తెలంగాణ

telangana

ETV Bharat / international

హారిస్​పై డొనాల్డ్ ట్రంప్ లీడ్- 'కమలను చైనా ఆడేసుకుంటుంది ఇక!'

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ దూకుడు- కమలపై స్వల్ప ఆధిక్యం!

US Elections 2024
US Elections 2024 (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

US Elections 2024 Survey :అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు! వాల్ స్టీట్ జర్నల్ నిర్వహించిన జాతీయ సర్వేలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్​పై ట్రంప్ స్వల్ప ఆధిక్యం సాధించినట్లు తేలింది. ట్రంప్​కు 47 శాతం, హారిస్​కు 45 శాతం మంది ఆదరణ ఉన్నట్లు సర్వే సంస్థ తెలిపింది. కమలపై హారిస్ 2 శాతం ఆధిక్యంలో ఉన్నట్లు పేర్కొంది.

మళ్లీ ట్రంప్​దే లీడ్
సీఎన్​బీసీఆల్ అమెరికా ఎకనామిక్ సర్వే ప్రకారం కూడా డొనాల్డ్ ట్రంప్ కమలపై ఆధిక్యంలో ఉన్నారు. ట్రంప్​కు 48 శాతం మంది మొగ్గు చూపగా, కమలకు 46 శాతం మంది జైకొట్టారు. ఆగస్టులో ఈ సంస్థ చేసిన సర్వేలోనూ ట్రంపే ఆధిక్యాన్ని కనబర్చారు. ఏడు రాష్ట్రాల్లో కమలపై ట్రంప్ లీడ్​లో ఉన్నారు.

అన్ని పోల్స్ ట్రాక్ చేసి చూస్తే కమలదే ఆధిక్యం!
అన్ని ప్రధాన జాతీయ, ప్రాంతీయ పోల్‌ సంస్థలను ట్రాక్ చేసే 'రియల్ క్లియర్ పాలిటిక్స్ సంస్థ' ప్రకారం, హారిస్ జాతీయ స్థాయిలో ట్రంప్​పై 0.3 శాతం ఆధిక్యంలో ఉన్నారు. అరిజోనా, నెవాడా, విస్కాన్సిన్, మిచిగాన్, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియాలో ట్రంప్ 0.9శాతం ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. అమెరికన్ ఫైనాన్షియల్ ఎక్స్ఛేంజ్, ప్రిడిక్షన్ మార్కెట్ అయిన కల్షి, హారిస్‌ కంటే ట్రంప్‌ ఆధిక్యాన్ని కనబరుస్తున్నట్లు తేల్చింది. ఎన్నికల్లో ట్రంప్​కు 61 శాతం విజయావకాశాలు ఉండగా, హారిస్​కు 39 శాతం ఛాన్సు ఉన్నట్లు తెలిపింది.

'కమలను చైనా ఆడేసుకుంటుంది'
మరోవైపు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి కమలా హారిస్​పై మరోసారి విమర్శలు గుప్పించారు. కమల అధికారంలోకి వస్తే చైనా ఆమెను చిన్నపిల్ల మాదిరిగా ఆడేసుకుంటుందని ఆరోపించారు. ఓ బిగినర్​తో గ్రాండ్ మాస్టర్ గేమ్ ఆడుకుంటున్నట్లు బీజింగ్ ప్రవర్తన కమల పట్ల ఉంటుందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్‌ ఓ రేడియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'ఒకవేళ కమలాహారిస్‌ విజయం సాధిస్తే ఆమె చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో చర్చలు జరపాల్సి ఉంటుంది. అప్పుడు ఆమెతో జిన్‌పింగ్‌ ఎలా వ్యవహరిస్తారు?' అని హోస్ట్​ ట్రంప్​ను ప్రశ్నించారు. ఓ చిన్న పిల్ల మాదిరిగా కమలను చూస్తారని ట్రంప్ బదులిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details