తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

నోరూరించే "ఆంధ్ర స్టైల్ చేపల పులుసు" - ఈ పద్ధతిలో చేస్తే టేస్ట్​ కేక అంతే! - Chepala Pulusu Recipe

Chepala Pulusu Recipe : మీరు ఇప్పటివరకు చేపలతో రకరకాల వంటకాలు ట్రై చేసి ఉంటారు. కానీ, ఎప్పుడైనా ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రుచి చూశారా? దీన్ని ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది! మరి, ఈ సూపర్ టేస్టీ చేపల పులుసును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How To Make Chepala Pulusu
Chepala Pulusu Recipe (ETV Bharat)

By ETV Bharat Features Team

Published : Sep 25, 2024, 3:52 PM IST

Updated : Sep 25, 2024, 4:48 PM IST

How To Make Chepala Pulusu in Telugu:అత్యంత ఆరోగ్యకరమైన ఆహారపదార్ధాలలో ఒకటి.. చేపలు. వీటిని మనం ఎన్నో రకాలుగా వండుకోవచ్చు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో వెరైటీ వంటకంగా దీనిని వండుకుంటుంటారు. అయితే, మీరు ఎప్పుడైనా ఇలా ఆంధ్ర స్టైల్​లో చేపల పులుసు ప్రిపేర్ చేసుకున్నారా? లేదంటే మాత్రం.. ఓసారి రుచి చూడాల్సిందే! అద్దిరిపోయే రుచి ఈ కర్రీ సొంతం. అయితే ఇంకెందుకు ఆలస్యం​.. ఈ నోరూరించే ఆంధ్ర స్టైల్​ చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా వండుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • శుభ్రం చేసిన చేపలు - 300 గ్రాములు
  • ధనియాలు - 1 టేబుల్ స్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు - 8
  • మెంతులు - అర టీస్పూన్
  • ఎండుమిర్చి - 6
  • ఉల్లిపాయలు - 2(పెద్ద సైజ్​లో ఉన్నవి)
  • పచ్చిమిర్చి - 4
  • టమాటా - 1(పెద్ద సైజ్​లో ఉన్నది)
  • ఆయిల్ - అర కప్పు
  • కరివేపాకు - 3 రెమ్మలు
  • ఉప్పు - రుచికి తగినంత
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
  • పసుపు - పావు చెంచా
  • కారం - 1 టేబుల్ స్పూన్
  • ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్
  • చింతపండు - 50 గ్రాములు
  • కొత్తిమీర - అరకట్ట

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీరను తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. అలాగే.. ఒక చిన్న బౌల్​లో చింతపండును నానబెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ధనియాలు, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఆపై మంటను లో ఫ్లేమ్​లో ఉంచి అవి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి.
  • తర్వాత ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్​లోకి తీసుకొని మెత్తని పొడిలా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి.
  • అనంతరం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చినీ మిక్సీ జార్​లోకి తీసుకొని మెత్తని పేస్ట్​లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై ఇనుప కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక.. అందులో కరివేపాకు, మిక్సీ పట్టుకున్న ఉల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఆపై మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి ఆ మిశ్రమం పచ్చివాసన పోయి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక.. అందులో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. అనంతరం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఇక టమాటాలు పూర్తిగా మగ్గిపోయానుకున్నాక.. కారం, ధనియాల పొడి వేసి కలుపుకొని మరోసారి ఆ మిశ్రమాన్ని నూనె తేలేంత వరకు బాగా వేయించుకోవాలి.
  • ఆ మిశ్రమం బాగా వేగాక.. అందులో ముందుగా నానబెట్టిన చింతపండు నుంచి తీసిన 200ఎంఎల్ చింతపండు రసాన్ని పోసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై 300ఎంఎల్ వాటర్ పోసుకొని మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి బాగా మసల కాచుకోవాలి.
  • ఇక ఆ మిశ్రమం బాగా మసులుతున్నప్పుడు.. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి. అయితే, చేప ముక్కలు వేశాక గరిటెతో కలపకుండా కడాయిని రెండు చేతులతో పట్టుకొని బాగా కదపాలి. తర్వాత మంటను లో ఫ్లేమ్​లో ఉంచి 7 నుంచి 8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
  • ఆ మిశ్రమంలో నూనె పైకి తేలి బాగా ఉడుకుపట్టాక.. మరోసారి కడాయిని చేతులతో పట్టుకొని బాగా కదుపుకోవాలి. ఆపై ఫోర్క్ స్పూన్​తో ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ముక్క ఉడికినట్లయితే.. కొత్తిమీర తరుగు, ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ధనియాల పొడి వేసుకొని ఓసారి జాగ్రత్తగా కదుపుకోవాలి.
  • ఆ తర్వాత లో ఫ్లేమ్ మీద మరో రెండు నిమిషాల పాటు మిశ్రమాన్ని ఉడికించుకొని దింపుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే నోరూరించే "ఆంధ్ర స్టైల్ చేపల పులుసు" రెడీ!
  • అయితే, చేపల పులుసును దింపుకున్న తర్వాత వెంటనే తినకుండా పూర్తిగా చల్లారాక తింటే టేస్ట్ చాలా బాగుంటుంది.
Last Updated : Sep 25, 2024, 4:48 PM IST

ABOUT THE AUTHOR

...view details