తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

బంగాళదుంపతో సూపర్ టేస్టీ "ఇడ్లీలు" - పప్పు రుబ్బే పనిలేకుండా నిమిషాల్లో రెడీ! - ALOO MASALA IDLI RECIPE

ఎప్పుడూ మినప్పిండి ఇడ్లీలు రొటీన్ - ఓసారి ఇలా బంగాళదుంపతో ట్రై చేయండి!

HOW TO MAKE POTATO MASALA IDLI
Aloo Masala Idli Recipe (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 17, 2025, 7:39 PM IST

Aloo Masala Idli Recipe in Telugu :చాలా మందికి బ్రేక్​ఫాస్ట్​లో వేడివేడి ఇడ్లీలు తినడమంటే ఎంతో ఇష్టం. మార్నింగ్ ఇడ్లీలు తినడం వల్ల పొట్ట లైట్​గా ఉంటుందని ఎక్కువ మంది వీటిని తినడానికి ఇష్టపడుతుంటారు. అలాగని ఎప్పుడూ రొటీన్​గా మినప్పిండితో చేసే, చప్పగా ఉండే ఇడ్లీలు తినాలంటే ఎవరికైనా బోరింగ్​గా అనిపిస్తుంది. అందుకే ఈసారి కాస్త వెరైటీగా "బంగాళదుంప మసాలా ఇడ్లీలను" ట్రై చేయండి. ఇవి సరికొత్త టేస్ట్​ని అందిస్తాయి. ఇడ్లీలుతిననివారు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. పైగా దీనికోసం పప్పు నానబెట్టి రుబ్బాల్సిన పనిలేదు. అప్పటికప్పుడు చాలా తక్కువ సమయంలో ఈ ఇడ్లీలను తయారుచేసుకోవచ్చు. మరి, ఈ సూపర్ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానమేంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • బంగాళదుంపలు - 4
  • పచ్చిమిర్చి - 3
  • అల్లం - అంగుళం ముక్క
  • పసుపు - పావు చెంచా
  • ఉప్మారవ్వ - కప్పున్నర
  • టమాటా ముక్కలు - పావు కప్పు
  • కొత్తిమీర తరుగు - పావు కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ఈనో ఫ్రూట్ సాల్ట్ - అర చెంచా
  • నూనె - 3 చెంచాలు
  • ఆవాలు - చెంచా
  • జీలకర్ర - 2 చెంచాలు
  • మిరియాలు - 1 చెంచా
  • నువ్వులు - 2 చెంచాలు
  • కరివేపాకు - 4 రెమ్మలు

ఇడ్లీలు మిగిలిపోతే ఇలా "బజ్జీలు" చేసుకోండి - సూపర్ టేస్టీగా ఉంటాయి గురూ!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా బంగాళదుంపలచెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  • అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న ఆలూ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, ఒక చెంచా జీలకర్ర, పసుపు, పావు కప్పు వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్​లోకి ఆ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఆపై అందులో ఇంకొన్ని వాటర్, ఉప్మారవ్వ, సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, కొత్తిమీర తరుగు, ఉప్పు, ఈనో ఫ్రూట్ సాల్ట్ వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.
  • అయితే, ఈ పిండి మిశ్రమం మరీ గట్టిగానో, పల్చగానో ఉండకుండా చూసుకోవాలి. ఆవిధంగా రవ్వ మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకున్నాక దాన్ని ఒక అరగంట పాటు పక్కనుంచాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక ఆవాలు వేసి చిటపడలాడనివ్వాలి. ఆపై జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచిన మిరియాలు వేసి వేయించుకోవాలి.
  • అవి కూడా వేగాయనుకున్నాక నువ్వులు, కరివేపాకువేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసుకొని తాలింపుని ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమంలో వేసి బాగా కలుపుకొని పక్కనుంచాలి.
  • అనంతరం ఇడ్లీ ప్లేట్లను తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని తగినంత వేసి ఆవిరి మీద సుమారు 12 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని చెంచా నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక అందులో ఉడికించిన ఇడ్లీలను అలాగే లేదా ముక్కలుగా కోసి వేసుకొని కాసేపు వేయించి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, సూపర్ టేస్టీగా ఉండే "బంగాళదుంప మసాలా ఇడ్లీ వడలు" మీ ముందు ఉంటాయి.
  • మరి, నచ్చిందా అయితే మీరు ఓసారి రెసిపీని ట్రై చేయండి. చాలా రుచికరంగా ఉండే వీటిని ఇంటిల్లిపాదీ చాలా ఇష్టంగా తింటారు.

ఆరోగ్యానికి మేలు చేసే కొర్రలతో "మృదువైన ఇడ్లీలు"- ఈ కొలతలతో సింపుల్​గా చేసేయండిలా!

ABOUT THE AUTHOR

...view details