తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఈ చిన్న మార్పులు ట్రై చేయండి - మీ ఇల్లు కొత్తగా, అందంగా మెరిసిపోతుంది! - How to decorate House for Festival - HOW TO DECORATE HOUSE FOR FESTIVAL

Balcony Decor Ideas : ఇల్లు అందంగా కనిపించాలంటే బోలెడంత డబ్బు ఖర్చు పెట్టాలని అనుకుంటారు కొందరు. కానీ.. సరిగ్గా చూస్తే మార్కెట్లో లభించే కొన్ని చిన్న చిన్న వస్తువులతోనూ ఇంటిని అందంగా తీర్చిదిద్దొచ్చంటున్నారు ఇంటీరియర్‌ డిజైనర్లు. అందులో భాగంగా బాల్కనీ లుక్​ను మార్చే కొన్ని వస్తువులపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

Best Ideas for Decorating Balcony
Balcony Decor Ideas (ETV Bharat)

By ETV Bharat Features Team

Published : Sep 29, 2024, 3:55 PM IST

Best Ideas for Decorating Balcony :పండగల సందర్భంగా ఇంటిని శుభ్రం చేసుకోవడం ఆనవాయితీ. అయితే, ఈ సమయంలోనే మార్కెట్లో లభించే కొన్ని చిన్న చిన్న వస్తువులతో మీ ఇంటి అలంకరణ విషయంలో మార్పులు చేసి చూడండి. ఇల్లంతా కొత్తగా మంచి లుక్​తో మెరిసిపోతుందని అంటున్నారు ఇంటీరియర్ డిజైనర్లు. ఇంతకీ, ఇంటి అందాన్ని పెంచే ఆ వస్తువులేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

స్విచ్​బోర్డులను మార్చండిలా.. చాలా మంది ఇళ్లలో హోమ్ డెకరేటివ్ ఐటమ్స్, ఇతరత్రా ఉపకరణాలు ఎక్కువగా బాల్కనీలోనే కనిపిస్తుంటాయి. అందులో స్విచ్​బోర్డులు ఒకటి. ఎందుకంటే.. విశాలంగా ఉండే బాల్కనీలో స్విచ్​బోర్డుల సంఖ్య ఎక్కువే. అయితే, కొన్నిసార్లు అందులో ఏ స్విచ్​ దేనికో తెలియక.. స్విచ్​లు వేయడానికే టైమ్ వేస్ట్ అవుతుంటుంది. అలాకాకుండా వాటిని ఈ 'స్విచ్​బోర్డ్ స్టిక్కర్ల'తో అలంకరించండి. పారదర్శకంగా ఉండే.. ఈ వినైల్‌ స్టిక్కర్లు లైట్లు, ఫ్యాన్లు, ఇలా అన్నిరకాలు గుర్తులతో లభిస్తాయి. వాటిని జస్ట్ ప్యాకెట్‌ నుంచి తీసి స్విచ్‌ మీద అతికించేయడమే. ఇవి ఎక్కువ రోజుల పాటు ఊడిపోకుండా ఉంటాయి. పైగా స్విచ్​బోర్డులు మంచి లుక్​ని సంతరించుకుంటాయి!

వాటిని తగిలించేయొచ్చు..సాధారణంగా ఇంటి క్లీనింగ్‌ కోసం వాడే చీపుర్లు, మాప్, డస్ట్‌ప్యాన్‌ వంటి వాటిని అలా బాల్కనీ గోడకు ఆనించి ఉంచుతుంటాం. వాటిని అలా ఉంచినప్పుడు ఆ ప్రదేశం చూడడానికి అందవిహీనంగా కనిపిస్తుంటుంది. అలాకాకుండా.. మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన ‘మాప్, బ్రూమ్‌ హోల్డర్లు’ తెచ్చుకున్నారంటే.. మీ బాల్కనీ అందాన్ని మరింత పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వాటిని సింపుల్​గా గోడకు అంటించి క్లీనింగ్ పరికరాలన్నీ వాటికి ఉండే స్లాట్​లలో ఉంచేస్తే సరిపోతుందని తెలిపారు. క్రమపద్దతిలో కనిపిస్తూ కదలకుండా ఉండిపోతాయి. అలాగే.. బాల్కనీ కూడా చిందరవందరగా లేకుండా ఆర్గనైజ్‌డ్‌గా కనిపిస్తుందని అంటున్నారు.

వీటితో ఇంటికి మరింత అందం.. ఇంటిని మనం ఎంత దగ్గరుండి డిజైన్‌ చేయించుకున్నా సరే... ఇంట్లో కొంత స్థలం అలానే నిరుపయోగంగా మిగిలిపోతుంటుంది. షెల్పులు, ర్యాకుల్లో కొన్ని వస్తువులు పెట్టాక కూడా పైన బోలెడంత ఖాళీ ప్లేస్ కనిపిస్తుంటుంది. దాంతో మిగిలిన వస్తువులు ఎక్కడ పెట్టాలో తెలియక తికమక పడిపోతుంటారు. అలాంటి టైమ్​లో.. ‘టెలిస్కోపిక్‌ రాడ్‌ ర్యాక్​లు’ భలే యూజ్ అవుతాయి. చూడ్డానికి చిన్న షెల్ఫ్‌లా ఉండే వీటిని కిచెన్, బాల్కనీ, బాత్‌రూమ్‌ ఎక్కడైనా సరే తేలిగ్గా సెట్ చేసుకోవచ్చు. వాడుకోవాల్సిన వస్తువుల్ని దానిమీద పెట్టేయొచ్చు. షాంపూ బాటిల్‌ దగ్గరనుంచి చిన్న చిన్న పూలకుండీలూ, కాఫీ మగ్‌లూ ఇలా ఏదైనా సర్దేయొచ్చు. చోటు ఆదా అవుతుంది. చూడ్డానికీ ఆయా ప్రాంతాలు మంచి లుకింగ్​తో కనిపిస్తాయంటున్నారు​ ఇంటీరియర్ డిజైనర్లు.

టెలిస్కోపిక్‌ రాడ్‌ ర్యాక్​ (ETV bharat)

ఇవీ చదవండి :

ఇలా చేశారంటే - మీ చిన్న ఇల్లు కూడా పెద్దగా, అందంగా కనిపిస్తుంది!

దసరాకు ఇల్లు శుభ్రం చేస్తున్నారా? - ఈ రూల్ పాటిస్తే క్లీనింగ్ వెరీ ఈజీ!!

ABOUT THE AUTHOR

...view details