తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇంట్రస్టింగ్ : చిలీ అత్యంత పొడవైన దేశంగా ఎలా తయారైంది? - ఆసక్తికర విషయాలు మీకు తెలుసా? - Chile Very Long Why

Why is Chile Very Long : ప్రపంచంలోనే అత్యంత పొడవైన దేశం చిలీ. ఇది చాలా మందికి తెలుసు. కానీ.. అందుకు గల భౌతిక, చారిత్రక కారణాలు మాత్రం అందరికీ తెలియదు. ఐరోపా ఖండంలోని 12 దేశాలను ఒకదానిపక్కన ఒకటి పేరిస్తే ఎంత పొడవు ఉంటాయో.. చిలీ ఒక్కటే అంత పొడవు ఉంటుంది! మరి.. అంత పొడవైన దేశంగా మారడం వెనుక ఎలాంటి ఆసక్తికర కారణాలు ఉన్నాయో ఈ స్టోరీలో చూద్దాం.

By ETV Bharat Telugu Team

Published : Jul 3, 2024, 5:07 PM IST

Chile Very Long
Why is Chile Very Long (ETV Bharat)

Why Is Chile So Long :ప్రపంచంలోనే అత్యంత పొడవైన దేశం చిలీ (Chile). ఇది దక్షిణ అమెరికా ఖండంలో ఉంది. దక్షిణ అమెరికాలోని పశ్చిమ తీరంలో సుమారు 4,300 కిలోమీటర్ల (2,700 మైళ్ళు) పొడవున విస్తరించి ఉంది చిలీ. అలాగే.. సగటున 180 కిలోమీటర్ల (110 మైళ్ళు) వెడల్పుతో ఉంటుంది. ఈ భూమ్మీద మరే దేశం కూడా ఇంతపొడవుగాలేదు. చిలీ పొడవు గురించి మరింత ఆశ్చర్యకరంగా చెప్పుకోవచ్చు. ఆ దేశం పక్కన యూరప్‌ ఖండంలోని దేశాలను ఒకదాని వెంట ఒకటి పేర్చుకుంటూపోతే.. ఏకంగా 12 దేశాలు పడతాయి! అయితే.. చిలీ ఇంత పొడవుగా ఉండటానికి కొన్ని భౌగోళిక పరిస్థితులు, మరికొన్ని చారిత్రక పరిస్థితులు కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు.

భౌగోళిక పరిస్థితులు :
చిలీ దేశానికి పశ్చిమ దిశలో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన పసిఫిక్‌ మహాసముద్రం ఉంది. చిలీ సముద్ర తీరప్రాంతం ఎంతో తెలుసా? ఏకంగా 4,300 కిలోమీటర్లు (2,700 మైళ్ళు). అంతేకాదు.. తూర్పు వైపున ఆండీస్‌ పర్వత శ్రేణులున్నాయి. నాజ్కా టెక్టోనిక్ ప్లేట్ దక్షిణ అమెరికాను తాకడం వల్ల ఆండిస్ పర్వతాలు ఏర్పడ్డాయని అంటారు. అటు పసిఫిక్ మహా సముద్రం, ఇటు ఆండీస్ పర్వతాలు.. ఇవి రెండూ చిలీ దేశాన్నిపొడవుగా ఉంచడానికి భౌగోళిక కారణమయ్యాయని నిపుణులు చెబుతారు.

26గంటలు, 825 గోల్స్‌- ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ రికార్డు- గిన్నిస్​ బుక్​లోనూ చోటు

చారిత్రక కారణాలు :
భౌగోళిక పరిస్థితులతోపాటు చారిత్రక కారణాలు కూడా చిలీని పొడవైన దేశంగా ఉంచాయని చరిత్రకారుల అభిప్రాయం. 16వ శతాబ్దంలో స్పానిష్ వారు చిలీని జయించినప్పుడు, ఆ ప్రాంతం మొత్తాన్ని ఒకే రాష్ట్రంగా పాలించారు. ఆ సమయంలో చిలీ మొత్తం ఒకే చట్టం, ఒకే కరెన్సీ, ఒకే భాషను అమలయ్యేలా చేశారు. ఇవన్నీ దేశం విడిపోకుండా చూశాయని చరిత్రకారులు చెబుతున్నారు.

అలాగే.. 19వ శతాబ్దం ప్రారంభంలో చిలీ స్పెయిన్ దేశం నుంచి స్వాతంత్య్రాన్ని పొందింది. ఆ సమయంలో కూడా దేశంలోని నాయకులు చిలీని ఒకే రాష్ట్రంగా ఉంచడానికి ప్రయత్నించారట. చిలీ పొడవాటి భూభాగాన్ని విభజించకుండా ఉండాలని కోరుకున్నారట. ఎందుకంటే.. చిలీని చిన్న చిన్న రాష్ట్రాలుగా విభజించడం వల్ల రాజకీయ అస్థిరతకు దారితీస్తుందని నాయకులు భయపడ్డారట. ఆ విధంగా.. చారిత్రక కారణాలు కూడా చిలీని పొడవైన దేశంగా ఉంచాయని చెబుతున్నారు.

వాతావరణ కారణాలు :

చిలీ దేశానికి ఉత్తరం నుంచి దక్షిణం వరకు విస్తరించి ఉన్న ఆండీస్ పర్వత శ్రేణుల పొడవు.. సుమారు 4,000 కిలోమీటర్లు! ఇవి చిలీకి వెన్నెముక లాంటివి. ఆండీస్ పర్వతాలు చిలీ వాతావరణాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. ఈ పర్వతాలు.. పసిఫిక్ మహాసముద్రం నుంచి వచ్చే చల్లటి, తేమతో కూడిన గాలిని అడ్డుకుంటాయి. దీనివల్ల చిలీ తీర ప్రాంతాలలో మధ్యధరా శీతోష్ణకాల వాతావరణం ఏర్పడుతుంది. దాంతో.. దాదాపుగా చిలీ మొత్తం ఒకే తరహా వాతావరణం ఉంటుంది. ఇలా.. వాతావరణం కూడా చిలీ పొడవున ఉన్న ప్రాంతాలన్నీ ఒక్కటే అన్న భావన కల్పించిందని చెబుతారు. ఈ విధంగా.. చారిత్రక, భౌతిక, వాతావరణ కారణాలన్నీ కలిసి.. చిలీని ప్రపంచంలోనే పొడవైన దేశంగా ఉండేలా చేశాయని చరిత్రకారులు చెబుతున్నారు.

హజ్ యాత్రలో 1,300 మంది మృతి- ఆ దేశస్థులే అత్యధికం- అదే కారణమట!

100 ఏనుగులకన్నా మేఘమే బరువు- నీటికి తడే ఉండదు- ఒక్కసారిగా షాక్ అయ్యారా?

ABOUT THE AUTHOR

...view details