ETV Bharat / lifestyle

సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని 'వాలంటైన్స్ డే స్టంట్స్' - లవ్​బర్డ్స్ ఏం చేస్తున్నారంటే! - LOVERS BIKE RIDING

సెలబ్రేషన్స్ పేరిట ప్రమాదకర విన్యాసాలు - నగర శివార్లలో రెచ్చిపోతున్న జంటలు

lovers_bike_riding
lovers_bike_riding (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2025, 12:44 PM IST

Valentines Day 2025 : ప్రేమికుల దినోత్సవం అంటే ప్రేమను వ్యక్తపరిచేందుకు, ప్రేమను ఆస్వాదించడానికి వచ్చిన ఓ సదవకాశం మాత్రమే. మిగతా దినోత్సవాల మాదిరిగానే దీనిని కూడా చూడాలే తప్ప, 'ఇదే అవకాశం పోతే మళ్లీ తిరిగిరాదు' అన్నట్లు వ్యవహరించకూడదు. ఫిబ్రవరి 14 మళ్లీ మళ్లీ వస్తుందని గుర్తుంచుకోవాలి. యువతీ యువకులు, భాగస్వాములు తమ ప్రేమను పంచుకునేందుకు వచ్చిన అవకాశం, సందర్భం మాత్రమే. అంతే తప్ప సెలబ్రేషన్స్ పేరిట సభ్య సమాజానికి ఇబ్బంది కలిగించేలా వ్యవహరించడం కాదు. బహిరంగ ప్రదేశాలు, ఆరుబయట, పార్కుల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులు చేయడం కాదు. 'ప్రేమికుల దినోత్సవం! మా ఇష్టం' అంటూ చెలరేగిపోతే తదనంతర పరిణామాలకు సిద్ధంగా ఉండాల్సిందే. తామేదో ఘనత సాధించినట్లుగా కొంత మంది ప్రేమికులు రెచ్చిపోతున్నారు. బైక్​లపై వెళ్తూ స్టంట్లు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో రీల్స్ పోస్టు చేస్తున్నారు.

గులాబీలతో మొదలయ్యే ప్రేమ - ఎవరికి ఏ రంగు గులాబీ ఇవ్వాలో తెలుసా?

'స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్' అని వినే ఉంటారు. ఫిబ్రవరి 14న మరచిపోని మధురానుభూతులు మిగుల్చుకునే ప్రయత్నం చేయడంలో తప్పు లేదు గానీ, ప్రాణాలను ఫణంగా పెట్టాల్సిన అవసరం లేదని తెలుసుకోంది. బైక్ రైడింగ్, విన్యాసాలు సరదాగా అనిపించొచ్చు కానీ, ఏదైనా ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఒకసారి ఊహించుకోండి.

ఈ మధ్య కాలంలో హైదరాబాద్​లో మరీ ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డుపై బైక్, కార్ రేసింగ్​లు, స్టంట్లు పెరిగిపోయాయి. కొంత మంది యువకులు పోలీసుల కళ్లుగప్పి వీటిని నిర్వహిస్తున్నారు. ఇదే అదనుగా తాజాగా వాలెంటైన్స్ డే పురస్కరించుకుని లవ్​బర్డ్స్​ సైతం రెచ్చిపోతున్నారు. పొంచి ఉన్న ప్రమాదాన్ని గ్రహించకుండా అతి వేగంతో బైక్ నడుపుతూ స్టంట్స్ చేస్తున్నారు.

నగరంలోని మలక్‌పేట్‌, చంచల్‌గూడతో పాటు పలు ప్రధాన రహదారులపై ఆకతాయిలు బైక్‌ రేసులతో రెచ్చిపోతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా రోడ్లపై 100 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతూ ప్రమాదకరమైన స్టంట్లు చేస్తున్నారు. ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికల్లో ఫేమస్‌ అయ్యేందుకు ఫీట్లు చేస్తూ ఇతరుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. యువతీ యువకుల చేష్టలతో భయాందోళనలకు గురవుతున్న ఇతర వాహనదారులు పోలీసులపై విమర్శలు గుప్పిస్తున్నారు.

గతేడాది సెప్టెంబర్లో హైదరాబాద్ నగర శివార్లలోని పహాడీ షరీఫ్ ప్రధాన రహదారిపై ప్రేమ జంట బైక్ మీద వెళ్తూ అసభ్యంగా ప్రవర్తించడంపై వాహనదారులు అవాక్కయారు. ప్రియుడు బైక్ నడుపుతుంటే ప్రియురాలు అతడి ముందు ట్యాంక్‌పై ఎదురుగా కూర్చోవడం, బండి నడుపుతున్న యువకుడిని గట్టిగా కౌగిలించుకొని ముద్దులు కురిపించడం వైరల్ గా మారింది. పక్కనే ద్విచక్ర వాహనాలపై ఎంతో మంది వెళ్తున్నా ప్రియుడు ఆమెతో సరసాలాడుతూనే బైక్‌ను నడపడం విచారకరం.

'వాలంటైన్స్ వీక్ స్పెషల్'​ - ఇంప్రెస్ చేయడానికి కొన్ని టిప్స్!

కిస్ డే, హగ్ డే ఎప్పుడో తెలుసా? వాలంటైన్స్ వీక్ ప్రత్యేకతలేంటో తెలుసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.