What Not to do on Valentines Day:వాలెంటైన్స్ డేను ఘనంగా సెలెబ్రేట్ చేసుకోవాలని ప్రతి ప్రేమ జంట ఆరాటపడుతుంది. అందుకు అనుగుణంగా అక్కడికెళదాం.. అలా చేద్దాం అనుకుంటూ రకరకాల ప్రణాళికలు వేసుకుంటారు. కానీ ఈ సమయంలో తెలిసో, తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. ఫలితంగా ప్రత్యేకమైన ఈ రోజును వృథా చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఇలా జరగకుండా ఉండాలంటే ప్రేమికుల దినోత్సవం రోజున చేయకూడని పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
విష్ చేయడం మరిచిపోవద్దు: ఈ ప్రత్యేకమైన రోజున మీరు చేయాల్సిన మొట్ట మొదటి పని ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడం. కొంత మందికి శుభాకాంక్షలు చెప్పే అలవాటు ఉండక.. ఏదో ఫార్మాలిటీకి చెప్పాలా.. "విష్ చేస్తేనే ప్రేమ ఉన్నట్టా" అనేవాళ్లు ఉంటారు. కానీ, ప్రేమలో ఉన్నప్పుడు దాన్ని వ్యక్తపరచటంలో తప్పులేదు కదా. అందుకే లేట్ చేయకుండా పొద్దున్నే ఒక మంచి సందేశంతో, కలిసినప్పుడు ఒక చిరునవ్వుతో శుభాకాంక్షలు తెలపాలని నిపుణులు సూచిస్తున్నారు.
హర్ట్ చేయకండి: ఏడాదికి ఒకసారి వచ్చే ఈ రోజున మీరు ప్రేమించే వారిని హర్ట్ చేయకండి. ఎందుకంటే ఈ రోజున మీ నుంచి భాగస్వామి చాలా ఆశిస్తారు. అందుకే ఆ రోజు కేవలం ఫోన్ కాల్ తోనే సరిపెట్టకుండా.. నేరుగా వెళ్లి కలవాలని నిపుణులు అంటున్నారు. వీలైతే బయటికి తీసుకెళ్లి.. మీకు తోచిన చిన్న బహుమతి ఇవ్వండని సలహా ఇస్తున్నారు. అలా మీ ప్రియపమైన వారిని బైక్ పై షికారుకు తీసుకెళ్లండని సూచిస్తున్నారు.
గిఫ్ట్ ఇవ్వండి: చాలామంది వాలైంటైన్స్ డేకు వారి ప్రియుల నుంచి చిన్నదైనా సరే కానుకలను ఆశిస్తారు. కొంతమంది దీనికోసం ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. అయితే.. ప్లాన్ చేయకపోయినా సరే.. ఏదోక గిఫ్ట్ ఇచ్చే ప్రయత్నం చేయాలని నిపుణులు చెబుతున్నారు. షాపింగ్‌కు లేదా రెస్టారెంట్‌కు తీసుకెళ్లటం, వారికి నచ్చింది కొనివ్వటం చేయాలని.. ఏదీ కుదరక పోతే అమ్మాయిలు తొందరగా పడిపోయే చాక్లెట్ అయినా ఇవ్వాలని వివరిస్తున్నారు.