Tirumala Thalayeru Gundu : పురాణ ప్రసిద్ధి చెందిన అత్యంత ప్రాచీన మహాక్షేత్రం తిరుమల. చారిత్రకంగా కూడా చాలా ప్రాధాన్యం కలిగిన దివ్యధామం. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలవారి భక్తిశ్రద్ధలకు అది ప్రముఖ కేంద్రం. ఎందరో చక్రవర్తులు, భక్తయోగులు కొలుచుకున్న సంస్కృతీ సౌధం. వైఖానస ఆగమరీతులతో అర్చనా విధానాలు, పూజలు జరుగుతున్న సంప్రదాయ పరంపర ఈ శేషాచలానికి ఉంది. ఇక్కడ శ్రీవేంకటేశ్వరుడు సర్వదేవతాత్మకుడైన నారాయణ పరబ్రహ్మమని రుషుల ప్రతిపాదన. ఈ విష్ణువిరాణ్మూర్తి సాక్షాత్ వైకుంఠవాసుడే!
కొలిచిన వారికి కొంగుబంగారంగా, కోరిన కోరికలు తీర్చే శ్రీనివాసుడు ఏడుకొండలపై కొలువై భక్తకోటిని అనుగ్రహిస్తున్నాడు. అందుకే కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం భక్తులు తరలివస్తుంటారు. కాలినడకన, రోడ్డు మార్గం ద్వారా వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకుంటారు. మరి కాలినడక మార్గంలో అలిపిరి శ్రీవారి పాదాల మండపం నుంచి తిరుమలకు వెళ్లే రూట్లో ఓ రాతి గుండు కనిపిస్తుంది. అదేదో ఓ రాయి అనుకుంటే మీరు పొరబడినట్లే. దానికో ఓ చరిత్ర ఉంది. అదెంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఈ గుండు పేరు తలయేరు. అలిపిరి శ్రీవారి పాదాల మండపం నుంచి తిరుమలకు వెళ్లే కాలినడక మార్గంలో కనిపిస్తుంది. భక్తుల తనిఖీ కేంద్రానికి సమీపంలోని ఉన్న ఈ గుండుకు ప్రత్యేక చరిత్ర ఉంది. కాళ్ల నొప్పులు ఉన్న భక్తులు దీనికి మోకాళ్లు ఆనిస్తే నొప్పిపోతుందని విశ్వసిస్తారు. అందుకే కొందరు భక్తితో మరికొందరు సరదాగా చేస్తుండటంతో అందమైన చిన్నచిన్న గుంతలు ఏర్పడి ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. అనంతరం గుండు పైభాగాన ఉన్న ఆంజనేయ స్వామిని స్మరించుకుంటారు. అలా మెట్ల మార్గంలో శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు వెళ్తారు.
కొత్త శోభ సంతరించుకున్న తిరుగిరులు - కనువిందు చేస్తున్న కపిలతీర్థం జలపాతం
భక్తితో తరించి ‘సర్వం సమర్పించి’ - శాసనాల్లో శ్రీవారి విశేషాలు - Srivari Features in Inscriptions