తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా ఎన్నికల ఫలితాలు - స్వింగ్‌ స్టేట్స్‌లో ట్రంప్‌ హవా

US Elections 2024 Results Live Update
US Elections 2024 Results Live Update (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Updated : 5 minutes ago

US Elections 2024 Results Live Update :యావత్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఒకవైపు పోలింగ్‌ కొనసాగుతుండగా ఓటింగ్‌ పూర్తయిన చిన్న రాష్ట్రాల్లో కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. రిపబ్లికన్ పార్టీ తరఫున మూడోసారి పోటీ చేస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ నుంచి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పోటీ చేస్తున్నారు. భారత కాలమాన ప్రకారం మంగళవారం సాయంత్రం నాలుగున్నరకు ప్రారంభమైన పోలింగ్ బుధవారం ఉదయం 11: 30 గంటలకు ముగియనుంది.

LIVE FEED

10:28 AM, 6 Nov 2024 (IST)

  • స్వింగ్‌ స్టేట్స్‌లో ట్రంప్‌ హవా
  • ఏడు రాష్ట్రాల్లో 6 చోట్ల ఆధిక్యంలో ట్రంప్‌
  • నార్త్​ కరోలీనాలో ట్రంప్ విజయం
  • పెన్సిల్వేనియా, జార్జియా, విస్కాన్సిన్‌, మిషిగన్‌, అరిజోనా రిపబ్లికన్‌ పార్టీ ఖాతాలో పడే అవకాశం

10:19 AM, 6 Nov 2024 (IST)

  • ట్రంప్‌నకు 230, హారిస్‌కు 205 సీట్లు
  • వర్జీనియాలోని 13 ఎలక్టోరల్ ఓట్లు కైవసం చేసుకున్న డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి
  • 2008 నుంచి ఈ రాష్ట్రంలో డెమోక్రట్ల పాగా

10:10 AM, 6 Nov 2024 (IST)

  • న్యూ మెక్సికోలో కమలాహారిస్‌ గెలుపు
  • 192 స్థానాలు కైవసం చేసుకున్న డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి
  • 230 స్థానాల్లో విజయం సాధించిన రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్

10:03 AM, 6 Nov 2024 (IST)

  • అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ హవా
  • 'గేమ్ సెట్‌ అండ్‌ మ్యాచ్‌' అంటూ పోస్టు పెట్టిన ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌
  • ట్రంప్‌ గెలిస్తే ఫెడరల్ ఏజెన్సీల సంఖ్య తగ్గించాలని సూచిస్తానని వెల్లడి

10:00 AM, 6 Nov 2024 (IST)

  • డెమొక్రటిక్‌ అభ్యర్థి, ట్రాన్స్​జెండర్ సారా మెక్‌ బ్రైడ్ గెలుపు
  • యూఎస్‌ కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్​గా సారా రికార్డ్

9:54 AM, 6 Nov 2024 (IST)

  • నార్త్‌ కరోలినా ట్రంప్‌దే - 230 స్థానాల్లో విజయ దుందుభి
  • మ్యాజిక్‌ ఫిగర్‌ 270కి చేరువవుతున్న రిపబ్లికన్ పార్టీ
  • 179 స్థానాల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిని కమలాహారిస్‌ విజయం

9:45 AM, 6 Nov 2024 (IST)

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. రిజల్ట్స్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాలిఫోర్నియాలో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ గెలుపొందారు. ఇక్కడి 54 ఎలక్టోరల్‌ సీట్లు ఆ పార్టీ ఖాతాలో చేరాయి. వాషింగ్టన్‌లోనూ ఆమె విజయం సాధించారు. ప్రస్తుతానికి కమలా హారిస్‌ 179 ఎలక్టోరల్‌ స్థానాల్లో గెలుపొందారు. మరోవైపు రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌ 214 ఎలక్టోరల్ స్థానాల్లో విజయం సాధించారు.

9:44 AM, 6 Nov 2024 (IST)

కమలాహారిస్‌ ఖాతాలో కాలిఫోర్నియా

  • వాషింగ్టన్‌లోనూ విజయ బావుటా
  • 179 స్థానాల్లో డెమోక్రటిక్‌ పార్టీ గెలుపు
  • 214 స్థానాల్లో విజయం సాధించిన డొనాల్డ్‌ ట్రం

9:39 AM, 6 Nov 2024 (IST)

  • 23 రాష్ట్రాల్లో గెలిచిన ట్రంప్‌
  • 13 రాష్ట్రాల్లో గెలిచిన హారిస్‌
  • రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌నకు 214 ఎలక్టోరల్ ఓట్లు, డెమొక్రటిక్ కమలా హారిస్‌కు 179 ఓట్లు

9:33 AM, 6 Nov 2024 (IST)

  • వర్జీనియాలోని 10వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌లో భారత అమెరికన్, డెమొక్రటిక్ అభ్యర్థి సుహాస్‌ సుబ్రహ్మణ్యం విజయం
  • ఒబామా హయాంలో సాంకేతిక విధాన సలహాదారుగా పనిచేసిన సుబ్రహ్మణ్యం

9:24 AM, 6 Nov 2024 (IST)

