తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

సూపర్ టేస్టీ "బెంగాలీ స్టైల్ ఎగ్ కర్రీ" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా - రుచి అద్దిరిపోతుంది! - Bengali Style Egg Curry - BENGALI STYLE EGG CURRY

Bengali Style Egg Curry Recipe : కోడిగుడ్లతో ఏదైనా కూర చేయాలనుకున్నప్పుడు ఎప్పటిలా కాకుండా ఈసారి "బెంగాలీ స్టైల్​ ఎగ్ కర్రీ"ని ట్రై చేయండి. రుచి అద్దిరిపోతుంది! పైగా చాలా తక్కువ సమయంలో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి.. ఈ సూపర్ టేస్టీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How to Make Bengali Style Egg Curry
Bengali Style Egg Curry Recipe (ETV Bharat)

By ETV Bharat Features Team

Published : Sep 29, 2024, 2:56 PM IST

How to Make Bengali Style Egg Curry : ఇంట్లో ఎలాంటి కూరగాయలూ లేకపోతే గుడ్డుతో ఏదో ఒక కూర వండేయడం మామూలే. అయితే, ఈసారి అదే గుడ్డుతో ఎప్పటిలా కాకుండా కాస్త డిఫరెంట్​గా ఇలా 'బెంగాలీ స్టైల్​లో ఎగ్ కర్రీ' ప్రిపేర్ చేసుకోండి. ఇది అన్నం, రోటీ, పులావ్.. దేనికైనా మంచి కాంబినేషన్ అవుతుంది. మరి.. ఇంకెందుకు ఆలస్యం ఈ సండే చాలా ఈజీగా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకొని.. ఇంటిల్లిపాది ఎంజాయ్ చేయండి. ఇంతకీ.. ఈ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • గుడ్లు - 4 నుంచి 6
  • ఆవాల నూనె - 3 టేబుల్ స్పూన్లు
  • ఆవాలు - అర టీస్పూన్
  • ఎండుమిర్చి - 2
  • ఉల్లిపాయ - 1 (పెద్ద సైజ్​లో ఉన్నది)
  • ​వెల్లుల్లి రెబ్బలు - 4
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్​స్పూన్
  • పచ్చిమిర్చి - 3
  • టమాటాలు - 2(పెద్ద సైజ్​లో ఉన్నవి)
  • పసుపు - 1 టీ స్పూన్
  • కారం - తగినంత
  • ధనియాల పొడి - 1 టీస్పూన్
  • జీలకర్ర పొడి - 1 టీస్పూన్
  • గరం మసాలా - 1 టీస్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా(గార్నిష్ కోసం)

తయారీ విధానం :

  • ముందుగా స్టౌపై ఒక గిన్నె పెట్టుకొని నీళ్లతో పాటు కొద్దిగా ఉప్పు వేసుకొని గుడ్లను ఉడికించుకోవాలి. అవి ఉడికాక వాటిని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
  • అయితే, గుడ్లు ఉడికేలోపు రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలను శుభ్రంగా కడిగి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే.. కొత్తిమీరను తరిగి పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆవాల నూనె వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక.. ఉడికించి పక్కన పెట్టుకున్న గుడ్లు అందులో వేసి అవి అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆపై వాటిని ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం అదే పాన్​లో మరికొంత ఆయిల్ వేసి వేడిచేసుకోవాలి. నూనె వేడెక్కాక.. ఆవాలు, ఎండుమిర్చి వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత అందులో ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆనియన్స్ కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఉల్లిపాయలు మంచిగా వేగాయనుకున్నాక.. టమాటా ముక్కలు వేసుకొని అవి సాఫ్ట్​గా మారేంత వరకు వేయించుకోవాలి.
  • అనంతరం ఈ మిశ్రమంలో.. పసుపు, కారం, ఉప్పు వేసి ఒకసారి కలపాలి. ఆపై అవి మాడకుండా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి పైన ఆయిల్ తేలేంత వరకు మిశ్రమాన్ని ఉడికించుకోవాలి.
  • ఆ విధంగా ఉడికించుకున్నాక.. వేయించుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి.
  • తర్వాత కాసేపు లో ఫ్లేమ్​లో ఉడికించుకొని దింపే ముందు చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకొని దించుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "బెంగాలీ స్టైల్ ఎగ్ కర్రీ" రెడీ!

ABOUT THE AUTHOR

...view details