ETV Bharat / international

'ఇరాన్ న్యూక్లియర్ సైట్స్​పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు వద్దు- టెహ్రాన్​పై జీ7 దేశాలు మరిన్ని ఆంక్షలు!': అమెరికా - Joe Biden On Israel - JOE BIDEN ON ISRAEL

Joe Biden On Israel : ఇరాన్​ చేసిన దాడులకు ప్రతీకారంగా ఆ దేశానికి చెందిన న్యూకియర్​ సైట్స్​పై ఇజ్రాయెల్ దాడికి తాము మద్దతివ్వమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. ఇరాన్​పై జీ7 దేశాలు విధించే మరిన్ని ఆంక్షల వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉందన్నారు. మరోవైపు, హెజ్​బొల్లాతో జరిగిన భీకర పోరలో 8మంది ఇజ్రాయెల్ సైనికులు మృతిచెందారు.

Iran Attack On Israel
Iran Attack On Israel (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2024, 7:09 AM IST

Updated : Oct 3, 2024, 8:57 AM IST

Joe Biden On Israel : ఇరాన్​ అణు కేంద్రాలకు సంబంధించిన ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులకు తాము మద్దతివ్వబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం తెలిపారు. ఇరాన్​పై మరిన్ని ఆంక్షలు విషయమై జీ7 దేశాలతో టెలిఫోన్​లో జరిపిన చర్చల తర్వాత బైడెన్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. జీ7 దేశాలు ఇరాన్​పై విధించబోయే ఆంక్షల వివరాలను త్వరలో వెల్లడించవచ్చని బైడెన్ తెలిపారు. ఈ చర్చలో భాగంగా ఇజ్రాయెల్​పై ఇరాన్​ చేసిన క్షిపణి దాడులకు అన్ని సభ్యు దేశాలు ముక్తకంఠంతో ఖండించాయని వైట్​హౌజ్​ ఓ ప్రకటనలో చెప్పింది. మరోవైపు, ఇరాన్​ దాడికి కచ్చితంగా ప్రతిచర్య ఉంటుందని యూఎస్​ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్​ స్టేట్​ కర్ట్​ క్యాంప్​బెల్​ వెల్లడించారు. ఈవ విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ అధికారుల చర్చలు కొనసాగుతాయన్నారు.

8మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి
ఇదిలా ఉండగా, హెజ్‌బొల్లా అంతమే లక్ష్యంగా లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ దళాలు భీకర పోరాటం చేస్తున్నాయి. దక్షిణ లెబనాన్‌లో హెజ్‌బొల్లాతో జరిగిన పోరులో తమ సైనికులు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఒకవైపు లెబనాన్‌లో దాడులు చేస్తూనే మరోవైపు గాజా, సిరియాలపై ఇజ్రాయెల్‌ దళాలు విరుచుకుపడ్డాయి. శత్రు స్థావరాలు లక్ష్యంగా ఈ రెండు ప్రాంతాల్లో ఇజ్రాయెల్‌ సైన్యం వైమానిక దాడులు చేశాయి.

UN సెక్రటరీ జనరల్​కు ఇజ్రాయెల్ నో ఎంట్రీ
మరోవైపు, ఇరాన్‌ దాడిని ఖండించని కారణంగా ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ను తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. తమ దేశానికి గుటెరస్​ వ్యతిరేకంగా ఉన్నారని ఆరోపించింది. దీనిపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. తాము ఇజ్రాయెల్​తో కాంటాక్ట్​లో ఉంటామని, అది బాధ్యత అని చెప్పింది. ఇజ్రాయెల్​ ఆరోపణలను ఆ దేశం అంతర్జాతీయ సంస్థ సిబ్బందిపై చేసిన మరో దాడిగా ఐరాస ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ అన్నారు.

నస్రల్లా అల్లుడు మృతి
సిరియాలోని డమాస్కస్‌లోని మజ్జే జిల్లాలో నివాస భవనాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో మృతిచెందిన ఇద్దరు లెబనాన్‌లు మృతి చెందారు. వారితో పాటు హసన్‌ నస్రల్లా అల్లుడు హసన్‌ జాఫర్‌ అల్‌- ఖాసిర్‌ సైతం మరణించినట్లు సిరియాన్‌ మానవ హక్కుల అబ్జర్వేటరీ తెలిపింది. ఇక, హెజ్‌బొల్లాకు చెందిన ఓ మీడియా కూడా దీన్ని ధ్రువీకరించింది. గత వారం బీరుట్‌లో జరిగిన దాడుల్లో హెజ్‌బొల్లా అధిపతి హసన్‌ నస్రల్లా మృతి చెందారు. ఈ దాడుల్లోనే ఆయన కుమార్తె సైతం మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి.

Last Updated : Oct 3, 2024, 8:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.