  • కమలా హారిస్ ఖాతాలో 11 రాష్ట్రాలు
  • గెలిచిన రాష్ట్రాలు : కొలరాడో, కనెక్టికట్‌, డెలవేర్‌, ఇల్లినోయీ, మసాచుసెట్స్‌, మేరీల్యాండ్‌, న్యూయార్క్‌, న్యూజెర్సీ, రోడ్‌ ఐల్యాండ్‌, వెర్మాంట్‌
  • 112 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించిన డెమొక్రటిక్ పార్టీ

9:23 AM, 6 Nov 2024 (IST)

  • ట్రంప్‌ ఖాతాలో 22 రాష్ట్రాలు
  • ట్రంప్ గెలిచిన రాష్ట్రాలు : కాన్సస్‌, అయోవా, మోంటానా, యుటా, నార్త్‌ డకోటా, వయోమింగ్‌, సౌత్‌ డకోటా, నెబ్రాస్కా, ఓక్లహోమా, టెక్సాస్‌, ఆర్కాన్సాస్‌, లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మిస్సోరి, మిసిసిపి, ఒహాయో, వెస్ట్‌ వర్జీనియా, అలబామా, సౌత్‌ కరోలినా, ఫ్లోరిడా
  • 210 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించిన రిపబ్లికన్‌ పార్టీ

9:03 AM, 6 Nov 2024 (IST)

రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌నకు 198 ఓట్లు, డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలాహారిస్‌కు 112 ఎలక్టోరల్‌ ఓట్లు

20 రాష్ట్రాల్లో ట్రంప్ విజయం

11 రాష్ట్రాల్లో గెలిచిన కమలా హారిస్

8:32 AM, 6 Nov 2024 (IST)

  • 20 రాష్ట్రాల్లో గెలిచిన ట్రంప్‌
  • 9 రాష్ట్రాల్లో గెలిచిన హారిస్‌

8:23 AM, 6 Nov 2024 (IST)

డెమొక్రటిక్‌ అభ్యర్థి రాజా కృష్ణమూర్తి విజయం

ఇల్లినోయీలోని 8వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి భారత అమెరికన్‌, డెమొక్రటిక్ అభ్యర్థి రాజా కృష్ణమూర్తి గెలుపొందారు. 2017 నుంచి ఆయన ఇక్కడ విజయం సాధిస్తున్నారు.

7:46 AM, 6 Nov 2024 (IST)

ఫలితాల్లో దూసుకెళ్తున్న ట్రంప్

  • 17 రాష్ట్రాల్లో గెలిచిన ట్రంప్‌
  • 9 రాష్ట్రాల్లో గెలిచిన హారిస్‌

7:32 AM, 6 Nov 2024 (IST)

ట్రంప్‌ గెలిచిన రాష్ట్రాలు

  • అలబామా, ఆర్కాన్సాస్‌, ఫ్లోరిడా,ఇండియానా
  • కెంటకీ, మిసిసిపి, ఓక్లహోమా, టెన్నెసీ
  • వెస్ట్‌ వర్జీనియా, సౌత్‌ కరోలినా

7:31 AM, 6 Nov 2024 (IST)

కమలాహారిస్‌ గెలిచిన రాష్ట్రాలు

  • కనెక్టికట్‌, డెలవేర్‌, ఇల్లినోయీ, మసాచుసెట్స్‌
  • మేరీల్యాండ్‌, న్యూజెర్సీ, రోడ్‌ ఐల్యాండ్‌, వెర్మాంట్‌

7:27 AM, 6 Nov 2024 (IST)

ట్రంప్‌, హారిస్ హోరాహోరీ

  • 10 రాష్ట్రాల్లో గెలిచిన ట్రంప్‌
  • 8 రాష్ట్రాల్లో గెలిచిన హారిస్‌
  • డొనాల్డ్‌ ట్రంప్‌ 101 ఎలక్టోరల్ ఓట్లు, హారిస్‌కు 71 ఎలక్టోరల్‌ ఓట్లు

6:53 AM, 6 Nov 2024 (IST)

మెజార్టీ రాష్ట్రాల్లో ట్రంప్‌దే ఆధిక్యం

  • రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌నకు 95 ఓట్లు ,డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలాహారిస్‌కు 35 ఎలక్టోరల్‌ ఓట్లు
  • అలబామా, ఫ్లోరిడా, ఇండియానా, కెంటకీ, మిసిసిపి, ఓక్లహోమా, సౌత్‌ కరోలినా, టెన్నెసీ, వెస్ట్‌ వర్జీనియా ట్రంప్‌ విజయం
  • వెర్మాంట్‌, రోడ్‌ ఐల్యాండ్‌, మేరీల్యాండ్‌, మసాచుసెట్స్‌, కనెక్టికట్‌లో కమల గెలుపు

6:38 AM, 6 Nov 2024 (IST)

  • వెర్మాంట్‌లో గెలిచిన కమలా హారిస్‌
  • డెమొక్రట్ల ఖాతాలోకి మూడు ఎలక్టోరల్‌ సీట్లు

6:26 AM, 6 Nov 2024 (IST)

  • ఆరు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్‌
  • ఇండియానా, కెంటకీ, వెస్ట్ వర్జీనియా రాష్ట్రాల్లో గెలిచిన ట్రంప్
  • మూడు రాష్ట్రాల్లో వరుసగా మూడోసారి ట్రంప్‌ జయభేరి
  • ట్రంప్ ఖాతాలోకి 23 ఎలక్టోరల్‌ సీట్లు
Last Updated : 5 minutes ago

ABOUT THE AUTHOR

...view details