తెలంగాణ

telangana

ETV Bharat / international

మీటింగ్​ నుంచి వస్తుండగా స్లొవేకియా ప్రధానిపై కాల్పులు- పరిస్థితి విషమం - SLOVAK PRIME MINISTER Attacked

Slovakia PM Shot : స్లొవేకియా ప్రధాని రాబర్డ్‌ ఫికోపై ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది.

Slovak Prime Minister Shot
Slovak Prime Minister Shot (Source : Associated Press)

By ETV Bharat Telugu Team

Published : May 15, 2024, 9:52 PM IST

Updated : May 15, 2024, 10:59 PM IST

Slovakia PM Shot : స్లొవేకియా ప్రధాని రాబర్ట్‌ ఫికోపై ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషయంగా ఉంది. ప్రధాని రాబర్ట్ ఫికోపై జరిగిన కాల్పుల ఘటనను డిప్యూటీ స్పీకర్‌ లుబోస్‌ బ్లహా ధ్రువీకరించారు.

కడుపులోకి బుల్లెట్‌!
హాండ్లోవాలో కేబినెట్‌ మీటింగ్‌లో పాల్గొని తిరిగివస్తుండగా ఓ దుండగుడు కాల్పులు జరిపినట్లు సమాచారం. దుండగుడు జరిపిన నాలుగు రౌండ్ల కాల్పుల్లో రాబర్ట్ ఫికో కడుపులోకి బుల్లెట్‌ దూసుకుపోయింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనను ఆ దేశ అధ్యక్షుడు జుజానా కాపుటోవా తీవ్రంగా ఖండించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. స్లోవేకియా రాజధాని బ్రెటిస్లావాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాండ్లోవా నగరంలోని హౌస్‌ ఆఫ్‌ కల్చర్‌ భవనం బయట ఈ ఘటన జరగడం గమనార్హం.

ఎందుకో జరిపాడో?
Slovakia Prime Minister Accident : హాండ్లోవాలోని ఆస్పత్రికి తీసుకెళ్లిన సమయంలో రాబర్ట్ ఫికో స్పృహలోనే ఉన్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వరుసగా కాల్పులు జరపడం తాను చూసినట్లు ఓ ప్రత్యక్ష సాక్షి వెల్లడించాడు. ఇక సెక్యూరిటీ సిబ్బంది ఓ వ్యక్తిని కారులో పడేసి తీసుకెళ్లడం చూసినట్లు మరో సాక్షి చెప్పాడు. అయితే ఆ దుండగుడు ఎందుకు ప్రధానిపై కాల్పులు జరిపాడనేది మాత్రం వెల్లడికాలేదు.

'చాలా నీచమైన దాడి'
స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై కాల్పుల ఘటనపై ఐరోపా పలు దేశాధినేతలు స్పందించారు. ఇది చాలా నీచమైన దాడి అని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ అభివర్ణించారు. ఇలాంటి హింసాత్మక చర్యలకు స్థానం లేదని తెలిపారు. ఈ సంఘటన గురించి విని షాక్ అయినట్లు చెక్ రిపబ్లిక్ ప్రధాని పీటర్ ఫియాలా గ్ పేర్కొన్నారు. రాబర్ట్ ఫికో త్వరగా కోలుకోవాలని ఆశించారు. ఈ కష్టకాలంలో తన ఆలోచనలు స్లోవేకియా ప్రధానిపై ఉంటాయని పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ పేర్కొన్నారు.

Last Updated : May 15, 2024, 10:59 PM IST

ABOUT THE AUTHOR

...view details