తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

సూపర్​ : పిల్లలు రోజూ ఈ లడ్డూలు తిన్నారంటే - ఫిజకల్లీ అండ్​ మెంటల్లీ సూపర్​ స్ట్రాంగ్​! - Best Food for Children to Grow - BEST FOOD FOR CHILDREN TO GROW

Best Food for Children: మీ పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదల తగ్గిందా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందా? అయితే డోంట్​ వర్రీ. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఆయుర్వేదం ప్రకారం పిల్లలకు ఈ లడ్డూలు పెడితే ఫలితం ఉంటుందని ఆయుర్వేదిక్​ కన్సల్టెంట్​ డాక్టర్​ గాయత్రీ దేవి అంటున్నారు.

Tips to Growth Children Physically and Mentally
Tips to Growth Children Physically and Mentally (Etv Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 10, 2024, 7:31 PM IST

Tips to Growth Children Physically and Mentally: పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ప్రతీ తల్లిదండ్రులు కోరుకుంటారు. అయితే వాళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే.. శారీరకంగా, మానసికంగా స్ట్రాంగ్​గా ఉండాలి. అందుకోసం వారికి చిన్నప్పటి నుంచి మంచి ఆహారం అందించాలి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని పిల్లలకు తప్పక తినిపించాలి. ఇలా పిల్లలకు సరైన పోషకాహారం అందించడం వల్ల పిల్లలు ఎత్తు, బలంతోపాటు మానసికంగా కూడా ఎంతో డెవలప్​ అవుతారు. అయితే పలు కారణాల వల్ల పిల్లలకు బలవర్థకమైన ఆహారం అందించడం కుదరదు. అలాంటి సమయంలో ఆయుర్వేదం ప్రకారం పిల్లలకు ఈ లడ్డూలు పెడితే శారీరకంగా, మానసికంగా ఎదుగుదల బాగుంటుందని ఆయుర్వేదిక్​ కన్సల్టెంట్​ డాక్టర్​ గాయత్రీ దేవి అంటున్నారు. ఈ లడ్డూలు తయారు చేయడం కూడా వెరీ ఈజీ అంటున్నారు.

లడ్డూలకు కావాల్సిన పదార్థాలు:

  • శొంఠి పొడి - 25 గ్రాములు
  • బెల్లం తురుము - పావు కిలో
  • ఎండు కొబ్బరి తురుము - 50 గ్రాములు
  • గోధుమ పిండి - 100 గ్రాములు
  • నెయ్యి - తగినంత
  • బాదం పప్పుల పొడి - 25 నుంచి 50 గ్రాముల వరకు
  • పిస్తా - 20 గ్రాములు

మీ పిల్లలను దగ్గు బాధిస్తోందా? - ఈ తియ్యని ఆయుర్వేద ఔషధంతో వెంటనే తగ్గిపోతుంది!

లడ్డూలు తయారు చేసే విధానం:

  • ముందుగా శొంఠిని నెయ్యిలో వేయించి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి.
  • అలాగే బాదంపప్పలను ఓ రెండు నిమిషాలు వేయించి పొడి చేసి పక్కకు పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి ఒక స్పూన్​ నెయ్యి వేసి వేడి చేసుకోవాలి.
  • అందులోకి గోధుమ పిండి వేసి లైట్​ బ్రౌన్​ కలర్​ వచ్చేవరకు వేయించుకుని స్టవ్​ ఆఫ్​ చేసి ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
  • అనంతరం ఆ గోధుమ పిండి మిశ్రమంలో ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి.
  • అలాగే అందులోకి బాదం పప్పుల పొడి, శొంఠి పొడి వేసుకోవాలి.
  • ఆ తర్వాత పిస్తా పలుకులు, బెల్లం తురుము వేసుకుని బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి 100 గ్రాముల నెయ్యి వేసి కరిగించుకోవాలి.
  • నెయ్యి కరిగిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి గోధుమ పిండి మిశ్రమంలో కొద్దికొద్దిగా నెయ్యి పోసుకుంటూ బాగా కలుపుకోవాలి.
  • అనంతరం ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. అంతే పిల్లలకు శారీరకంగా, మానసికంగా మేలు చేసే లడ్డూలు రెడీ. దీన్ని పిల్లలకు ఉదయం ఒకటి.. సాయంత్రం ఒకటి చొప్పున ఇస్తే మంచిదని చెబుతున్నారు.

మీ పిల్లలు ఫోన్, టీవీలకు అతుక్కుపోతున్నారా? డోంట్ వర్రీ - ఈ టిప్స్ మీ కోసమే!

పేరెంట్స్​కు అలర్ట్​ : పిల్లలు అన్నం మానేసి చిప్స్ తింటున్నారా? - ఈ అలవాటు మాన్పించకపోతే భారీ నష్టమట!

ABOUT THE AUTHOR

...view details