ETV Bharat / offbeat

మహాశివుడికి ఎంతో ఇష్టమైన "చిత్రాన్నం" - ఇలా ప్రిపేర్​ చేసి నైవేద్యం పెట్టండి - HOW TO MAKE TEMPLE STYLE CHITRANNAM

- ధనుర్మాసంలో శివాలయాల్లో ప్రసాదంగా చిత్రాన్నం - పిల్లల లంచ్​ బాక్స్​లకూ పర్ఫెక్ట్​ రెసిపీ

How to Make Temple Style Chitrannam
How to Make Temple Style Chitrannam (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 14 hours ago

How to Make Temple Style Chitrannam: దేవాలయాల్లో ఒక్కో టెంపుల్​కి ఒక్కో విశిష్టత ఉన్నట్టే.. భక్తులకు పంచే ప్రసాదాల్లోనూ ప్రత్యేకత ఉంటుంది. అలాంటి ప్రత్యేకత కలిగిన ప్రసాదాల్లో చిత్రాన్నం ఒకటి. ఈ చిత్రానాన్ని శైవాలయాల్లో ముఖ్యంగా ధనుర్మాస తిరుప్పావై సమయంలో విష్ణు మూర్తికి ప్రసాదంగా నివేదిస్తారు. ప్రత్యేకించి సంతోషిమాత వ్రతాన్ని చేసుకునే వారుకూడా అమ్మవారికి దీనిని నివేదిస్తారు. ఈ ప్రసాదాన్ని ప్రత్యేక తిథుల్లో శ్రీశైల మల్లికార్జునుడికి సమర్పిస్తారు. మరి ఇంతటి విశిష్టత కలిగిన చిత్రాన్నం ప్రసాదాన్ని మీరు ఇంట్లోనే ట్రై చేయండి. టేస్ట్​ అద్దిరిపోతుంది. పైగా చేయడం చాలా ఈజీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

  • బియ్యం - అర కప్పు
  • పచ్చి శనగపప్పు - రెండు టేబుల్​ స్పూన్లు
  • నీళ్లు - కప్పున్నర
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నెయ్యి - పావు కప్పు
  • ఆవాలు - అర టీ స్పూన్​
  • మినపప్పు - 1 టీ స్పూన్​
  • జీలకర్ర - అర టీ స్పూన్​
  • ఎండు మిర్చి - 3
  • మిరియాలు - అర టీ స్పూన్​
  • జీడిపప్పు - 2 టేబుల్​ స్పూన్లు
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • ఇంగువ - చిటికెడు(ఆప్షనల్​)
  • పచ్చి కొబ్బరి తురుము - పావు కప్పు
  • పచ్చిమిర్చి - 2

తయారీ విధానం:

  • ముందుగా పచ్చి శనగపప్పును శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి బియ్యం వేసి లో ఫ్లేమ్​లో వైట్​ కలర్​ వచ్చేవరకు రోస్ట్​ చేయాలి. ఇలా కలర్​ మారిన తర్వాత ఓ గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా కడిగి వడకట్టాలి.
  • ఇప్పుడు కుక్కర్​లోకి నానబెట్టిన శనగపప్పు, కడిగి వడకట్టిన బియ్యం, కప్పున్నర నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్​లో మూడు విజిల్స్​ వచ్చే వరకు కుక్​ చేసుకోవాలి.
  • కుక్కర్​ ఆవిరి పోయిన తర్వాత మూత తీసి ఓసారి కలిపి పక్కన పెట్టాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నెయ్యి వేసి కరిగించుకోవాలి.
  • నెయ్యి కరిగిన తర్వాత ఆవాలు, మినపప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, ఎండు మిర్చి వేసి ఫ్రై చేయాలి.
  • ఆ తర్వాత మిరియాలు, జీడిపప్పు, కరివేపాకు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇంగువ వేసి మరో నిమిషం పాటు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత పచ్చికొబ్బరి తురుము, సన్నగా కట్​ చేసిన పచ్చిమిర్చి చీలికలు వేసి కొబ్బరి ఎర్రగా మారే వరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఇలా వేయించుకున్న తాలింపును ఉడికించిన అన్నంలో వేసి కలిపితే సరి. ఎంతో రుచికరంగా ఉండే టెంపుల్​ స్టైల్​ చిత్రాన్నం రెడీ. నచ్చితే మీరూ దీనిని ట్రై చేయండి. ఇది కేవలం ప్రసాదంగా మాత్రమే కాదు లంచ్​ బాక్స్​లకు కూడా పర్ఫెక్ట్​ రెసిపీ.

ఎంతో రుచికరమైన శబరిమల "అరవణ ప్రసాదం" - ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా!

వంటసోడా లేకుండా అద్దిరిపోయే "అరటికాయ బజ్జీలు" - ఇలా చేస్తే నూనెె తక్కువ, రుచి ఎక్కువ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.