ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / lifestyle

ఆరోగ్యానికి ఆరో ప్రాణం - పీచు పదార్థాలతో ఎన్నో సమస్యలకు పరిష్కారం - FIBER CONTENT IN FOOD

పీచు పదార్థం అధికంగా లభించే పదార్థాలివే - జీర్ణవ్యవస్థ పనితీరుతో ఆరోగ్యం

diet_plan_for_good_health
diet_plan_for_good_health (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 15, 2025, 8:49 AM IST

ఆహారంలో కొన్ని మార్పుల ద్వారా ఎంతో ఆరోగ్యం దాగి ఉందని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. ముందుగా అవగాహన పెంచుకుని స్వల్ప మార్పులు చేసుకుంటే చాలని సూచిస్తున్నారు. శరీరానికి ఎలాంటి ఆహారం అవసరమో తెలుసుకుని పాటించాలంటున్నారు. ముఖ్యంగా పీచు పదార్థం అధికంగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పీచుపదార్థాన్నే పైబర్ అని అంటారు. ఇలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ బాగుంటుంది, మల బద్దకం, కొలెస్ట్రాల్ సమస్యలు కూడా రావు.

వేసవిలో ఇంట్లోనే తయారు చేసుకునే హెల్త్ డ్రింక్స్ - టీ, కాఫీ బదులు ఇవి ట్రై చేయండి

diet_plan_for_good_health (ETV Bharat)

పీచు ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు

ప్రముఖ డైటీషియన్ తులసి ఏం చెప్తున్నారో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం 'పైబర్ అత్యవసర పోషకాహారమైనా చాలామంది సరైన మోతాదులో దీనిని తీసుకోవడం లేదు. సగటున వ్యక్తి శరీరానికి అవసరమైన ఫైబర్​లో సగం మాత్రమే తీసుకుంటున్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయి. 50 ఏళ్లలోపు వయస్సున్న మగవారికి నిత్యం 30 గ్రాములు, మహిళలకు 20 గ్రాముల పీచు పదార్థం అవసరం ఉంటుంది. అందుకే తృణ ధాన్యాలు, ఓట్స్ తో తయారయ్యే పదార్థాలతో రోజును ప్రారంభిస్తే మంచిది. వీటి వల్ల మూడు గ్రాముల పీచు పదార్థం లభిస్తుంది. అందుకే పీచు పదార్థం ఎక్కువగా లభించే పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. పీచు అత్యధికంగా పియర్ పండులో 9.9గ్రాములు, ఇంకా బ్లాక్, బ్లూ బెర్రీ, అరటి, యాపిల్ పండ్లలో పైబర్ ఎక్కువ మోతాదులో లభిస్తుంది. తృణ ధాన్యాలు, పండ్లు తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం జబ్బులు నియంత్రణలో ఉంటాయని పరిశోధనలు చెప్తున్నాయి.'

  • సాలిబుల్, ఇన్ సాలిబుల్ అని ఫైబర్ రెండు రకాలుగా ఉంటుంది.
  • సాలిబుల్ ఫైబర్ సులభంగా నీళ్లలో కరిగేలా జెల్ మాదిరిగా ఉంటుంది. ఇది బీన్స్, ఫ్రూట్స్, వెజిటెబుల్స్, రాగి, ఓట్స్, పియర్స్, బార్లీ గింజల్లో ఉంటుంది. దీని వల్ల ట్రైగ్లిజరైడ్స్ తగ్గిపోతాయి. షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
  • ఇక గోధుమల ద్వారా తయారయ్యే పదార్థాల్లో ఎక్కువగా ఇన్ సాలిబుల్ ఫైబర్ లభిస్తుంది. ఇది తొందరగా కరగదు. బాదం, పిస్తా, డేట్స్, వాల్ నట్స్ లాంటి డ్రై ఫ్రూట్స్ లో కూడా ఇది ఎక్కువ మోతాదులో ఉంటుంది.

బ్రేక్ ఫాస్ట్​లో ఎప్పుడూ బియ్యం రవ్వ ఇడ్లీ కాకుండా రాగి, ఓట్స్ కలిపి చేసుకోవాలి. గోధుమ రవ్వతో ఇడ్లీ కూడా తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ వాడకం తగ్గించడం మానేసి బెర్రీలు, జాంపండ్లు, అరటి, యాపిల్ సహా అన్ని రకాల పండ్లను జ్యూస్ మాదిరి కాకుండా నేరుగా తింటే మంచిది. - తులసి, డైటీషియన్

పచ్చిబఠానీ, పాలకూర, గుమ్మడి, చిలగడదుంప, మొక్కజొన్న, బీట్ రూట్, పాలకూర, బ్రొకోలీలో పీచు అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. అయితే, అతిగా కాకుండా మితంగా తీసుకోవడమే మంచిది.

చిక్కుడు గింజల్లో ఫైబర్ తో పాటు ప్రొటీన్ ఎక్కువ, కొవ్వు పదార్థాలు తక్కువ. వెజిటేరియన్లకు ఇది ఎంతో అవసరమైన పదార్థం. నాన్ వెజిటేరియన్లు సైతం మాంసాహారానికి బదులు వారానికి రెండు సార్లు తినొచ్చు. అదే విధంగా బఠానీ, చిక్కుళ్లు, పప్పులో పీచు ఎక్కువగా, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి.

గింజలు, విత్తనాల్లో పీచు పదార్థం ఎక్కువగా లభిస్తుంది. రాగులు, కొర్రలు, క్వినోవా, ముడి బియ్యం లో పీచు అధికంగా ఉంటుంది. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉండేలా చేసి బరువు తగ్గేందుకు సహకరిస్తాయి. అదే విధంగా అవిశె గింజల్లో పైబర్ ఎక్కువగా ఉండి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే లక్షణాలుంటాయి.

'టీ' వ్యాపారంతో 10వేల కోట్లు సంపాదించిన యువ ఇంజినీర్ - ఒక్క అవకాశంతోనే బిలియనీర్

నోరూరించే 'క్యారెట్ పచ్చడి' - పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు!

ABOUT THE AUTHOR

...view details