ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / offbeat

ఆంధ్రా స్టైల్ 'స్పైసీ మటన్ లివర్ ఫ్రై' - మసాలాలు అవసరం లేకుండానే మరింత రుచికరం - LIVER FRY RECIPE IN TELUGU

సింపుల్​గా ఇలా మటన్ లివర్ ఫ్రై చేసేయండి - మళ్లీ, మళ్లీ కావాలంటారు

mutton_liver_fry
mutton_liver_fry (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 15, 2025, 11:59 AM IST

Mutton Liver Fry :నాన్ వెజ్ లవర్స్​ మరీ ముఖ్యంగా ఇష్టపడేది లివర్. దుకాణంలో మాంసం ఆర్డర్ ఇచ్చి కొట్టించాక రెండు మూడు లివర్ ముక్కలైనా వేయమని అడుగుతుంటారు. ఇంకొంత మంది ప్రత్యేకంగా లివర్ మాత్రమే కావాలని అడిగి మరీ తెప్పించుకుంటారు. లివర్​లో ఉండే విటమిన్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని డాక్టర్లు కూడా చెప్తుంటారు. ఈ నేపథ్యంలో మటన్ లివర్ అందరికీ ఎంతో నచ్చేసింది. కర్రీ పాయింట్లలోనూ మటన్ లివర్ వంటకం కనిపిస్తుంది. వెళ్లడం కాస్త ఆలస్యమైందంటే అక్కడ గిన్నె ఖాళీ అయిపోతుంది.

మీరు మటన్ ప్రియులా! - మాంసంలో ఏ భాగాన్ని కొనాలో తెలుసా?

అందుకే ఇవాళ మటన్ లివర్ ఫ్రై రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చాం. ఆంధ్రా స్టైల్​లో స్పైసీ మటన్ లివర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా! మటన్ లివర్ ఫ్రై కోసం వాడే పదార్థాలు తక్కువే. అందుకే అవి తాజాగా ఉండేవి వాడుకుంటేనే రుచి బాగుంటుంది. ఇందులోకి ఎలాంటి మసాలాలు అవసరం లేదు. ఘాటు కోసం కేవలం మూడు పచ్చిమిర్రి, టీ స్పూన్ కారం సరిపోతుంది.

మటన్ లివర్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు

  • మటన్ లివర్ - 500 గ్రాములు
  • నూనె - పావు కప్పు
  • కరివేపాకు - 2 రెబ్బలు
  • పచ్చి మిర్చి - 3
  • ఉల్లిగడ్డ - 2 (మీడియం సైజువి)
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
  • పసుపు - అర చెంచా
  • కారం - 1 టేబుల్ స్పూన్
  • ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్
  • నీళ్లు - 250 ఎంఎల్
  • ఉప్పు - తగినంత
  • కొత్తమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు

మటన్ లివర్ ఫ్రై తయారీ విధానం

  • మందపాటి కడాయిలో పావుకప్పు నూనె వేడి చేసి అందులో రెండు రెబ్బల కరివేపాకు వేసుకుని చిటపటలాడించాలి.
  • పెద్ద ఉల్లి పాయ, మూడు పచ్చి మిర్చి వేసి తయారు చేసుకున్న ప్యూరీని వేసుకుని కలుపుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత ఓ టేబుల్ స్పూన్ అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అర చెంచా పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇది కూడా వాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
  • టేబుల్ స్పూన్ ధనియాల పొడి, టేబుల్ స్పూన్ కారం వేసుకుని కాస్త ఫ్రై చేసుకోవాలి.
  • పావు లీటర్ నీళ్లు పోసుకుని హై ఫ్లేమ్ మీద మరిగించాలి. ఓ పొంగు వచ్చాక అప్పటికే శుభ్రం చేసుకుని అరగంటకు పైగా నీళ్లలో నానబెట్టిన మటన్ లివర్ ముక్కల్ని వేసి కలుపుకోవాలి.
  • స్టవ్ మంట లో టు మీడియంలో ఉంటి నీళ్లు ఇంకిపోయే వరకు ఫ్రై చేయాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మధ్య మధ్యలో కలుపుతుండాలి. నీళ్లన్నీ వెళ్లిపోయి నూనె కనిపించే వరకు వేపాలి.
  • కొంచెం గ్రేవీ ఉండగానే కొంచెం కొత్తి మీర తరుగు వేసుకుని దించేసుకుంటే సరిపోతుంది.

పక్కా కొలతలతో 'చికెన్ పచ్చడి' ఇలా పెట్టండి - 3 నెలలు నిల్వ పెట్టుకోవచ్చు!

పక్కా కొలతలతో అదిరే "గోంగూర చికెన్ పచ్చడి" - ఇలా పెడితే నెల రోజులపాటు నిల్వ!

ABOUT THE AUTHOR

...view details