World Oldest Man Died :ప్రపంచంలో అత్యంత వృద్ధుడైన జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్‌వుడ్ ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్ నగర సమీపంలో గల శరణాలయంలో మృతిచెందారు. ఆగస్టు 26న తన 112వ పుట్టినరోజు జరుపుకున్న జాన్ ఆల్‌ఫ్రెడ్ గిన్నిస్ రికార్డుల ప్రకారం దాదాపు తొమ్మిది నెలలపాటు ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడి హోదాలో ఉన్నారు. సౌత్‌పోర్టులోని ఓ సంరక్షణ కేంద్రంలో ఉంటున్న ఆయనకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బృందం ఈ ఏడాది ఏప్రిల్‌లో సర్టిఫికెట్ అందజేసింది. అయితే, సాధారణ జీవన విధానం, అదృష్టమే తన దీర్ఘాయుష్షు రహస్యమని ఆయన అప్పుడు చెప్పడం గమనార్హం.
చారిత్రక విషాదమైన టైటానిక్ ఓడ మునిగిన 1912లో జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్‌వుడ్ జన్మించారు. టైటానిక్ నౌక మునిగిన కొన్ని రోజులకే పుట్టిన ఆయన తన జీవిత కాలంలో రెండు ప్రపంచ యుద్ధాలను చూశారు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ఆర్మీలో సేవలందించారు. అకౌంటెంట్‌గా పదవీ విరమణ చేసిన ఆయన, ఇంతకాలం పూర్తి ఆరోగ్యంగా ఉండటానికి సాధారణ జీవన విధానమే కారణమని చెప్పేవారు.