తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

వైట్ ఎగ్.. బ్రౌన్​ ఎగ్ - ఏ గుడ్డులో ఎక్కువ పోషకాలు ఉంటాయో మీకు తెలుసా? - Brown Vs White Eggs - BROWN VS WHITE EGGS

Brown Vs White Eggs in Telugu : ప్రస్తుత కాలంలో సూపర్​ మార్కెట్లలో వైట్​ ఎగ్స్​, బ్రౌన్​ ఎగ్స్​ రెండూ అమ్ముతున్నారు. అయితే.. చాలా మంది బ్రౌన్​ ఎగ్స్​లోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తారరు. ధర ఎక్కువైనా వాటినే కొనుగోలు చేస్తారు. మరి.. ఇది నిజమేనా?

Brown Vs White Eggs
Brown Vs White Eggs In Telugu (ETV Bharat)

By ETV Bharat Health Team

Published : Sep 9, 2024, 2:00 PM IST

Brown Vs White Eggs :మన దగ్గర చాలా షాపుల్లో తెల్లని పెంకు కలిగిన ఫారం గుడ్లు ఎక్కువగా అమ్ముతుంటారు. పెద్ద సూపర్​ మార్కెట్, సూపర్ బజార్ వంటి చోట్లకు వెళ్తే అక్కడ తెల్లని గుడ్ల​తోపాటు.. ముదురు గోధుమ రంగులో(బ్రౌన్​) ఉండే గుడ్లు కూడా కనిపిస్తాయి. ఈ రెండిట్లో ఏది మంచిదో మీకు తెలుసా?

చాలా మంది జనాలు వైట్​ ఎగ్స్​ కంటే.. బ్రౌన్ ఎగ్స్​లోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయని అనుకుంటుంటారు. కానీ, ఇది కేవలం అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు. కోడి గుడ్డు పెంకు రంగులో మాత్రమే తేడా ఉంటుందనీ.. అందులోని పోషకాలు దాదాపు సమానంగా ఉంటాయని చెబుతున్నారు. కోడి జాతులను బట్టి అవి పెట్టే గుడ్ల రంగు ఆధారపడి ఉంటుందని అంటున్నారు.

2019లో హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు.. తెలుపు, బ్రౌన్​ రంగు కోడిగుడ్లలో ఉన్న పోషకాలపై పరిశోధన చేశారు. ఈ రీసెర్చ్​లో రెండు గుడ్లలో పోషకాలు దాదాపు సమానంగా ఉన్నాయని కనుగొన్నారు. పరిశోధన 'న్యూట్రియంట్స్' జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ పరిశోధనలో హార్వర్డ్ T.H. చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్​కు చెందిన 'డాక్టర్​ జీన్-ఫిలిప్ డ్రౌయిన్-చార్టియర్' పాల్గొన్నారు.

అండలూసియన్, వైట్ లైఘోర్న్ అనే జాతులు తెల్లటి కోడి గుడ్ల​ను అధికంగా ఉత్పత్తి చేస్తాయట. అలాగే గోల్డెన్ కామెట్, రోడ్ ఐలాండ్ రెడ్, గోల్డ్ చికెన్ వంటివి.. బ్రౌన్ రంగు పెంకులతో ఎగ్స్​ని ఉత్పత్తి చేస్తాయి. ముదురు గోధుమ రంగులో ఉండే గుడ్లలో ప్రోటోపోర్ఫిరిన్ అనే పర్ణద్రవ్యం ఉంటుంది. దీని కారణంగా వాటి పెంకుపై ఎరుపు రంగు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. పోషకాలు, టేస్ట్​ పరంగా చూసుకున్నప్పుడు మాత్రం.. రెండూ ఒకేలా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. గుడ్డు పెంకు రంగు మారడం వల్ల రుచిలో, క్వాలిటీలో తేడా ఏమీ ఉండదని అంటున్నారు.

అందుకే ధర ఎక్కువ..
మార్కెట్లో వైట్​ ఎగ్స్​ కంటే.. బ్రౌన్ ఎగ్స్​ కాస్త ధర ఎక్కువగానే ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే.. గోధుమ రంగు గుడ్లు పెట్టే కోళ్ల జాతులు తక్కువగా ఉంటాయి. ఇంకా.. ఆ కోళ్లను పెంచడానికి ఎక్కువ ఖర్చవుతుంది. ఈ కారణంగానే ఆ గుడ్లను ఎక్కువ ధరకు విక్రయిస్తూ ఉంటారని చెబుతున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి :

గుడ్డులో ఎల్లో తినకపోతే - ఏం జరుగుతుందో తెలుసా?

షుగర్ బాధితులు - రోజూ గుడ్డు తింటే ఏమవుతుంది?

ABOUT THE AUTHOR

...view details