తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

కాఫీ తాగడం కాదు - ఒంటికి పూసుకోండి - అందంగా మెరిసిపోండి!

మానసిక ప్రశాంతత కోసం కాఫీని తాగడం మాత్రమే కాదు - ఇలా చేశారంటే మెరిసే చర్మ, జుట్టు సౌందర్యం మీ సొంతం!

BEAUTY BENEFITS OF COFFEE
Beauty Benefits with Coffee (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Beauty Benefits with Coffee :కాలమేదైనా అందంగా మెరిసిపోవాలని అమ్మాయిలు ఆరాటపడడం కామన్. ఈ క్రమంలోనే కొందరు ఇంట్లోనే రకరకాల సౌందర్యపరమైన చిట్కాలు ఫాలో అయితే.. మరికొందరు బ్యూటీ పార్లర్లను ఆశ్రయిస్తుంటారు. అలాకాకుండా రోజూ తాగే కాఫీతో అందంగా మెరిసిపోవచ్చని మీకు తెలుసా? అదెలా అని ఆశ్చర్యపోతున్నారా! అవునండీ.. కాఫీని తాగడం మాత్రమే కాకుండా ఒంటికి పూసుకోవడం ద్వారా మీ చర్మ, జుట్టు సౌందర్యాన్ని మరింత పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. అదెలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మనసుని హుషారెత్తించే కాఫీకి మేనికి మెరుపునిచ్చే శక్తి కూడా ఉందంటున్నారు సౌందర్య నిపుణులు. కాఫీతయారీకి వాడే కాఫీ పొడి/గింజల వల్ల ఎన్నో సౌందర్యపరమైన ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. అలాంటి వాటిల్లో కొన్నింటిని పరిశీలిస్తే..

కాంతులీనే చర్మానికి కాఫీ!

చాలా మంది చర్మం ముడతలు పడకుండా యాంటీ ఏజింగ్ క్రీంలను ఉపయోగిస్తుంటారు. అయితే, కాఫీ కూడా మంచి యాంటీ ఏజింగ్ ఏజెంట్‌లా పని చేస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఒక కప్పు నీటిని తీసుకొని అందులో రెండు కప్పుల కాఫీ గింజలు, కొన్ని చుక్కల టీట్రీ నూనె వేసి కలపాలి. ఆపై ఈ మిశ్రమాన్ని బ్లెండర్‌తో బాగా కలిపి, బ్రష్‌తో ముఖానికి అప్లై చేసుకోవాలి. కాసేపు అలా ఉంచి తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. దీనివల్ల చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోయి చర్మం బిగుతుగా తయారవ్వడమే కాకుండా కాంతులీనుతుంది! అలాగే పిగ్మెంటేషన్ సమస్య దూరమవుతుందంటున్నారు.

మొటిమలకు చెక్ పెట్టొచ్చు!

కాఫీకి ఆలివ్ నూనెని జోడించి ఈ మిశ్రమంతో ముఖానికి మర్దన చేస్తే మొటిమలసమస్య తగ్గుతుందట. అలాగే, కొంతమందికి మోచేతులు, మోకాళ్ల భాగాల్లో చర్మం పొట్టులా ఊడిపోతుంటుంది. అలాంటివారు కాఫీ గింజలతో ఆ ప్రదేశంలో రుద్దితే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

గ్లోయింగ్ స్కిన్ కావాలా? - నిపుణులు సూచిస్తున్న సూపర్​ డైట్​ మీ కోసం!

స్క్రబ్‌గా..కాఫీ పౌడర్ చర్మానికి మంచి స్క్రబ్‌గానూ పని చేస్తుందంటున్నారు నిపుణులు. ఇది చర్మంపై ఉన్న మృతకణాలను ఈజీగా తొలగించి.. నిగనిగలాడే మేని మెరుపు సొంతం చేసుకోవడానికి సహాయపడుతుందంటున్నారు. దీనికోసం స్నానం చేసే సమయంలో కాఫీపొడిని నేరుగా చర్మంపై రుద్దుకుంటే సరిపోతుందట. స్క్రబింగ్ కోసం కాఫీ గింజలను సైతం యూజ్ చేయవచ్చంటున్నారు.

డార్క్ సర్కిల్స్​ దూరం.. ప్రస్తుత రోజుల్లో చాలా మంది వివిధ కారణాల వల్ల కళ్ల కింద నల్లటి వలయాల సమస్యను ఎదుర్కొంటుంటారు. దాంతో ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాకాకుండా ఒకసారి కాఫీపొడిని కూడా ప్రయత్నించి చూడమంటున్నారు నిపుణులు. కళ్ల కింద వచ్చే నల్లటి వలయాలను తగ్గించుకోవడానికి మీరు ఉపయోగించే క్రీంలో మెత్తగా ఉండే కాఫీపొడి కొద్ది మొత్తంలో కలిపి మచ్చలు ఉన్నచోట రాసుకోవాలి. కాసేపు అలాగే ఉంచి ఆపై కడుక్కుంటే సరిపోతుందంటున్నారు. అయితే, ఎప్పుడూ కాఫీ పొడిని నేరుగా మాత్రం కళ్ల కింద రాసుకోకూడదని చెబుతున్నారు.

జుట్టు ఆరోగ్యాన్ని పెంచేలా..

జుట్టును సంరక్షించుకోవడానికి మనం అనేక రకాల ప్రొడక్ట్స్ వాడుతుంటాం. అలాకాకుండా కాఫీతో కూడా జుట్టు ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇది మంచి కండిషనర్‌గా పనిచేసి జుట్టునుమృదువుగా అయ్యేలా చేస్తుందంటున్నారు. ఇందుకోసం కాఫీపొడిని నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆపై దానిని ఒక బౌల్​లోకి వడపోయాలి. ఆ తర్వాత ఆ నీటిని జుట్టుకు అప్త్లె చేసి ఇరవై నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. అంతేకాదు కాఫీపొడి జుట్టుకు మంచి కలరింగ్ ఏజెంట్‌లా కూడా పనిచేస్తుందని చెబుతున్నారు.

NOTE:ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

కొరియన్​ మహిళల బ్యూటీ సీక్రెట్​ ఇదే - అందానికి ఆ అలవాట్లే అతి ముఖ్యం

ABOUT THE AUTHOR

...view details