How to Make Restaurant Style Butter Naan at Home : చాలా మంది బటర్ నాన్ను ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా రెస్టారెంట్స్, హోటల్స్‌కి వెళ్లినప్పుడు ఎక్కువ మంది దీన్ని ఆర్డర్ చేస్తుంటారు. అయితే, అదే.. ఇంట్లో చేసుకోవాలంటే బటర్ నాన్ని కాల్చడానికి తందూర్ కావాలి. అదంతా చాలా ప్రాసెస్‌తో కూడుకున్నదిగా భావిస్తారు చాలా మంది. అలాకాకుండా.. పెనం మీద కూడా ఈజీగా రెస్టారెంట్(Restaurant) స్టైల్లో బటర్ నాన్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అదెలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- మైదా - ఒకటిన్నర కప్పులు
- పెరుగు - పావు కప్పు
- బేకింగ్ సోడా - అర చెంచా
- ఉప్పు - అర చెంచా
- పంచదార - అర చెంచా
- ఆయిల్ - కొద్దిగా
- బటర్ - కొద్దిగా
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మైదా తీసుకోవాలి. ఆపై అందులో పెరుగు, బేకింగ్ సోడా, ఉప్పు, పంచదారవేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఆ తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మరీ చపాతీపిండిలా గట్టిగా కాకుండా కాస్త జిగురు, జిగురుగా ఉండేలా పిండిని కలుపుకోవాలి.
- ఆవిధంగా పిండిని ప్రిపేర్ చేసుకున్నాక.. కొద్దిగా ఆయిల్ వేసి 5 నిమిషాల పాటు మరోసారి పిండిని మెత్తగా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా వత్తుకుంటే నాన్ రొట్టెలు అంత సాఫ్ట్‌గా వస్తాయి.
- ఆ తర్వాత వత్తుకున్న పిండిని బాల్స్ మాదిరిగా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి.
- అనంతరం మరో ప్లేట్ తీసుకొని దానిపై కొద్దిగా పొడి పిండిని చల్లుకొని బాల్స్‌గా చేసుకున్న పిండి ముద్దలను ఉంచి చేతితో కాస్త ఆయిల్ అప్లై చేసి డ్రై అయిపోకుండా వాటిపై ఒక తడిగుడ్డ వేసి 30 నిమిషాల పాటు అలా వదిలేయాలి. అరగంట తర్వాత క్లాత్ తీసి చూస్తే పిండి ముద్దలు బాగా పొంగినట్లు కనిపిస్తాయి.
- ఇప్పుడు స్టౌపై పెనం పెట్టుకొని వేడి చేసుకోవాలి. తర్వాత చపాతీ పీటపై కొద్దిగా పొడి పిండి వేసుకొని ఒక పిండి ముద్దను ఉంచి చేతితో వత్తుకుంటూ కాస్త స్ప్రెడ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత దాన్ని చేతిలోకి తీసుకొని ఒక చేతిలో నుంచి మరో చేతిలోకి మార్చుకుంటూ తడుతూ ఉంటే.. నాన్ సాగుతూ ఉంటుంది.
- ఇక ఇప్పుడు పర్ఫెక్ట్ నాన్ షేప్ కోసం ఒక ఎడ్జ్ పట్టుకొని చేతితో కొంచం స్ట్రెచ్ చేసుకోవాలి.
- ఆవిధంగా తయారుచేసుకున్న నాన్ను ఒకవైపు నీళ్లతో తడిచేసుకొని జాగ్రత్తగా స్టౌపై వేడిగా ఉన్న పెనం మీద వేసుకోవాలి. ఆపై స్టౌను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 నిమిషాల పాటు కాల్చుకోవాలి.
- అలా కాల్చుకున్నాక చేతితో పెనాన్ని మరో సైడ్‌కి తిప్పి పట్టుకొని హై ఫ్లేమ్ మీద నాన్ని అన్ని వైపులా కాల్చుకోవాలి.
- ఇక ఒకసైడ్ నాన్ మంచిగా గోల్డెన్ కలర్లో కాలిందనుకున్నాక దాన్ని ఒక ప్లేట్లోకి జాగ్రత్తగా తీసుకొని బటర్ అప్లై చేసుకోవాలి. అంతే.. పర్ఫెక్ట్ "రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్" రెడీ!