్యానీ ట్రై చేయండి. టేస్ట్ చాలా సూపర్‌గా ఉంటుంది! ఇంతకీ.. ఈ టేస్టీ వెజ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
స్టఫింగ్ కోసం :
- ఆయిల్ - పావు కప్పు
- జీలకర్ర - 1 టీస్పూన్
- ఉల్లిపాయ తరుగు - అర కప్పు
- జీడిపప్పు - 3 టేబుల్ స్పూన్లు
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
- పసుపు - పావు టీస్పూన్
- వేయించిన జీలకర్ర పొడి - అర టీస్పూన్
- ధనియాల పొడి - 1 టీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- కారం - 1 టీస్పూన్
- టమాటాలు - 2(సన్నగా తరుక్కోవాలి)
- గరం మసాలా - పావు టీస్పూన్
- పనీర్ తురుము - 200 గ్రాములు
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- కోవా - 50 నుంచి 75 గ్రాములు
క్యాప్సికం దమ్ కోసం :
- క్యాప్సికం - 6(మీడియం సైజ్‌లో ఉన్నవి)
- ఫ్రైడ్ ఆనియన్స్ - అర కప్పు
- కొత్తిమీర, పుదీనా తరుగు - కొద్దిగా
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
- ఉప్పు - రుచికి తగినంత
- పసుపు - పావు టీస్పూన్
- కారం - 1 టీస్పూన్
- జీలకర్ర పొడి - అర టీస్పూన్
- ధనియాల పొడి - అర టీస్పూన్
- గరం మసాలా - 1 టీస్పూన్
- నూనె - పావు కప్పు
- పెరుగు - అర కప్పు
బిర్యానీ రైస్ కోసం :
- బాస్మతి రైస్ - 2 కప్పులు
- వాటర్ - రెండు లీటర్లు
- దాల్చిన చెక్క ముక్కలు - 3
- యాలకులు - 7
- లవంగాలు - 8
- షాహి జీరా - అర టేబుల్‌స్పూన్
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - అర టేబూల్స్పూన్
- బిర్యానీ ఆకులు - 3
- ఉప్పు - తగినంత
- మరాటి మొగ్గ - 2
- కొత్తిమీర, పుదీనా తరుగు - కొద్దిగా
- నిమ్మరసం - కొద్దిగా
- కుంకుమ పువ్వు పాలు - అర కప్పు
- నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా బాస్మతి రైస్‌ను 1 గంటపాటు నానబెట్టుకోవాలి.
- ఈలోపు రెసిపీలోకి కావాల్సిన స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం.. స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక.. జీలకర్ర వేసి చిట్లనివ్వాలి.
- ఆ తర్వాత తరిగిన ఆనియన్స్ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే జీడిపప్పు పలుకులూ వేసి వేయించుకోవాలి.
- ఆనియన్స్ వేగి రంగు మారాయనుకున్నాక.. అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఆ తర్వాత అందులో పసుపు, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారం వేసి ఒక కలిపి బాగా వేయించుకోవాలి.
- అవన్నీ వేగాక.. సన్నని టమాటా తరుగు, గరం మసాలా వేసి కలిపి పావు కప్పు వాటర్ యాడ్ చేసుకొని టమాటాలు మెత్తగా, గుజ్జుగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి.
- ఆ తర్వాత.. పనీరు తురుము, కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. ఆపై అరకప్పు వాటర్ పోసి గరిటెతో చిదుముకుంటూ పనీరు సాఫ్ట్‌గా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి.
- అనంతరం ఆ మిశ్రమంలో కోవా వేసి గరిటెతో కలుపుతూ మీడియం ఫ్లేమ్ మంట మీద అది కరిగిపోయి గ్రేవీపైన ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఆపై పాన్‌ను దించుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు స్టఫింగ్ రెడీ అవుతుంది.
- ఇప్పుడు రెసిపీలోకి కావాల్సిన క్యాప్సికంను ముందు వైపు కాస్త కట్ చేసుకొని అందులోని గింజలు తీసేసుకోవాలి. అప్పుడు అవి కప్పుల్లా తయారవుతాయి.
- తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న.. స్టఫింగ్‌ను క్యాప్సికంలో స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం ఒక మందపాటి పాన్ తీసుకొని.. అందులో ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, నూనె.. వేసుకొని అన్నింటినీ బాగా పిండుతూ మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో పెరుగు వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి.
- తర్వాత దాన్ని పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని స్టఫ్ చేసుకున్న క్యాప్సికంను అందులో మధ్యలో ఉంచి ఆ గిన్నెను పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం.. స్టౌపై ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకోవాలి. ఆపై మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి నీటిని బాగా మరిగించుకోవాలి.
- అలా మరిగించుకున్నాక.. అందులో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, షాహి జీరా, అల్లంవెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకులు, మరాటి మొగ్గ, ఉప్పు వేసి.. ఎసరును హై-ఫ్లేమ్ మీద నాలుగైదు నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి.
- ఎసరు బాగా మరిగిందనుకున్నాక.. అందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా తరుగు వేసుకొని నిమ్మరసం పిండుకొని ఓసారి కలుపుకోవాలి.
- ఆ తర్వాత మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి ఆ మిశ్రమాన్ని 70% వరకు ఉడికించుకోవాలి.
- ఆవిధంగా ఉడికించుకున్నాక.. చిల్లుల గరిటెతో ఆ మిశ్రమాన్ని మసాలాలతో సహా వడకట్టుకొని ముందుగా బౌల్లో రెడీ చేసుకున్న స్టఫ్డ్ క్యాప్సికం దమ్ మీద అలా అలా వెదజల్లుకోవాలి.
- ఇప్పుడు కుంకుమపువ్వు పాలను బిర్యానీ అంతా పోసుకోవాలి. అలాగే నెయ్యి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా తరుగును బిర్యానీ అంతా చల్లుకోవాలి. చివరగా మీరు ఉడికించుకున్న బిర్యానీ వాటర్ నుంచి అరకప్పు నీరు తీసుకొని బిర్యానీ అంతా పోసుకోవాలి.
- అనంతరం.. బిర్యానీ నుంచి దమ్ బయటకిపోకుండా లిడ్ పెట్టేసి హై ఫ్లేమ్ మంట మీద 5 నిమిషాలు, లో ఫ్లేమ్ మంట మీద 8 నిమిషాల పాటు దమ్ చేసి.. ఆపై స్టౌ ఆఫ్ చేసి 20 నుంచి 30 నిమిషాలపాటు అలా వదిలేయాలి.
- అంతే.. ఇక ఆ తర్వాత మూత తీసి చూస్తే చాలు ఎంతో రుచికరంగా ఉండే "క్యాప్సికం స్టఫ్డ్ దమ్ బిర్యానీ" రెడీ!
ఇవీ చదవండి :
గోంగూరతో చికెన్ కర్రీ మాత్రమే కాదు బిర్యానీ చేయవచ్చు - ఇలా ప్రిపేర్ చేయండి - టేస్ట్ సూపర్!
గుత్తి వంకాయతో ఘుమఘమలాడే దమ్ బిర్యానీ - ఒక్కసారైనా తిని తీరాల్సిందే గురూ! - ఇలా ప్రిపేర్ చేయండి!